మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-6(చివరిభాగం )
సాహితీ కృషి లో ప్రత్యకత
మరాటీ నవలా రచయితలలో హరినారాయణ ఆప్టే ప్రధమ ఉత్తమ నవలా రచయిత.7 సంపూర్ణ సాంఘిక నవలు.3అసంపూర్తి నవలలు రాశాడు .సాంఘికాల్లో యాభైఏళ్ళ పూనా సంఘాన్ని చక్కగా చిత్రించాడు .ఇంగ్లీష్ వారి ప్రభావం వలన కలిగిన లోపాలు ,సంఘ పురోభి వృద్ధి మార్గాలు సూచించాడు .సంప్రదాయం వెర్రి తలలు వేస్తె కలిగే ప్రభావాలు ఎత్తి చూపాడు .విద్యా వంతులైన స్త్రీపురుషులు సంఘాన్ని ఎలా ప్రగతి వైపు నడిపిస్తారో చూపించాడు .నూతన సంఘంలో ఆదర్శభావాలు ప్రదర్శించాడు .నూతన విశాల దృక్పధం తానుపొంది సంఘానికి తెలిపాడు .మధిలీ స్థితి నవలలో మన సాంఘిక పతనమే ప్రధాన విషయం .గణపతిరావు నవలలో నూతనభావాలవలన కలిగిన సాంఘిక ప్రబోధం చూపాడు .పణ్ లక్షాత్ కోణ్ ఘేతే లో ఉమ్మడి కుటుంబాలలో మేలు కీడు చర్చించాడు .స్త్రీపురుష వ్యక్తిస్వాతంత్ర్య అవసరం తెలియజేశాడు .యశ్వంత్ రావు ఖరే ,,అజాచ్ నవలలో రాజకీయ సాంఘిక సంస్కరణ వాదులు ఎదుర్కొన్న కష్ట నష్టాలు కళ్ళకు కట్టించాడు .మీ నవల దేశ పురోభి వృద్ధికి దారి చూపింది .స్త్రీ విద్య స్త్రీల ఆశయాలు ,అవి ఫలించక ఏర్పడే దుస్థితి లను భయంకర్ దివ్య ,మఎచా బజార్ లలో చూపించాడు .భర్త మరణిస్తే స్త్రీ జుట్టు కత్తిరించుకోవటం ,ఆమె పొందే అవమానం దుర్దశ చూపి కనువిప్పు కలిగించాడు .ఆయన పాత్రలన్నీ ఆదర్శవన్తమైనవె .మీ ఉత్తమ నవల .
జగ హో ఆసే అహో నవల వినోదాత్మకం .అజాచ్ అసంపూర్తి నవల .జాతి నిర్మాణ సూచనలు ఇచ్చి ఉండేవాడు .కర్మయోగ్ కూడా అసంపూర్ణమే .పాశ్చాత్య విద్య నేర్చిన నాస్తికుడు ,దేశభక్తుడు ఆధ్యాతిక గురువు అవటం ఉంది .అన్ని నవలలో కళా సౌందర్యాలు మేళ వించాడు .తన వ్యక్తిగత అనుభవానికి లోనైనా పాత్రలే ఆయన సృష్టించాడు .నవలలన్నీ యధార్ధచిత్రణలే .స్త్రీలపట్ల అన్యాయంగా ప్రవర్తి౦ చేవారినిమందలించాడు .భార్యా భర్తల అనుబంధాన్ని వాస్తవంగా ఉదాత్తంగా చిత్రించాడు .1913లో వి ఎం జోషీ ‘’రాగిణి ‘’నవల రాసే వరకు ఆప్టే హవా నడిచింది అందుకే హరినారాయణ ఆప్టే ను ‘’నవీన మరాఠీ నవలాపిత ‘’అని ముక్త క౦ఠం తో గౌరవించారు,కీర్తించారు .
ఆప్టే 11 చారిత్రిక నవలు రాశాడు .అందులో ‘’గడ్ ఆళాపన్ సింహా గేలా ‘’గొప్ప నవల .తానాజీ సింహ గడ్ కోట వశపరచుకోవటం లో ప్రాణ త్యాగం చేయటం అద్భుతంగా వర్ణించాడు శివాజీఆవేదన మరచిపోలేనిది .శివాజీ ,పీష్వా ల చరిత్ర గుప్పించి నవలలు రాశాడు .పద్మ పురాణం ,ముద్రారాక్షసం ఆధారంగా ‘’చంద్రగుప్త ‘’నవల రాశాడు .చారిత్రక నవలలో దాదాపు వందమంది స్త్రీ పురుషులు ఉంటారు అందర్నీ ప్రత్యెక శ్రద్ధతో తీర్చి దిద్దాడు .చారిత్రిక నవలాకర్తగా ఆప్టే చిరస్థాయి సాధించాడు .పద్యాలు గీతాలు చిన్న కధలు నాటకాలు కూడా రాశాడు .మేధావి వర్గానికి చెందిన మహా రాష్ట్ర సాహిత్య కారులలో హరినారాయణ ఆప్టే ఒకరు .
సమాప్తం
ఆధారం –ఎం.ఎ.కరందికర్ మరాఠీ లో రాసిన దానికి డా మొగలి నాగభూషణ శర్మ గారు తెలుగులో అనువాదం చేసిన ‘’హరి నారాయణ ఆప్టే ‘’పుస్తకం .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-22-ఉయ్యూరు