గోప బంధు దాస్ -3
కటక్ కాలేజి జీవితం
1899లో గోపబంధు పూరీ వాన్ షా కాలేజి ఆర్ట్ సబ్జెక్ట్ చదవటానికి చేరాడు .23వ ఏట భార్య కాపురానికి వచ్చింది .తండ్రి చనిపోయాడు .అన్న నారాయణ్ దాస్ ఆస్తి కుటుంబ వ్యవహారాలూ చూశాడు .కాలేజి లెక్చరర్స్ తోకలిసి దాసు మిత్రులు ‘’కర్తవ్య బోధినీ సమితి ‘’స్థాపించి సాంఘిక రాజకీయ చర్చలు సేవా కార్యాలు చేశారు .బెంగాలీ పాఠాన్నే అనువాదానికి ఇవ్వటం అవమానంగా భావించి సమితి ఆందోళన చేస్తే యూని వర్సిటి ఒరియా పాఠాన్ని ఇవ్వటానికి ఒప్పుకొన్నది .ఆర్తజనాన్ని వరదబాధితులను ఆదుకొన్నారు .నిధులు వసూలు చేసి ఆర్ధికంగా తోడ్పడ్డారు .
1901లో ఎఫ్ ఏపరీక్ష పాసై ,చదువు మానేయాలనుకొన్నాడు .అన్నబలవంతం పై బిఎ లో చేరాడు .దేశ సమస్యలు ఆయన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి చదువుపై శ్రద్ధ పెట్టలేకపోయాడు .సమాజ సంక్షేమకార్యాలపైనే దృష్టి పెట్టి పని చేశాడు .అందుకే పరీక్ష తప్పాడు .ఒక్కగానొక్క కొడుకు చనిపోవటం మరీ బాధించింది .1904లో బీఏ పాసై న్యాయశాస్త్ర తరగతుల్లో ,ఎం ఎ లో చేరాడు .
కలకత్తా లో
డిగ్రీ పాసై ఆయనా ,గోపినాథ దాస్ వైద్యనాథ మిశ్రాలు రామచంద్ర దాస్ ను కలిసి సలహా ఇవ్వమని అడిగితె ‘’మీ లక్ష్యం ఏమిటి “”?అని ప్రశ్నించగా ‘’ప్రభుత్వోద్యోగం ‘’అని అంటే దాసు మాత్రం చెమ్మగిలిన కళ్ళతో ‘’సాంఘిక సీవ ,స్వచ్చంద జీవితం ‘’అన్నాడు .ఆ ఇద్దరు ప్రభుత్వోద్యోగం లో చేరి డిస్ట్రిక్ట్ ,సబ్ డివిజినల్ మేజి స్ట్రేట్ లు గా రిటైరయ్యారు .గోపబందు మొదట కటక్ తర్వాత కలకత్తా లో లా చదివాడు .కలకత్తాలో యజమానులు ఒరియా పని వారిని చాలా హీనంగా చూడటం గమనించి వారిలో సమైక్యత కోసం కృషి చేశాడు .ఒరియా బృందాలు సమాజాలు ఏర్పరచాడు .వారికి చదువు నేర్పటానికి రాత్రి బడులు నిర్వహించాడు .ఇప్పటికీ ‘’గోపబంధు నైట్ స్కూల్ ‘’కలకత్తా లో ఉన్నది .మనిషి కలకత్తా లో ఉన్నా మనసు ఒరిస్సాలో లగ్నమైంది .ఒరిస్సా వరదలు కల్లోల పరిచాయని మూడు వందలమైళ్ళ దూరం లో దాసు కు తెలిసి ఆఘమేఘాలమీద వారికోసం నిధులు సేకరించి సాయం అందించాడు మిత్రులతో కలిసి .కలకత్తా లోని ఒరియా యువకులకూ అవసరైన సాయం చేసేవాడు .దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ లాగా ఒరిస్సాలోనూ ఏర్పరచాలని మిత్రులతో ఆలోచించాడు .
