బి.వసంత నాలుగు దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన సినిమా నేపథ్య గాయని.
జీవిత విశేషాలు
బాల్యం, విద్యాభ్యాసం
బొడ్డుపల్లి బాలవసంత గుంటూరులో 1944, మార్చి 28న జన్మించింది. ఈమె తల్లిదండ్రుల పేర్లు బొడ్డుపల్లి రవీంద్రనాథ్, దుర్గ. ఈమె తండ్రి మంచి నటుడు. పలు నాటకాలలో నటించాడు. భలే పెళ్లి, తారుమారు అనే సినిమాలలో హీరోగా నటించాడు. ఇతడు మంచి ఫొటోగ్రాఫర్ కూడా. ఈమె తల్లి దుర్గ మంచి సంగీత విద్వాంసురాలు. వీణ బాగా వాయించేది. తల్లి దండ్రుల ప్రభావంతో వసంత సంగీతం పట్ల మక్కువ పెంచుకుంది. మహావాది వెంకటప్పయ్య, రాఘవేంద్రరావుల దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. వినోద్ ఆర్కెస్ట్రాలో చేరి అనేక సినిమా పాటల కచేరీలు చేసింది. ఈమె బి.ఎస్సి వరకు చదువుకుంది. తండ్రి ప్రోత్సాహంతో చలనచిత్ర రంగంలో అడుగు పెట్టింది[1].
కుటుంబం
ఈమె భర్త దోర్బల సుధాకర్ హైదరాబాదు సెక్రెటేరియట్లో పనిచేశాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టారు. పెద్ద కుమార్తె పేరు సురేఖ. రెండవ కుమార్తె సుచిత్ర. కుమారుడు శరత్.
సినిమా రంగ]
ఈమె 1961లో వాగ్దానం చిత్రంలో తొలిసారిగా పాడింది. తరువాత తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ చిత్రాలలో సుమారు 3000కు పైగా పాటలను పాడింది. పెండ్యాల నాగేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావు, కె.వి.మహదేవన్, చెళ్ళపిళ్ళ సత్యం, కె.చక్రవర్తి మొదలైన సంగీత దర్శకుల సారథ్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పిఠాపురం నాగేశ్వరరావు, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల మొదలైన ప్రఖ్యాత గాయకులతో కలిసి అనేక పాటలు పాడింది. ఈమె అన్ని రకాల పాటలు పాడినా చిన్నపిల్లల పాటలే ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈమె రాజనర్తకియ రహస్య అనే కన్నడ సినిమా, మంచికి స్థానం లేదు అనే తెలుగు సినిమాకు సంగీత దర్శకత్వం వహించింది.
తెలుగు సినిమా పాటల జాబితా
ఈమె పాడిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:
తర విశేషాలు
ఈమె పాడిన ప్రైవేటు పాటలు అనేకం కేసెట్లుగా విడుదలయ్యాయి. కొన్ని కేసెట్లకు ఈమె స్వరకల్పన చేసింది. హెచ్.ఎం.వి. సంస్థ కోసం క్రీస్తుగానసుధ, క్రీస్తు గానం, ఆరాధన, జీవాహారం మొదలైన క్రైస్తవ గీతాల ఆల్బమ్స్, సంగీత సంస్థ కోసం జానపద గేయాల ఆల్బమ్ రూపొందించింది. సినిమాల్లో పనిచేస్తూనే బయట అనేక వందల కచేరీలు ఇచ్చింది. అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి విదేశాలను అనేక సార్లు పర్యటించి సంగీత కచేరీలు చేసింది.
మూలాలు
సినిమా ఓ ప్రపంచం. ఆ ప్రపంచంలో -హీరో లేదా హీరోయిన్ మరీకాకుంటే దర్శకుడో, నిర్మాతో.. ఇలా సెలబ్రిటీ పుట్టిన రోజుని సెలబ్రేషన్ చేస్తుంటాం. మంచిదే, కానీ, ఆ ప్రపంచం ఆవిష్కర్తల్లో భాగమైన వ్యక్తులు
మస్తిష్కంలోకి వచ్చినపుడు గుర్తు చేసుకోవడం కనీస మర్యాద. 85ఏళ్ల ఏపీ కోమల పుట్టిన రోజు ఈరోజు. సంప్రదాయ గాత్రాన్ని సినిమాకు అందించి -మేలిమి బంగారంలాంటి సినీ కృతులను తెలుగు ప్రజలకు
సంపదగా అందించిన ఆ మహానుభావురాలికి శుభాకాంక్షలుగా..
అది 1946. సినీ త్యాగరాజు చిత్తూరు నాగయ్య త్యాగయ్య చిత్రాన్ని రూపొందించారు. అందులో పసి పిల్లల నృత్యానికి -పిల్లనగ్రోవిని తలపించే గాత్రం ఒకటి వినిపిస్తుంది. -మధురానగరిలో చల్లనమ్మబోదు దారి విడువు కృష్ణా.. అంటూ సాగుతుంది ఆ పాట. ఒక్కసారి వినిచూడండి.. సవాలక్ష వత్తిళ్లను మెదళ్ల నుంచి తీసిపారేసే సుమధుర గాత్రం అది. ఆ పాట పాడింది -ఏపీ కోమల. తరువాత -సినీరంగ మధురానగరిలో ఆమె పాటలన్నీ చల్లలాంటివే అయ్యాయి. ఇది మన మాట కాదు. ఆనాటి తరంలోని సమవుజ్జీల చమత్కారం.
