గోప బంధు దాస్ -2
గోప బంధు తండ్రి ముక్తియర్ గా పని చేస్తూ కొంత సంపాదిస్తున్నాడు .పల్లెటూరి బడిలోనేచదువుతున్నాడుదాస్ .అక్షరమాల నేర్వగానే రోజూ జగన్నాధ దాస్ రాసిన ‘’భాగవతం ‘’లో రోజుకొక అధ్యాయం గానం చేసేవాడు .అ భాగవతం హృదయగతమైంది .కొన్ని గీతాలుకూడా రాసేవాడు తండ్రి సంతోషించి అందరికీ చదివి వినిపించేవాడు .ఆ ఊరిలో అప్పర్ ప్రైమరీ స్కూల్ కట్టించి తండ్రి అందరికి మేలు చేశాడు .గోపబంద్ ,అన్న నారాయణ్ ఇందులోనే చేరారు .12వ ఏటనే తండ్రి గోపబంధుకు పక్కగ్రామం అయిన బంగూర్ బా లోని మోతీ అనే కన్యనిచ్చి పెళ్లి చేశాడు .అప్పర్ ప్రైమరిచదువు పూర్తయ్యాక ,8కిలోమీటర్ల దూరం లో ఉన్న రూప దే పూర్ లోని మిడిల్ వర్నాక్యులర్ స్కూల్ లో చేరాడు .అదేతర్వాత మిడిల్ స్కూల్ అని పిలువబడింది .వీటి స్థాపన గోపదెవ్ శాసన సభ్యుడై చేశాడు .
వెర్నాక్యులర్ స్కూల్ లో ఏర్పడిన స్నేహితులు జీవితాంతం కలిసే ఉన్నారు .ప్రధాన పండిట్ పండిట్ సదాశివ మిశ్ర దాసు ను కన్న కొడుకుగా చూసేవాడు .ఈయనవలననే సాహిత్యాభిలాష కలిగింది .తర్వాతకాలం లో గోపబంద్ బారిపాద లో సంస్థాన న్యాయవాదిగా ఉన్నప్పుడు మయూర్ భంజ్ కి నచ్చ చెప్పి అక్కడ అనాధశిశు శరణాలయం స్థాపింప జేసి గురువు పండిట్ సదాశివ మిశ్ర నిర్వహణ బాధ్యత అప్పగించాడు .ఆయనను ఆహ్వానిస్తూ ‘’నేను ఒక్కడినే మీకు కొడుకుని ఇక్కడ పుత్రులు ,పుత్రికలు చాలామంది ఉన్నారు .వారితో హాయిగా గడపటానికి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాను ‘’అని రాశాడు దాస్ .
రూప దేవ్ పూర్ లో చదువు అయ్యాక పూరీ వెళ్లి జిల్లా స్కూల్ లో 1893లో చేరాడు .ఇంగ్లీష్ చదువు లేకపోవటం వలన ఫోర్త్ ఫారం బదులు ఎనిమిదవ తరగతిలో చేరాల్సి వచ్చింది .పట్టుదలగా ఇంగ్లీష్ నేర్చి డబుల్ ప్రమోషన్ పొంది అందరి లాగా చదువుకోగలిగాడు .
రామచంద్ర దాస్ తో పరిచయం
పూరీలో ముక్తియార్ రామ చంద్ర దాస్ తో దాసు పరిచయం పొందాడు.ఆయనలోని దేశాభిమానం దళిత సేవ కు ఆరాధనాభావం కలిగింది .ఆయనకీర్తి జిల్లా అంతా వ్యాపించింది .ఆయన పర్యవేక్షణ లో గోపబందును తండ్రి ఉంచాడు .అప్పుడాయన దైత్ పరసాహిలో ఉండేవాడు .ఆయనవద్ద పండిట్ వసుదేవ రధ్ ఆతర్వాత ప్రసిద్ధుడైన సంస్కృత విద్యార్ధి ఉండేవాడు .కోర్టు నుంచి వచ్చాక ఈ ఇద్దరితో రామచంద్ర ప్రాచ్య పాశ్చాత్య విద్యావిధానాలను చర్చించే వాడు .పూరీ జిల్లా స్కూల్ లో దివ్యసి౦ఘ మిశ్రా అనే ఉపాధ్యాయుడు గోపబందు వినయ వివేకాలను మెచ్చుకొనేవాడు .సంస్కృతిపై గొప్ప అవగాహన వీరి వలన కలిగింది .
