మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-5
కాంగ్రెస్ మితవాదుల చేతుల్లో ఉండగా దానికి అనుబంధంగా పూనాలో రాష్ట్రీయ సమావేశం జరపలనిఆప్టే నిర్ణయించగాఆహ్వాన సంఘాధ్యక్షుడు ఆయనే అయ్యాడు .గోఖలే మరణం దాదాభాయ్ నౌరోజి ,ఫిరోజ్ షా మెహతాలు ఎక్కువ శ్రద్ధ చూపలేదు .హోర్మన్ జీ వాడియా ,బొంబాయి గవర్నర లార్డ్ వెల్లింగ్టన్ లు హాజరయ్యారు ,గాంధీ మొదలైన ప్రముఖులు పాల్గొన్నారు .ఆప్టే ప్రేక్షకుడుగా ను ప్రతినిదిగానూ పాల్గొన్నాడు ,కాశీతాయ్ కనిత్కర్ వంటి మహిళా ప్రముఖులు ఎన్నికయ్యేట్లు ఆప్టే సహకరించాడు .సభల తెర వెనుక కృషి అంతా ఆయనదే .
భారత సాంఘిక సభను ఆప్టే పూర్తిగా సమర్ధించి సమావేశాలకు హాజరయ్యాడు .పూనా భారత బాలికోన్నత పాఠశాల అభి వృద్ధికి విశేష కృషి చేశాడు .ప్రజలుఆయనను ‘’హుజూర్ పాగా ‘’అని గౌరవంగా పిలిచేవారు .గోఖలే రాజకీయాలేకాక సాహిత్య చర్చలుకూడా ఆప్టే తో జరిపేవాడు .1903లో బొంబాయి లెజిస్లేచర్ కౌన్సిల్ సభ్యుడిగా గోఖలే ఆప్టే చేత నామినేషన్ వేయించాడు .పోటీగా తిలక్ వర్గానికి చెందిన కేల్కర్ నిలబడగా ఆయన పై రాజకీయ నేరం ఉందని ప్రభుత్వం అనర్హుడిగా ప్రకటించగా ,ఆప్టే బాధ పడ్డాడు .
ఆప్టే తన ‘’మీ ‘’నవలలో భావానంద సంస్థ ను వర్ణించాడు .అవేభావాలతో 1905లో గోఖలే ‘’సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ’’స్థాపించాడు .14-2-1904న ఆప్టే ను చూడాలని ఉందని గోఖలే కబురు చేయగా వెళ్ళాడు .అదే వారిద్దరి చివరి సమావేశామవటం బాధాకరం .ఇద్దరి అనుబంధం అంత గొప్పది.పూనా చిత్రశాల ప్రెస్ యజమాని వాసు కాకా జోషీ ఆప్టే కు మంచిమిత్రుడు .నాగపూర్ కు చెందిన శ్రీహర దేవ్ పండిట్ కూడా ఆప్తమిత్రుడే .పూనా ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్టే పై అమితగౌరవం .పూనాలోని ఇంగ్లీష్ వారైన క్లాడ్ హిల్ ,మౌంట్ ఫర్డ్ వగైరా ఆప్తెకు సన్నిహితమిత్రులు .
సంఘ సంస్కర్త
సంఘ సంస్కరణ లపై ఆప్టే అభిప్రాయాలను అందరూ గౌరవించేవారు .గోపాల రావు నవలలో ఆప్టే తనమనోభావాలను స్పష్టంగా తెలియజేశాడు .’’పణ్ లక్షాత్ కోణ్ ఘెతో ‘’నవల ,’’భయంకర్ దివ్య ‘’కర్మయోగ్ నవలలో కుటుంబాలలో సంబంధాలు స్త్రీ విద్య కులభేదాలు ,విధవా పునర్వివాహం లపై చక్కని చర్చ చేసి మార్గదర్శి అయ్యాడు .’’తమకుమార్తెలకు 16 ఏళ్ళ లోపు పునర్వివాహాలు చేయం ‘’అని మిత్రమండలి సభ్యుల చేత ఆప్టే గోఖలెలు సంతకాలు చేయించారు .1890లో ప్రభుత్వానికి పంపిన ‘’కోర్కెల పత్రం ‘’పై మొదట సంతకాలు చేసిన 40మందిలో తిలక్ మొదటి వాడు .సంఘసంస్కర్తలేకాక కొందరు పూర్వాచార పరాయణులుకూడా సంతకాలు చేశారు .
