మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-128

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-128
128-బాపి రాజు గారి శిష్యుడు ,తాడంకి టీచర్ ,కళాదర్శకుడు –వాలి

వాలి సుబ్బారావు “వాలి” అనే పేరుతో కళాదర్శకుడిగా చిరపరిచితుడు[1]. ఇతడు 1914లో జన్మించాడు. ఇతని తండ్రి రంగస్థల నటుడు వాలి వీరాస్వామినాయుడు. అతడికి చిత్రకళపై ఆసక్తి ఉండేది. తండ్రి పెయింటింగ్స్ చూసి సుబ్బారావుకు కూడా చిత్రకళపట్ల ఆసక్తి ఏర్పడింది. ఇతడు ఇంటి వద్దనే చదువుకుని పిమ్మట బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలో చేరాడు. అక్కడ ఇతడు కాటూరి వేంకటేశ్వరరావుకు ప్రియశిష్యుడైనాడు. 1932లో ఇతడు డ్రాయింగు పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. తరువాత ఇతడు కొండపల్లి దగ్గరలోని విద్యానగరం టీచర్స్ ట్రైనింగ్ స్కూలులో డ్రాయింగ్ మాస్టర్‌గా ఉద్యోగంలో చేరాడు. అక్కడ విశేషం ఏమిటంటే ఇతని శిష్యులందరూ ఇతని కంటే వయసులో పెద్దవారే. అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత బందరుకు తిరిగి వచ్చి అడివి బాపిరాజు వద్ద శిష్యరికం చేశాడు. కృష్ణా పత్రికలో బొమ్మలు వేసేవాడు. అడివి బాపిరాజు సలహాతో తిరిగి తాడంకి గ్రామంలో ఉపాధ్యాయుడిగా చేరాడు. అయితే ఇతనికి సినిమాలలో పని చేయాలన్న సంకల్పం బలంగా కలిగి తిరిగి అడివి బాపిరాజు పంచన చేరాడు. అడివి బాపిరాజుకు సినీ నిర్మాత సి. పుల్లయ్యతో స్నేహం ఉండేది. సి.పుల్లయ్య తన చల్‌ మోహనరంగా సినిమాలో ఇతనికి హీరోగా అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా వాలి సుబ్బారావు సినిమా రంగంలో ప్రవేశించారు

సినిమా రంగం
ఇతడికి సినిమాలలో తొలి అవకాశం హీరోగా లభించినా ఇతడికి ‘నటన’ మీద కంటే ‘చిత్రకళ’ పట్ల ఉన్న మక్కువతో ఇతడు కళాదర్శకత్వ శాఖలో కృషి చెయ్యసాగాడు. మీరాబాయి సినిమాలో అడివి బాపిరాజు వద్ద సహాయకుడిగా పనిచేశాడు. 1941లో గూడవల్లి రామబ్రహ్మం ఋష్యేంద్రమణి కథానాయికగా తీసిన పత్ని అనే సినిమాలో ఇతడికి తొలిసారిగా కళా దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. వాలికి మొదటి నుంచి దుస్తులు, అలంకరణల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది. మొదటి సినిమాలో ఇతడు కాస్ట్యూమ్‌లో మంచి నైపుణ్యం కనబరచాడన్న పేరు లభించింది. తరువాత ఇతడు స్వతంత్రంగా పలుచిత్రాలకు, ఎ.కె.శేఖర్, ఘోడ్‌గావంకర్ మొదలైన వారితో కలిసి కొన్ని చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేశాడు.

సినిమాల జాబితా
ఇతడు కళాదర్శకుడిగా పనిచేసిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా:

 1. పత్ని (1942)
 2. గొల్లభామ (1947)
 3. పల్నాటి యుద్ధం (1947)
 4. పల్లెటూరి పిల్ల (1950)
 5. స్త్రీ సాహసము (1951)
 6. దేవదాసు (1953)
 7. రాజు-పేద (1954)
 8. అనార్కలి (1955)
 9. జయం మనదే (1956)
 10. సువర్ణసుందరి (1957)
 11. భట్టి విక్రమార్క (1960)
 12. రాణి రత్నప్రభ (1960)
 13. భీష్మ (1962)
 14. పరమానందయ్య శిష్యుల కథ (1966)
 15. బంగారుతల్లి (1971)
 16. రైతుబిడ్డ (1971)
 17. శ్రీకృష్ణదేవరాయలు (1971) – కాస్ట్యూమ్‌ డైరెక్టర్
 18. సంపూర్ణ రామాయణం (1971) – కాస్ట్యూమ్‌ డైరెక్టర్
 19. అమ్మమాట (1972) సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-3-22-ఉయ్యూరు

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-129
129-గ్రామీణ కదా రచయిత,పాతాళభైరవి మాయాబజార్ కళా ఫేం ,ఉత్తమ కళా దర్శకుడు –మా గోఖలే

· మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే (మా.గోఖలే) తెలుగు సినిమా ప్రపంచంలో ఉన్నతమైన కళా దర్శకుడు, చిత్రకారులు.