పూరీ జీవితం
స్కూల్ లోనూ సామాజిక జీవితం లోనూ గోపబంధు అందరికంటే మిన్నగా ఉండేవాడు .సంఘాలు సమావేశాలు నిర్వహించటం లో దిట్ట అయ్యాడు .ఇవి నాయకత్వ లక్షణాలను పెంచాయి .ఒక సారి పూరీ రాదోత్సవల సమయం లో చాలామంది చనిపోయారు .ప్రభుత్వం కానీ మున్సిపాలితికానీ ఏమీ పట్టించుకోలేదు .శవాలు వీధుల్లో కుళ్ళు కంపుకొడుతున్నాయి .పుణ్య క్షేత్రం పూరీ లో ఈ ఘోర దృశ్యాలను చూడలేక గోపబందు ‘’పూరీ సేవా సమితి ‘’ఏర్పాటు చేసి ,సంఘటితపరచి అనాధశవ దహనాలు చేయించి ,మరణా వస్థ ఉన్నవారికి సాయం చేశాడు .హరిహరదాస్ గోప బంధుకు కుడి భుజంగా నిలిచాడు .ఈ హరిహర దాస్ ఆతర్వాత భూదానోద్యమమహా నాయకుడుగా ఆచార్య హరిహర్ గా సుప్రసిద్ధు దయ్యాడు .ఇద్దరూ ఎన్నో సాంఘిక,సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు .గోప బంధు స్నేహితుడు దివాకర్ దాస్ పూరీలో వైద్య ,ప్రజారోగ్య శాఖల నిర్లక్ష్యాలను దుయ్యబడుతూ పత్రికలలో అనేక వ్యాసాలూ రాశాడు .స్టేట్స్ మన్ పత్రికలో పడిన ఈ విమర్శ స్థానిక ఉద్యోగులకు ఆక్రోశం తెప్పించి ,సివిల్ సార్జంట్ చార్లెస్ బెక్ కోపోద్రేకంతో దివాకరే రాశాడని వీధిలోకి లాగి బెత్తం తో కొట్టాడు .దీనితో పూరీ యువత పేట్రేగిపోగా సివిల్ సర్జన్ ప్రాణానికే ఎసరు వచ్చింది . .గోపబంద్ యువతను శాంత పరచి దివాకర్ చేత సర్జన్ పై మేజిస్ట్రేట్ కోర్ట్ లో దావా వేయించాడు .మేజిష్ట్రేట్ కూడా యూరోపియన్ అయినందువలన జనోద్రేకాన్ని గ్రహించి సర్జన్ ను కాపాడటానికి వెనుకంజవేసి ,రాజీపడమని సర్జన్ కు హితవు చెబితే ,గోపబందు ఆయన తో బహిరంగ క్షమాపణ చెప్పించి భారతీయుల గౌరవ మర్యాదలను కాపాడాడు .
మెట్రిక్ లో ఉండగా గోపబందు అనేక సాహిత్యవ్యాసాలు పత్రికలలు రాసేవాడు .రచనా విధానం లో ప్రాచీన ఆధునిక వాదులమధ్య వివాదం జరుగుతూ ,ఇంద్రధను ,బిజిలి పత్రికలూ వాటిని ప్రముఖంగా ప్రచురించేవి .మొదటిది ప్రాచీనతను రెండవది ఆధునికత ను ప్రోత్సహించేవి .ఉపేంద్ర భంజ్ ఆలంకారికంగా ,పద ప్రయోగ వైవిధ్యంతో రాసి ‘’కవి చక్రవర్తి ‘’అని పించుకొన్నాడు .ఒరిస్సా విద్యాధికారి ఆధునిక కవిత్వ నాయకుడు రాధానాధ రాయ్ రచనలను బిజిలీ పత్రిక ప్రముఖంగా ప్రచురించేది .గత వారసత్వంపైనే నూతన సౌధం నిర్మించాలని గోపబందు భావించాడు .ఇంగ్లీష్ రాజకీయ వేత్త బర్క్ లాగా గోపబందు ఆలోచించేవాడు .ఈభావాలతో ఇంద్రధను పత్రికలో సెటైరికల్ గా ఒక పద్యం రాశాడు .రాధానాధ కు మండి గోపబందు కు శిక్ష వేశాడు .1894జనవరి 25నుంచి ఫిబ్రవరి 2వరకు పూరీ జిల్లా హైస్కూల్ ను తనిఖీ చేస్తూ ఆపద్యం రాసిన కవి ఎవరో కనుక్కొనే ప్రయత్నం చేశాడు .అందులోని ఉపాధ్యాయులను బెదిరించి కవి పేరు చెప్పమని ఒత్తిడి తెచ్చాడు .ఇదంతా ఉత్కళ దీప పత్రిక లో లేఖలు శీర్షిక లో వచ్చాయి .అధికారిని మంచి చేసుకోవాలని ఒక ఉపాధ్యాయుడు గోప బంధు పేరు బయట పెట్టాడు .ఆయన పిలిపించి అడిగితె దాసు ఒప్పుకోలేదు .హెడ్ మాష్టర్ గోపబందు నిజం చెప్పలేదని ,అతడే ఆ పద్యం రాశాడని ఒక నివేదిక ఇచ్చాడు .ఆ ఏడాది దాసు కు రావాల్సిన బహుమతిని నిలుపుదల చేయమని హెడ్ మాస్టర్ కు ఆదేశాలిచ్చాడు విద్యాధికారి .ఇంద్రధను పత్రిక కూడా దాసు ను క్షమాపణ కోరమని కోరినా ఆయన అంగీకరించలేదు .ప్రాచీనులను సమర్ధించి ఆధునికులపై వారికున్న ఆధిక్యత వ్యక్తం చేశానని అందులో తప్పేమీ లేదని అన్నాడు గోపబందు దాస్ .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-3-22-ఉయ్యూరు