మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -126
· 126-అన్నమయ్య ,ఫేం నాలుగు భాషల సినీ డైరెక్టర్ ,ఫోటోగ్రాఫర్ –విన్సెంట్
· 14-6-1928 జన్మించి 25-2-2015న 77 ఏళ్ళ వయసులో చనిపోయిన ఎ.విన్సెంట్ తెలుగు తమిళ మళయాళ హిందీ చిత్ర దర్శకుడు ,సినిమాటోగ్రాఫర్
· 1960 మధ్య నుంచి ,30సినిమాలకు మలయాళం లో భార్గవి నిలయం ,మురప్పెన్ను వంటి అపురూప చిత్రాలకు దర్శకత్వం వహించాడు .
· 1974లో హిందీలో రాజేష్ ఖన్న నటించిన ప్రేమ నగర్ సినిమాకు ఉత్తమ ఛాయాగ్రాహక అవార్డ్ పొందాడు .2003లో ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాతోగ్రాఫర్స్
· విన్సెంట్ కు గౌరవ సభ్యత్వమిచ్చి గౌరవించింది .
· మద్రాస్ప్రేసిదీన్సిలో కాలికట్ 1928 న జన్మించిన విన్సెంట్ ,కమల్ ఘోష్ వద్ద ఫోటోగ్రఫీ నేర్చి ,జెమిని స్టూడియో స్ లో పని చేశాడు .తమిళ సినిమా తో
· కెరీర్ ప్రారంభించి జెమిని గనేషన్ నటించిన ఊతం పత్తం కు పని చేశాడు .వి శ్రీధర్ డైరెక్ట్ చేసిన ‘’కళ్యాణ పరిశు ‘’మొదలైన సినిమాలకు ఫోటోగ్రఫీ సమకూర్చాడు
· తర్వాత ఫ్రీ లాంసర్ గా తమిళ ,తెలుగు సినీ రంగాన్ని దున్నేశాడు .దక్షినాది సినిమాలకే కాక హిందీ సినిమాలకూ పనిచేసి అగ్రగామి సినిమాటో
· గ్రాఫర్ అయ్యాడు .ఆకాలం లో సినిమాటోగ్రఫీ శైశవ స్థితిలో ఉన్నప్పుడు కేమెర ఆగిల్స్ ,ప్లేస్ మెంట్స్ పై అపూర్వ ప్రయోగాలు చేశాడు
· అంతకు ముందు ఎన్నడూ చూడని విజువల్స్ చూపి ఆశ్చర్యం కలిగించాడు .మలయాళం లో 30సినిమాలకు దర్శకత్వం వహించాడు .1964లో
· ఆయన డైరెక్ట్ చేసిన భార్గవి నిలయం మళయాళ సినిమా ఆల్ టైంక్లాసిక్ గా గుర్తింపు పొందింది .అతడు డైరెక్ట్ చేసిన గాంధర్వ క్షేత్రం మొదలైనవీ గొప్ప
· రికార్డ్ సృష్టించాయి .1953లో ‘చండీ రాణి’ చిత్రానికి గెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు విన్సెంట్. పూర్తి స్థాయి సినిమాటోగ్రాఫర్‌గా ‘బ్రతుకు తెరువు’, బక్త ప్రహ్లాద, అమర దీపం, పెళ్ళి కానుక, కుల గోత్రాలు, ప్రేమ నగర్, లేత మనసులు, అడవి రాముడు, నారీ నారీ నడుమ మురారి, మేజర్ చంద్రకాంత్, బొబ్బిలి సింహం, సాహస వీరుడు సాగరకన్య, అన్నమయ్య.. ఇలా వంద చిత్రాలకు పైగా విన్సెంట్ కెమెరా కనువిందు చేసింది. నలుపు-తెలుపు చిత్రాలు, రంగుల చిత్రాలకూ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించి, చిత్రసీమలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు
2015లో 77ఏళ్ళ వయసులో చనిపోయాడు అతడి కుమారులు జయానన్ విన్సెంట్ ,అజయన్ విన్సెంట్ లు ఇద్దరూ సినిమాటో
· గ్రాఫర్సే .