ఇతడు గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, బ్రాహ్మణకోడూరు గ్రామములో 1917లో జన్మించాడు. ఇతని తండ్రి మాధవపెద్ది లక్ష్మీనరసయ్య స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న జాతీయవాది. ఇతడు కొడవటిగంటి కుటుంబరావుకి దగ్గర బంధువు. గోఖలే విజయా స్టుడియోలో శాశ్వత కళా దర్శకులుగా పనిచేసి, ఎన్నో విజయవంతమైన పౌరాణిక, చారిత్రక చిత్రాలు విజయం పొంది శాశ్వత స్థానం పొందడానికి కీలకమైన కృషి చేశాడు. అంతే కాకుండా గోఖలే మంచి చిత్రకారుడు, సాహితీవేత్త, జర్నలిస్టు, మానవతావాది. ‘ఆంధ్రపత్రిక’, ‘భారతి’, ‘యువ’, ‘ఆంధ్రజ్యోతి’, ‘ప్రజాశక్తి’ పత్రికలలో ఎన్నో చిత్రాలు వేశాడు. రచనా రంగములో కూడా కృషి చేసి ‘బల్లకట్టు పాపయ్య’, ‘మూగజీవాలు (కథాసంపుటి) ‘, ‘గోఖలే కథలు’ మున్నగు రచనలు చేశాడు. ఇతడు గ్రామీణ జీవితాలను తన కథలలో అతి సహజంగా సాక్షాత్కరింప చేశాడు.

పాతాళభైరవి, మాయా బజార్ తదితర చిత్రాల్లో కథాకాలంనాటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపించేందుకు గోఖలే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. పాత్రధారులు ధరించే సుస్తులు, నగలు, కట్టూ బొట్టూ అచ్చం తెలుగుతనం ఉట్టిపడేవి. చలనచిత్రాలకు సంబంధించిన వివరణాత్మకమైన స్కెచ్ లు వేసేవాడు.

అతడు ప్రజాశక్తి, ఆంధ్రపత్రికలలో జర్నలిస్టుగా పనిచేశాడు. ఆయన విశిష్ట వ్యక్తిత్వం, సమస్యలపై సంపూర్ణ అవగాహన ఆయన రచనలలో కనిపించేది. ఇతడు తెనాలిలోని రామ విలాస సభతో సన్నిహిత సంబంధాలు కలిగివుండేవాడు. ఇతడు అభ్యుదయ రచయితల సంఘం లోను, ఆంధ్ర కళాకారుల సంఘం లోను, ఆంధ్ర చిత్రకళా పరిషత్తు లోను సభ్యులుగా ఉన్నాడు.

ఇతడు 1981 సంవత్సరంలో మరణించారు.[1]

చిత్ర సమాహారం
చందమామ 1948 సంచికలో ప్రచురించబడిన గోఖలే చిత్రలేఖనం దమయంతి-హం

భారతి 1950 మే సంచికలో ప్రచురితమైన గోఖలే వర్ణచిత్రం

 1. శ్రీకృష్ణసత్య (1971)
 2. శ్రీకృష్ణ విజయం (1971)
 3. శ్రీకృష్ణావతారం (1967)
 4. శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963)
 5. మహామంత్రి తిమ్మరుసు (1962)
 6. భక్త జయదేవ (1961)
 7. జగదేకవీరుని కథ (1961)
 8. మహాకవి కాళిదాసు (1960)
 9. అప్పు చేసి పప్పు కూడు (1958)
 10. మాయా బజార్ (1957)
 11. మిస్సమ్మ (1955)
 12. చంద్రహారం (1954)
 13. ధర్మ దేవత (1952)
 14. పెళ్ళిచేసి చూడు (1952)
 15. పాతాళ భైరవి (1951)
 16. షావుకారు (1950)
 17. రైతుబిడ్డ (1939)

·

Episode 17: Dedicated to epic movies art director Sri Madhavapeddi Gokhale with a special mention about other golden era art directors. Smt. Jamuna, Padmasri Thota tharani & art director Sri Anand Sai sharing talking about art direction are special attractions. Many thanks to them.

as always beautiful songs by singers and nice content by Sri Suresh Madhavapeddi garu. Movies like Pathala bhairavai, Mayabazar, Gundamma kadha, Appu chesi pappu kudu, Missamma, Sri Krishna Tulabharam etc. all the art direction like settings, costu

·

we heard about Madhava peddi family then we remembered, that was a artists family.In this family Venkataramaiah was a great actor,Satyam was a great singer,Rmesh was a director,ramesh brother was a singer and Maa gokhale was a art director. This family inherited the action,music a nd art.