1913ఫిబ్రవరి 19న ఆప్టే కుమార్తె మరణించింది .తట్టుకోలేక భార్యతో లోనావాలా లో కొన్ని రోజులు గడిపాడు .తండ్రికూడా వచ్చి ఓదార్చాడు .కూతురు మరణ దుఖంతో అన్నం కూడా తినేవాడు కాదు .ఆసమయం లోనే రాస్తున్న కర్మయోగ్ కరామనూక్ నవలలు ఆగిపోయాయి .1914లో ఢిల్లీలో జరిగిన మతాదాయ సంస్థల మహాసభకు వెళ్ళాడుడు కానీ చాలా నీరసంగా ఉన్నాడు .సోమవారాలు భోజనం చేయమని భార్య హితవు చెప్పింది .ఆమెతో కలిసి హరిద్వార్ ఋషీకేశ్ ,మధుర బృందావన్ ఆగ్రా వగైరా క్షేత్ర సందర్శనం చేసి కొంతవరకు ఊరట చెందాడు .పూనాకు తిరిగిరాగానే మళ్ళీ జబ్బుపడ్డాడు .ఆహారలోపమే అని వైద్యులు తేల్చారు .క్రమంగా ఆహారం తీసుకోవటం మొదలుపెట్టాడు .1914చివర్లోతండ్రి మంచానపడితే అహోరాత్రాలు సేవ చేశాడు ,కానీ ఆయన 1915ఫిబ్రవరిలో చనిపోయాడు .అదేనెలలోగోఖలె మరణించాడు .ఫిబ్రవరి అంటే భయం వేసింది .వెంట ఎవరో ఒకరు ఉండాలని భావించాడు .బంధువు లందర్నీ పిలిపించాడు .మేనత్త పిల్లలు కూడా వచ్చారు .అయినా ఊరట పొందలేకపోయాడు .1915లో పూనా నగర పాలక సంఘాధ్యక్షుడు గా ఎన్నికయ్యాడు .బొంబాయి యూని వర్సిటి ఆహ్వానం పై విల్సన్ స్మారక ఉపన్యాసాలుగా ప్రాకృత భాషాభి వృద్ధి సంస్కృత నాటకాల ప్రయోజనం ,,ప్రాకృత –మరాటీ భాషా సంబంధం ,జ్ఞానేశ్వర్ కు ముందు తర్వాత మరాటీ సాహిత్యం లపై ఉపన్యాసాలిచ్చాడు.
1916అక్టోబర్ 21 న రాష్ట్ర కాంగ్రెస్ సభ జిన్నా అధ్యక్షతన జరిగింది .రాజకీయ సంస్కరణల నమూనా తయారు చేయటం లో ఆప్టే కీలక పాత్ర వహించాడు .1916లో ఆయన నవలలు యశ్వంతరావు ఖర్, మీ లు ప్రచురించాడు .1918ఏప్రిల్ 27 న పూనా కిర్లోస్కర్ నాటకశాలలో ఢిల్లీ లో జరిగే యుద్ధ సమావేశం లో పాల్గొనే ప్రజాప్రతినిధి అవకాశం ఇవ్వకపోవటం పై ,ప్రజలలో ఉన్న ఆందోళన విషయం పై ఈ సమావేశం జరిగింది .ప్రజల సానుభూతి పోగొట్టుకొన్న ప్రభుత్వం యుద్ధ ప్రయత్నానికి సాయం చేయమని కోరటం వింతగా ఉంది ప్రజలకు .ఆ సభకు ఆప్టే ను అధ్యక్షుడిని చేశాడు తిలక్ .మాంటేగ్ సంస్కరణలను కొందరు బలపరచాగా ,మరికొందరు వ్యతిరేకించారు .మార్చి 2న తిలక్ లండన్ ప్రయాణ సందర్భంగా ఆప్టే అధ్యక్షతన ఒక సమావేశం జరిగి శుభా కాంక్షలు తెలిపారు .మునిసిపల్ చైర్మన్ ఎన్నికలలో ఆప్టే ఓడిపోయాడు .మితవాదులకు దూరమయ్యాడు .జోషీపై సానుభూతి ఉండటం వలన ఆయన కోరికపై తీస్తా,కురీగ్రాం ,చిల్ మారీ రైల్వే షేర్లు అమ్మి పెట్టటానికి 1918లో కలకత్తా వెళ్లి ఒక నెల ఉన్నాడు .తర్వాత పనికూడా జోషీ ఆయనకే అప్పగిస్తే ,కంటిజబ్బు చేసి చూపు తగ్గింది .తర్వాత మలేరియా వచ్చి ,దీర్ఘకాల అజీర్తి వ్యాధి ఎక్కువైంది .ఢిల్లీ కలకత్తా ఇండోర్ లు తిరగటం తో ఆయన బలహీనపడ్డాడు .