హింసా విప్లవ వాదం తో భేటీ
1905లో కలకత్తా యూని వర్సిటిలో చదువుతూనే వేసవికి భువనేశ్వర్ వచ్చి ,స్నేహితుడు వసుదేవ రధ ఇంట్లో ఉన్నాడు .గురువు రామ చంద్ర వీరిని చూడటానికి వచ్చాడు . అప్పుడే బెంగాల్ హింసా విప్లవవాది శశి భూషణ రాయ్ చౌదరితో పరిచయమైంది .అతడు భువనేశ్వర్ లో ప్రైవేట్ ట్యూటర్ గా ఉంటూ ,ఒక కేంద్రం ఏర్పాటు చేసి ఒరిస్సా నుంచి హింసా వాదులని తయారు చేస్తున్నాడు ,దాసు మిత్ర బృందంతో కలిసి ‘’ఏకామ్ర అకాడెమి ‘’అనే జాతీయ స్కూల్ ఏర్పరచి .డబ్బు ఇబ్బందితో కొద్దికాలం తర్వాత మూసేశారు ..కొద్దికాలం తర్వాత గురువు చనిపోయాడు.
బెంగాల్ లోలాగా ఇక్కడా వందేమాతరం ఉద్యమకారుల బృందం ఏర్పడినది.కాషాయ వస్త్రాలు ధరించి గ్రామాలలో స్వదేశీ భావాలను విప్లవ భావాలను వ్యాపింపజేశారు .వ్రజ సుందరదాస్ కూడా వీరిలో చేరాడు .గాంధీ కంటే పదేళ్ళ ముందే గోపబందు సంఘ సేవద్వారా ప్రజలలోస్వాతంత్రేచ్చ కలిగించాడు .సంఘ సేవ గ్రామ పునర్నిర్మాణం తో జాతిపునరుజ్జీవం కలగాలని అతదడిఆశయ0 .
1906లో లా పాసై బిఎల్ డిగ్రీ పొంది దాసు ఆనందంగా ఉండగా అయన 28వ ఏట భార్యమరణ వార్త కుంగ దీసింది .శిష్యుడు న్యాయవాది వృత్తిలో ప్రవేశించే లోపే గురువు రామచంద్ర దాస్ చనిపోయాడు . పన్నెండు ఏళ్ళ వైవాహిక జీవితం లో ముగ్గురు కూతుళ్ళు ఇద్దరు కొడుకులే మిగిలారు .మళ్ళీ పెళ్లి చేసుకోమని అన్నగారు బంధుమిత్రులు బలవంతపెడితే ‘’ఆమె కంటే ముందు నేను చని పోయిఉంటే ,ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోమనే వారా మీరు ‘’అని ఎదురు ప్రశ్న వేసి ఆ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టాడు .
గోప బంధులో అతీత మానవత్వం నిబిడీ కృతమై ఉంది .అతని ఒక్క గానొక్క కొడుకు మంచం పట్టాడు .అందరు వచ్చి పలకరిస్తున్నారు .అప్పుడే దోవార్ లో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ,మనుషులు ఇంటికప్పులపైనా చెట్ల మీదా ఉండిపోయారని వార్త వచ్చింది .కన్నీరుకారుస్తూ మిత్రులతో ‘’నా కొడుకు బాధ్యత మీకు అప్పగించి నేను వరద బాధితుల సాయం కోసం వెడుతున్నాను ‘’అని నిశ్చయంగా చెప్పగా ‘’అదేమిటి నీ కొడుకు గతి ??అనగా ‘’వాడి బతుకు మన చేతిలో లేదు . భగవంతుడి చేతిలో ఉంది .నా కొడుకు ఒక్కడినే రక్షిస్తూ కూర్చుంటే అక్కడ వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసి పోతాయి ‘’అని చెప్పి వెళ్ళిపోయాడు .కొడుకు చనిపోయాడు .తలిదండ్రులు భార్య పుత్రుడు గురువు చనిపోవటం తో దాసు ఒంటరి వాడై,స్వచ్చంద జీవితం గడిపాడు .చిన్నపిల్లలైన కొడుకుల్ని అన్నగారు నారాయణ్ సంరక్షణ లో ఉంచి ,పూర్తిగా ప్రజాసేవకే అంకితమై ‘’ఉత్కళ దేశ పిత ‘’అయ్యాడు .వంగ దేశపు ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ గోపబంధుకు ‘’ఉత్కళ మణి’’బిరుదు ప్రదానం చేశాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-22-ఉయ్యూరు