పదములు చాలు రామా.. సరియా మాతో సమరాన నిలువగలడా -అన్న రెండు పాటలను ఏపీ కోమల గానం చేశారు. మొదటి పాటలో సరళమైన భక్త్భివన వినిపిస్తుంది. రెండో పాటలో సత్యభామాదేవి అభిజాత్యం మనసుకు తోస్తుంది. రెండు పాటలూ అత్యద్భుతమే. శ్రోతల మనోఫలకంపై చిరస్థాయిగా ఉండిపోయేవే. 1935 ఆగస్టు 28న లక్ష్మమ్మ, ఎ పార్థసారథి దంతులకు మద్రాసులో జన్మించారు ఏపీ కోమల. జన్మకారుకులు సంగీతాభిలాషులు కనుక, బాల్యంనుంచే సాధన మొదలైంది ఏపీ కోమలకు. రాజమండ్రిలో గురుకులవాసం. పైడిస్వామి, కోమల మేనత్త కొడుకు ఎస్ నర్సింహులు వద్ద గాత్ర సంగీతాభ్యాసం మొదలైంది. అలా సంగీత సాధనలో దిట్ట అనిపించుకున్న కోమల -తమిళం, తెలుగేకాదు, సింహళ, మలయాళ భాషల్లోనూ మంచి గాయనిగా గుర్తింపు సాధించారు. పాట పాడేందుకు మైక్ అవసరంలేని గాయని ఎవరూ? అంటే ఆతరంలో కోమల పేరే చెప్పేవారట. ఆకాశవాణిలో గ్రేడ్-1 సంగీత దర్శకురాలిగా మల్లిక్, కోటేశ్వరయ్యర్లాంటి వారి వద్ద సంగీత మెళకువలకు పదును పెట్టుకున్నారు. ఆమె చేసిన కచేరీలెన్నో లెక్క లేదు. ‘సాతంత్య్రం వచ్చినపుడు అనేకమంది కళాకారులతో కలిసి ఆకాశవాణిలో జరిపిన వేడుకలు నా మనసులో ఇంకా నిండిపోయే ఉన్నాయి’ అంటారామె. దేశభక్తిని చాటుకునే ప్రతీ విషయానికీ ఆమె ముందుకున్నారు.
1946లో త్యాగయ్య చిత్రంలో పాట పాడటంతో -సంప్రదాయ సంగీతాన్ని సినిమాకు తనదైన శైలిలో అందించటం మొదలెట్టారు. వైవిధ్యమైన కోమల గాత్ర ధర్మాన్ని ఇష్టపడే ఘంటసాల మాస్టారు, అనేక చిత్రాల్లో ఆమెతో పాటలు పాడించారు. లీల, స్వర్ణలతలాంటి గాయనీమణులు అత్యంత ఇష్టమైన స్నేహితులని అంటారామె. ‘తాళగ జాలనురా’ అనే జావళి శ్రీలక్ష్మమ్మ కథలో, ‘పంకజశయన’ పాట రంగులరాట్నంలో, యశోదకృష్ణలో ‘పొన్నలు విరిసేవేళలో..’లాంటి అపూర్వమైన పాటలు ఆమె గాత్రంనుంచి వెలువడినవే. శాస్ర్తియ సంగీతంలో పాటలంటే ఏపీ కోమలే పాడాలి అన్నంత రాణించారామె. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి అవార్డు అందుకున్నారు కోమల. అప్పటి సీఎం జయలలిత అవార్డు అందిస్తూ -‘నేనే మీ ఇంటికి వచ్చి ఇవ్వాలి’ అన్నారట. అంతుకుమించి దక్కే గౌరవం ఏముంటుంది? అంటూ సంతోషిస్తారు కోమల. ఆకాశవాణిలో ఉద్యోగ విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపుతున్న ఆమె వయస్సు 85ఏళ్లు. సినిమాలకు ఎన్ని పాటలు పాడినా -త్యాగరాజ కీర్తనలు, దీక్షితార్ కృతులే మనసులో మెదలాడుతుంటాయి అంటారామె.
1-పొలిమేర దాటిపోతున్నా ఓ గువ్వల చెన్న
పొరుగూరికి చేరిపోతున్నా ఓ గువ్వల చెన్న
కథ మారే రోజులు కోరేనూ ఓ గువ్వలచెన్న
కల తీరే దారులు వెతికేనూ ఓ గువ్వలచెన్నా
ఆ ఆ ఆ ఆ ..ఆ ఆ ఆ ఆ
చరణం 1 :
గుళ్ళో నిను చూడలేకున్నా ఓ గువ్వల చెన్న
గుండెల్లో దాచుకున్నాలే ఓ గువ్వలచెన్న
ఆ.ఆఆ
యే సీమల తిరుగాడినా ఓ గువ్వలచెన్న
నీ దీవెనలందించాలన్నా ఓ గువ్వలచెన్న
2-చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే…
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే…
చందమామ రావే జాబిల్లి రావే
చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే…
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే…
చందమామ రావే జాబిల్లి రావే
మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధా మాధవ గాధల రంజిలు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
బృందావనం బృందావనం
హే కృష్ణా ముకుందా మురారీ
కృష్ణా ముకుందా మురారీ..
జయ కృష్ణా ముకుందా మురారీ
జయ జయ కృష్ణా ముకుందా మురారీ
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే…
చందమామ రావే జాబిల్లి రావే