మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-134
134-‘’నాగమల్లి కొనలోన ,ముక్కు మీద కోపం ,పదపదవే వయ్యారి గాలిపటమా ,సరదా సరదా సిగరెట్టూ పాటల ఫేం ,కలైమామణి పురస్కారగ్రహీత –కె.జమునా రాణి
కె. జమునారాణి (మే 17, 1938) సుప్రసిద్ధ తెలుగు సినిమా గాయకురాలు. 1938 మే 15న ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు. ఈమె తండ్రి వరదరాజులు నాయుడు ప్రైవేటు అధికారి, తల్లి ద్రౌపది వాయులీన కళాకారిణి. ఏడేళ్ల వయసులో జమునారాణి చిత్తూరు వి. నాగయ్య చిత్రం ‘త్యాగయ్య’లో బాల నటుల కోసం మధురానగరిలో పాట పాడింది. పదమూడేళ్ల వయసు నుండే కథానాయకిలకు పాడటం ప్రారంభించింది. 1952లో ఆమె తొలిసారిగా మాడ్రన్ థియేటర్స్ వారి వలయపతి సినిమాలో కథానాయకి పాడారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, సింహళం భాషల్లో ఆరు వేల గీతాలు పాడారు. ఆమె బ్రహ్మచారిణి. 1955లో తమిళ గుళేబకావళి సినిమాలో జమునారాణి పాడిన పాట ఆసయుమ్ ఎన్నేసముమ్ పాటతో విజయవంతమైన పాటల పరంపర ప్రారంభించింది.
జమునారాణి తొలిసారి సింహళ భాషలో 1953లో విడుదలైన గుణరత్నం సినిమా సుజాత సినిమాలో పాడింది. ఆ తరువాత సదసులాంగ్, వనమోహిని, సురయ, మాతలాంగ్, వరద కగెడ వంటి సినిమాలలో అనేక సింహళ పాటలు పాడింది. 1998లో తమిళనాడు ప్రభుత్వం జమునారాణిని కళైమామని పురస్కారంతో సత్కరించింది. 2002 సంవత్సరానికి అరైనార్ అన్నాదురై పురస్కారాన్ని కూడా అందుకున్నది
పాడిన సినిమాలు
· ఆత్మబలం (1964)
· రాముడు భీముడు (1964)
· ఆత్మ బంధువు (1962)
· కులగోత్రాలు (1962)
· మంచి మనసులు (1962)
· శభాష్ రాజా (1961)
· చివరకు మిగిలేది (1960)
· భాగ్య దేవత (1959)
· శభాష్ రాముడు (1959)
· ద్రోహి (1948)
ఫేమస్ సాంగ్స్
కొన్ని పాటలు
- నాగమల్లి కోనలోన
- ముక్కుమీద కోపం – నీ ముఖానికే అందం
- ఓ… దేవదా
- ‘పదపదవె వయ్యారి గాలిపటమా,
- కోటు బూటు వేసిన బావ వచ్చాడయ్యా
- ‘సరదా సరదా సిగరెట్టు
- ‘ఎంత టక్కరి వాడు నారాజు
స్వరవీణా పాణి చెప్పిన విశేషాలు
మిధునం సినిమాలో ‘’ఎవరు గెలిచారిప్పుడు రంగా ,ఎవరు ఓడారిప్పుడు ‘’పాత ను భరణి వీణాపాణి అందరూ జమునా రాణి తో పాడించాలని ఆమె ఇంటికి వెళ్లి గౌరవంగా తీసుకొస్తే వచ్చి ‘’ఇంత మంది కొత్త గాయకులూ ఉంటె ,ఎప్పుడో పాడిన నా తో పాడించటం ఏమిటి నన్ను వదిలేయండి ‘’అని లేచి వెళ్లిపోతుంటే పాణి ఆమెను బ్రతిమిలాడి కూర్చోబెట్టి రెండు గంటలు మాట్లాడి ఒప్పించి పాడిం చాడు. అద్భుతంగా పాడింది .అని చెప్పాడు .వృద్ధ గాయని జమునా రాణి గారితో పాడించే అదృష్టం తనకు దక్కింది అన్నాడు స్వర వీణా పాణి .సింహళీ భాషలో అత్యధిక పాటలు పాడిన గాయని కూడా జమునా రాణి గారే .మూగమనసులో ముక్కు మీద కోపం పాట ఎంత మత్తెక్కిస్తూ పాడిందో మనకు తెలుసు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-3-22-ఉయ్యూరు