మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -115
· 115-సోగ్గాడు ,ముందడుగు దర్శకఫే౦ సక్సెస్ఫుల్ హిందీ చిత్రదర్శకుడు –కే .బాపయ్య
· కోవెలమూడి బాపయ్య ప్రముఖ తెలుగు, హిందీ సినిమా దర్శకుడు.[1] తెలుగు, హిందీ భాషలలో 80 సినిమాలకు దర్శకత్వం వహించారు.
జననం
బాపయ్య గారి చిన్నతనం లోనే తల్లిదండ్రులు మరణించారు, ఇతని అలానాపాలాన అంతా పిన తండ్రి అయిన ప్రముఖ దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు గారే చూసారు. వీరి ప్రాధమిక విద్య విజయవాడ, మద్రాసు లలో జరిగింది.
సినిమా రంగం
బాపయ్య 1954 లో ప్రముఖ దర్శకులు కె.బి. తిలక్ వద్ద సహాయకుడిగా చేరి ముద్దుబిడ్డ, ఎం.యల్.ఎ., అత్తా ఒక ఇంటి కోడలే సినిమాలకు పనిచేసారు. 1964 లో తాపీ చాణక్యల వద్ద సహాయ దర్శకునిగా రాముడు- బీముడు చిత్రానికి పనిచేసారు. తన పిన తండ్రి కె.యస్. ప్రకాశరావు దర్శకత్వం లో రూపొందిన ప్రేమనగర్ చిత్రానికి అసోసియట్ గా పనిచేశాడు. దర్శకత్వ మెళకువలు నేర్చుకుని 1970లో మొదటి సారి దర్శకత్వ భాద్యత వహించిన సినిమా విజయా & సురేష్ కంబైన్స్ బ్యానర్‌పై నిర్మించబడిన ద్రోహి. ఇది విజయం సాధించలేదు.
1975 లో విడుదలైన ఎదురు లేని మనిషి సినిమాలో ఎన్.టి. రామారావు ను కొత్తపంధాలో కె.బాపయ్య చూపారు. దుస్తులు, పాటలు, డాన్సులు మూడింటిలోనూ అప్పటికి ఎన్.టి.ఆర్ ఇమేజికి భిన్నంగా చిత్రంలో చూపబడ్డారు.
1975లో వీరు దర్శకత్వం వహించిన సోగ్గాడు చిత్రం వీరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. పల్లెటూరు నేపథ్యంలో శోభన్ బాబు హీరోగా డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమా గొప్ప విజయం సాధించి అనేక రికార్డులను సొంతం చేసుకొంది. శోభన్ బాబును “సోగ్గాడు శోభన్ బాబు” అని ఈ సినిమా తరువాత పిలువ సాగారు.
హిందీ సినిమా రంగం
బాపయ్య దర్శకత్వంలో తెలుగులో ఘన విజయం సాధించిన సోగ్గాడు సినిమాను 1977లో దిల్ దార్ పేరుతో హిందీ భాషలో అయన దర్శకత్వంలోనే పునర్మించా రు. వీరి దర్శకత్వంలో1985 లో పాతాళ బైరవి తెలుగు సినిమాని హిందీలో తీసారు. తరువాత వీరు దాదాపు 40 సినిమాలకు దర్శకత్వం చేసి బాలిహుడ్ లో అగ్ర దర్శకునిగా పేరు పొందారు
చిత్రసమాహారం
తెలుగు
· ద్రోహి (1970)
· మేమూ మనుషులమే (1973)
· ఊర్వశి (1974)
· ఎదురులేని మనిషి (1975)
· సోగ్గాడు (1975)
· గడుసు పిల్లోడు (1977)
· చరిత్ర హీనులు (1977)
· ఇంద్రధనుస్సు (1978)
· యుగపురుషుడు (1978)
· సాహసవంతుడు (1978)
· బుర్రిపాలెం బుల్లోడు (1979)
· మండే గుండెలు (1979)
· అగ్గిరవ్వ (1981)
· అగ్నిపూలు (1981)
· గురు శిష్యులు (1981)
· కలియుగ రాముడు (1982)
· నా దేశం (1982)
· నివురుగప్పిన నిప్పు (1982)
· ముందడుగు (1983)
· చట్టంతో పోరాటం (1985)
· జయం మనదే (1986)
· మకుటం లేని మహారాజు (1987)
· మా ఊరి మగాడు (1987)
హిందీ
హిందీ
· దిల్దార్ (1977)
· దిల్ ఔర్ దీవార్ (1978)
· టక్కర్ (1980)
· బందిష్ (1980)
· సింధూర్ బనే జ్వాలా (1982)
· మవాలి (1983)
· ఘర్ ఏక్ మందిర్ (1984)
· మక్సద్ (1984)
· ఆజ్ కా దౌర్ (1985)
· పాతాళ్ భైరవి (1985)
· ఆగ్ ఔర్ షోలా (1986)
· మద్దత్ (1986)
· స్వర్గ్ సే సుందర్ (1986)
· హిమ్మత్ ఔర్ మెహనత్ (198
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-3-22-ఉయ్యూరు