· అతడు ఫోటోగ్రఫీ చేసన సినిమాలో అన్నమయ్య ,,సాహస వీరుడు ,బొబ్బిలి సింహం ,మేజర్ చంద్రకాంత్ ,అల్లరిప్రియుడు ,అశ్వ మేధం ,ఆపద్బాంధవుడు ,
· ఘరానామొగుడు ,ఆశాజ్యోతి ,గురు ,కేడి నంబర్ 1,రాజపుత్ర రహస్యం గడుసుప్రియుడు ,ప్రేమలేఖలు ,అడవి రాముడు ,సెక్రెటరి జ్యోతి ,సోగ్గాడు బాబు ,
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-3-22-ఉయ్యూరు
· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -127
· 127-రోజులు మారాయి ,అపూర్వ సహోదరులు ,అనార్కలి,శ్రీ కృష్ణార్జున యుద్ధం ఫోటోగ్రఫీ ఫేం ,దర్శకుడు –కమల్ ఘోష్
కమల్ ఘోష్ ప్రముఖ చలనచిత్ర ఛాయాగ్రాహకుడు. ఇతడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కాతాలో 1910లో జన్మించాడు. కలకత్తా న్యూ థియేటర్స్ సంస్థ అధినేత దేవకీబోస్ ఇతని మేనమామ. ఇతనికి చిన్నతనం నుండి ఫోటోగ్రఫీ పట్ల ఉత్సాహం, ఆసక్తి ఉండేది. ఇతని మేనమామ దేవకీబోస్ అది గమనించి ఇతడిని చలనచిత్ర యంత్ర సామాగ్రి తయారు చేస్తూ లాబొరేటరీని నిర్వహించే కృష్ణగోపాల్ వద్ద చేర్పించాడు. 1925 నుండి 32 వరకు లాబొరేటరిలోనే ఉంటూ సినిమా ఎడిటింగ్, ఫోటోగ్రఫీలలో శిక్షణ తీసుకున్నాడు. 1932లో ఈస్టిండియా ఫిలిం కంపెనీలో సహాయకుడిగా కృష్ణగోపాల్ వద్ద “సునేరే సంసార్” అనే వంగ సినిమాకి పనిచేశాడు. స్వతంత్రంగా చిత్రీకరించగల సామర్థ్యం సంపాదించుకున్న తర్వాత “రాత్ ఖానా” అనే బెంగాలీ హాస్య చిత్రానికి ఛాయా గ్రాహకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత ఏ.ఆర్.కర్దార్ తీసిన “భాగీ సిపాయి” చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. ఈస్టిండియా ఫిలిం కంపెనీ వారు సి.పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన లవకుశ సినిమాకు ఇతడిని ఛాయాగ్రాహకుడిగా నియమించారు. ఇది ఇతని తొలి తెలుగు సినిమా. 1949లో తమిళంలో అపూర్వ సహోదరులు సినిమాతో ద్విపాత్రాభినయాన్ని తొలిసారి చిత్రించిన ఘనత ఇతనికే దక్కింది.
కమల్ ఘోషదక్షిణ భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమాభివృద్ధికి కారకులలో ఒకరైన కె.సుబ్రహ్మణ్యం మద్రాసులో ఒక సినిమా స్టూడియో నిర్మాణం చేయసంకల్పించి కలకత్తా వెళ్లి ఇతడిని మద్రాసుకు తీసుకువచ్చాడు. కె.సుబ్రహ్మణ్యం మోషన్ పిక్చర్ కంబైన్స్ పేరుతో (తరువాతి కాలంలో జెమినీ స్టూడియోస్) “బాలయోగి” అనే తమిళ సినిమా తీస్తూ ఇతడికి ఛాయాగ్రాహకుడిగా అవకాశం వచ్చింది. అప్పటి నుండి ఇతడు మద్రాసులో స్థిరపడ్డాడు. ఇతడు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో సుమారు 80కి పైగా సినిమాలకు పైగా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. ఇతడు జెమినీ, జూపిటర్, అంజలి పిక్చర్స్, భరణి, సారథీ స్టూడియోస్ వంటి సంస్థలలో పనిచేశాడు. ఇతని దగ్గర శిష్యులుగా పనిచేసిన వారిలో ఎ.విన్సెంట్, జె.సత్యనారాయణ, లక్ష్మణ్ గోరే, తంబు మొదలైన వారు ఛాయాగ్రాహకులుగా పేరు తెచ్చుకున్నారు.
ఇతడు చిత్ర నిర్మాణ రంగంలో కూడా ప్రవేశించి ఘంటసాలతో కలిసి పరోపకారం సినిమాను నిర్మించాడు. ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఆ తర్వాత మనోరమ చిత్రానికి కూడా ఇతడే దర్శకత్వం నిర్వహించాడు
సినిమాల జాబితా
ఛాయాగ్రాహకుడిగా
· లవకుశ (1934)
· బాల యోగిని 1937
· చండిక (1940)
· తల్లిప్రేమ (1941)
· సుమతి (1942)
· పాదుకా పట్టాభిషేకం (1945)
· అపూర్వ సహోదరులు (1950)
· ప్రేమ (1952)
· పరదేశి (1953)
· పరివర్తన (1954)
· అనార్కలి (1955)
· రోజులు మారాయి (1955)
· అభిమానం (1960)
· మా బాబు (1960)
· శ్రీకృష్ణార్జున యుద్ధము (1963)
· బభ్రువాహన (1964)
· బొబ్బిలి యుద్ధం (1964)
· గోవుల గోపన్న (1968)
· బంగారు గాజులు (1968)
· భాగ్యచక్రం (1968)
· నాటకాల రాయుడు (1969)
· విధివిలాసం (1970)
· బంగారుతల్లి (1971)
· రంగేళీ రాజా (1971)
· నీతి నిజాయితి (1972)
దర్శకుడిగా
· పరోపకారం (1953)
· రోహిణి (1953)
· మనోరమ (1959)
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-3-22-ఉయ్యూరు