ఇండోర్ లో కొన్ని రోజులు ఉండాల్సి వచ్చి ఒకరొజూదయ౦ వాహ్యాళి చేస్తుంటే వడగళ్ళ వానలో చిక్కుకొని కాళ్ళకు ,పొట్టపై వాపు రావటం గమనించాడు .డాక్టర్ సారంగపాణి అది నంజువ్యాది లక్షణం అని చెప్పి త్వరగా పూనా వెళ్ళమని సలహా ఇచ్చాడు .ఇండోర్ పని పూర్తయ్యాక ఇంటికి బయల్దేరగా ,ఖండావాలలో జబ్బు ఎక్కువైఆగిపోయి భార్యను నాగపూర్ నుంచి వచ్చి కలుసుకోమని తంతి ఇచ్చాడు .భుసావల్ స్టేషన్ లో ఆప్టే కు బదులు దీక్షితులుగారి అబ్బాయి కనిపించేసరికి ఆమె భయపడింది .భార్య తో బొంబాయి చేరాడు .జనవరి 28న బొంబాయికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున సాక్ష్యం ఇవ్వటానికి వెళ్లి డాక్టర్ భడ్ కంకర్ పరీక్షించి విశ్రాంతి కావాలని చెప్పాడు .లిఖితపూర్వక సాక్ష్యంపంపాడు .డాక్టర్లు గుండెపోటు రావచ్చునని భయపడ్డారు .అక్కడే అయిదువారాలున్నాడు .బంధు మిత్రులు చూసి వెళ్ళారు .కొత్తపుస్తక ప్రచురణతో కొంతకాలక్షేపం చేశాడు .ఫిబ్రవరి 19గోపాలకృష్ణ గోఖలే చనిపోయాడు .కూతురు,తండ్రి కూడా ఫిబ్రవరి చనిపోయిన౦దున ఆప్టే బాగా కలత చెందాడు .కడుపునిండా నీరు చేరింది భాజేకర్ గారి ఆస్పత్రిలో వైద్యం జరుగుతోంది .నీరు బయటికి పంపే ఏర్పాటు చేశాక కొంత సుగుణం కనిపించింది .కానీ పైత్యమత్తులో ఉన్నాడు .రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తుంటే డాక్టర్ ఆయన్ను పూనా తీసుకు వెళ్ళమని భార్యకు చెప్పాడు .ఆమె దుఖం వర్ణనాతీతం .
ఆప్టే జబ్బులో ఉ౦డగా ఆయన మిత్రుడు ప్రొఫెసర్ లిమాయే చనిపోయాడు.పూనా స్టేషన్ నుంచి ఇంటికి తీసుకు రావాల్సిన కారు రాకపోతే పల్లకిలో వెళ్లి ఆకుదుపులు, ఎండా తట్టుకోలేకపోయాడు ఆప్టే .ఇంటికి చేరేసరికి మూడు సార్లు రక్తం కక్కాడు .మగత వచ్చింది.నెత్తురుమరకల భర్తను చూసి భార్య తట్టుకోలేక మూర్చపోయింది ,ఆప్తెకు స్పృహహరాగానే మరణ శాసనం రాయించి ఏదో విధంగా సంతకం పెట్టాడు .కుటుంబానికి తగిన విధంగా ఆస్తి రాశానని భార్యకు చెప్పాడు .ఆరోజు చెల్లించాల్సిన ఎల్ ఐ సి ప్రీమియం కూడా కట్టించే ఏర్పాటు చేశాడు ,తన గ్రంధాలపై సర్వహక్కులు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీకి దాని అనుబంధ సంస్థ ఆర్యభూషణ్ ముద్రణ శాలకు దఖలు పరచాడు .వారు నెలకు యాభై రూపాయలు శ్రీమతి ఆప్టే కు ఆమె జీవితాంతం చెల్లించే ఏర్పాటు చేశాడు
చనిపోయేదాకా ఆప్టే ప్రశాంతంగానే ఉన్నాడు .మనో ధైర్యంతో మరో మూడు గంటలు జీవించాడు .7-3-1919 సాయంత్రం 7గం లకు 54 వయసులో మరాటీ మహాకవి నవలాకారుడు ,మార్గదర్శి ,సంఘ సంస్కర్త హరినారాయణ ఆప్టే హరిపదం చేరాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-3-22-ఉయ్యూరు