Gopala Krishna Gokhale was popularized in the name of Maa Gokhale.Gokhale got honour and brightness to Vijaya samstha.Bhairavi statue,mayamahal miature,garden set,kings fort in maya bazaar and chandraharam sets were stnds for his creative art.He was a great art director.He was born at brahmana kodur ,near Tenali.In child hood he learn art from Gurram Mallaiah,then he studied at National school of arts in bunder.He was also wrote stories to Bharati and Andhra jyothi with Kutumba rao’s inspiration.Gokhale came to madras in 1948,as a artist in yuva,Andhra jyothi journals.Gokhale first film was shavukar,1950.Gokhale’s greatest creation was lord Krishna getup in mayabazar.We know that N.T.R how much impressed the telugu people as lord Krishna.Another great creation was Ghatotkacha getup.He had take very care for every minute point and draw a sketch to that,like ear rings,hand rings,hand stick,crown,weapons,ornaments,chariots,cots and seats ,which was used in the sets.

He was guide for all art directors of cine industry.

Madhavapeddi Gokhale
Filmography

Art Director:

 1. Sri Krishnarjuna Yudham (1963)
 2. Jagadeka Veeruni Katha (1961)
 3. Mahakavi Kalidasu (1960/I)
 4. Appu Chesi Pappu Koodu (1958)
 5. Maya Bazaar (1957/I)
 6. Maya Bazaar (1957/II)
 7. Missamma (1955)
 8. Chandraharam (1954)
 9. Dharmadevata (1952/I)
 10. Pelli Chesi Choodu (1952)
 11. Patala Bhairavi (1951)
 12. Shavukaru (1950)

Note: Don’t forget to leave a comment

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-3-22-ఉయ్యూరు

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-130
130-వాహినీ వ్యవస్థాపకులలో ఒకరు ,ఆంధ్రమహా విష్ణు డైరెక్టర్ ,మల్లీశ్వరి సీతాకల్యాం కళా ఫేం –ఎ.కె.శేఖర్

ఎ. కె. శేఖర్, ప్రముఖ భారతీయ కళా దర్శకుడు.ఇతను వాహినీ ప్రొడక్షన్స్ వ్యవస్థాపకులలో ఒకరుగా సంస్థ నిర్మించిన ఎన్నో మంచి సినిమాలకు కళా దర్శకత్వాన్ని అందించారు.

మల్లీశ్వరి (1951) ఒక మహోన్నత దృశ్య కావ్యంగా మలచడంలో ఇతని కృషి అనుపమానం.ఇతను 1966 లో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ అనే చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు

విశేషాలు[మార్చు]
ఇతను 1907లో చిత్తూరులో జన్మించారు. వీరు మామూలు విద్యాభ్యాసం ముగించి ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రింటర్‌గా చేరాడు. కాలక్రమేణా జీవితంలో ఒక్కొక్క మెట్టే పైకెక్కి కళలో నిష్ణాతుడై చివారకు కళాదర్శకుడిగా ఎదిగినారు. వీరు మొట్టమొదట 1933లో రామనాథ్, ముత్తుస్వామిలు కొల్హాపూర్ నిర్మించిన తమిళ సినిమా సీతాకల్యాణం సినిమాకు కళాదర్శకునిగా పనిచేశారు. తరువాత మద్రాసులోని వేల్స్ పిక్చర్స్ స్టూడియోలో పి.వి.దాసు నిర్మించిన తెలుగు సీతాకల్యాణం కు కూడా కళాదర్శకత్వం వహించారు. ఆ తర్వాత బొంబాయి వెళ్ళి శబ్దగ్రహణ శాఖలో శిక్షణ పొంది వచ్చారు. వీరు 80 చిత్రాలకు పైగా కళాదర్శకత్వం వహించారు. ఆముదవల్లి అనే తమిళ సినిమా, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ అనే తెలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు[1].

చిత్ర సమాహార
· 1934 : సీతాకళ్యాణం

· 1936 : మాయాబజార్

· 1939 : వందేమాతరం

· 1940 : సుమంగళి

· 1941 : దేవత

· 1942 : భక్త పోతన

· 1942 : మంగమ్మ శపథం (తమిళ సినిమా)

· 1945 : స్వర్గసీమ

· 1948 : చంద్రలేఖ (తమిళ సినిమా)

· 1951 : మల్లీశ్వరి

· 1954 : పెద్ద మనుషులు, బంగారు పాప

· 1955 : అనార్కలి

· 1960 : రాజమకుటం

· 1963 : చిత్తూరు రాణీ పద్మిని (తమిళ సినిమా)

· 1964 : అమరశిల్పి జక్కన

· 1965 : బంగారు పంజరం

· 1966 : రంగుల రాట్నం, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ

· 1967 : భక్త ప్రహ్లాద

మరణం
వీరు 73 ఏళ్ల వయసులో మద్రాసులో 1981లో మరణించారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-3-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.