మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –124
· 124- ముత్యాలముగ్గు ,గోరంతదీపం ,తూర్పు వెళ్ళే రైలు ఫోటోగ్రఫీ ఫేం-ఇషాన్ ఆర్య
· ఆర్ట్ సినిమా నిర్మాత ,ఫోటోగ్రఫార్ ఇషాన్ ఆర్య ..గరం హవా ఆర్ట్ సినిమా తీసి పెద్ద పేరు పొందాడు .దియేటర్ ,అడ్వర్టైజింగ్ రంగాలలో అనుభవం పొంది ,
· తెలుగు సినీ ఫోటో గ్రాఫర్ గా చిరయశస్సుపొందాడు సాగర్ సర్హాది ,అంజుమన్ హిందీ సినిమాలను డైరెక్ట్ చేసిన ముజఫర్ ఆలి తో వాటికి ఫోటోగ్రాఫర్
· గా పని చేశాడు .23వ జాతీయ ఫిలిం అవార్డ్ లలో బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డ్ ను 1975లో బాపు దర్శకత్వం లో వచ్చిన ముత్యాలముగ్గు సినిమాకు
· అందుకొన్నాడు ఇషాన్ ఆర్య .ఆసినిమా ఘనతకు ఆర్యఫోటోగ్రఫీ ఎక్కువగా తోడ్పడింది .
· ఆశన్ కుటుంబం లో పుట్టిన ఆర్య ప్రముఖ హిందీ నటి షబనా ఆజ్మీ కి ఫస్ట్ కజిన్ .టెలివిజన్ నాటక నటి సులభా ఆర్యను పెళ్లి చేసుకొన్నాడు
· అతని కొడుకు కోయిల ,కోయి మిల్ గయా షూట్ అవుట్ ఎట్ వాడ్లా కు పని చేసిన సమీర్ ఆర్యకూడా సినిమాటోగ్రాఫరే..మరొక కుమారుడు
· సాగర్ ఆర్య నటుడు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ .బాస్సు భట్టాచార్య కుమార్తె రింకి ని పెళ్లి చేసుకొన్నాడు .ఆర్య ఫస్ట్ కజిన్ బాబా ఆజ్మి ఆర్య్వడ్డ లైట్ బాయ్
· గా పని చేసి ఎదిగాడు .సుమారు 12సినిమాలకు సినిమా ఫోటోగ్రాఫర్ పనిచేశాడు .ఇషాన్ ఆర్య గరం హవ ,హిందీ రుస్తుం జోడి కన్నడ సినిమా నిర్మాత
· ఖూన్ పాసినా ,కాకానే కోటే ,గోరంతదీపం బజార్ అంజుమన్ ,ఆజ్ ఝాలే ముక్తి మీ (మరాటీ )కహాన్ కహాన్ సే గుజర గయా ,నసీహత్ మొహ్రే
· తూర్పు వెళ్ళే రైలు లకు సినిమాటోగ్రాఫర్ ఇషాన్ ఆర్య .తెలుగులో బాపు కు ఆస్థాన సినీ ఫోటోగ్రాఫర్ ఇషాన్ ఆర్య .
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-3-22-ఉయ్యూరు