137-కుటుంబ కధా చిత్రాల దర్శకుడు-కట్టా సుబ్బా రావు
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-137
137-కుటుంబ కధా చిత్రాల దర్శకుడు-కట్టా సుబ్బా రావు
ట్టా సుబ్బారావు తెలుగు సినిమా దర్శకుడు. ఇతడు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కుటుంబకథా చిత్రాలే. ఇతడు సుమారు 20 సినిమాలకు దర్శకుడిగా పనిచేశాడు. ఇతడు 1940 జనవరి 3వ తేదీన పుట్టాడు. ఇతని స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా, రాజోలు మండలం, ములికిపల్లె అయినా ఇతడు రంగూన్‌లో పెరిగాడు[1]. బొంబాయిలోని ఒక ప్రైవేటు సంస్థలో కెమెరామాన్‌గా శిక్షణ పొందాడు. ఇతడు చాలా చిన్న వయసులోనే అంటే 48 ఏళ్ల వయసులోనే 1988, జూలై 12వ తేదీన మరణించాడు. ఇతడు కె. ప్రత్యగాత్మ, వి.మధుసూదనరావు ల వద్ద దర్శకత్వశాఖలో శిక్షణ పొందాడు. ఇతడికి 1979లో నిర్మించబడిన దశ తిరిగింది మొదటి సినిమా కాగా 1985లో విడుదలైన మాంగల్య బంధం ఆఖరి సినిమా[2].
సినిమాల జాబితా
- దశ తిరిగింది (1979)
- వియ్యాలవారి కయ్యాలు (1979)
- కొంటెమొగుడు పెంకిపెళ్ళాం (1980)
- కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (1980)
- పెళ్ళిగోల (1980)
- బంగారు బావ (1980)
- మొగుడు కావాలి (1980)
- అల్లుడు గారూ జిందాబాద్ (1981)
- గడసరి అత్త సొగసరి కోడలు (1981)
- ఘరానా గంగులు (1981)
- ప్రేమ నాటకం (1981)
- మా పెళ్ళి కథ (1981)
- శ్రీరస్తు శుభమస్తు (1981)
- ఇద్దరు కొడుకులు (1982)
- కోరుకున్న మొగుడు (1982)
- వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)
- అక్కమొగుడు చెల్లెలి కాపురం (1983)
- పుణ్యం కొద్దీ పురుషుడు (1984)
- మాంగల్య బంధం (1985)
· చనిపోయే వరకు టాబ కేన్సర్ విషయం ఎవరికీ చెప్పని కట్టా
· సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ ఓ కన్నీటి గాధ ఉంటుంది. తమ కుటుంబాన్ని పోషించడం కోసం సినిమా వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఎంత కష్టం వచ్చినా కుటుంబాన్ని సంతోషంగా ఉంచే వారు. తమకు ఎలాంటి కష్టం వచ్చినా తనలోనే దాచుకొని కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేవారు బహుశా సినిమా ఇండస్ట్రీ లోనే ఉంటారు కావచ్చు. ఆ విధంగా 30కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కట్టా సుబ్బారావు అనే దర్శకుడు తనకు క్యాన్సర్ ఉందన్న విషయాన్ని సొంత కుటుంబానికి కూడా చెప్పలేదు. చెబితే ఎక్కడ బాధపడతారో అన్న ఆ కారణంగా ఆయన చెప్పకుండా గొప్ప వ్యక్తిగా మారిపోయాడు.
·
· కోనసీమలోని రాజోలు కు చెందిన ఆయన ఒకప్పటి ప్రసిద్ధ దర్శకులు ప్రత్యగాత్మ వద్ద 15 సంవత్సరాలు శిష్యరికం చేసి వియ్యాల వారి కయ్యాలు అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. కృష్ణ జయప్రద జంటగా నటించిన ఈ సినిమా తర్వాత ఆయన పదేళ్ళకాలంలో 30కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త, మొగుడు కావాలి, బంగారు బావ, శ్రీరస్తూ శుభమస్తూ, కొంటె మొగుడు పెంకి పెళ్ళాం, సీత పుట్టిన దేశం లాంటి ఎన్నో సూపర్ హిట్ అద్భుతమైన చిత్రాలను ఆయన దర్శకత్వంలో తెరకెక్కాయి.
·
· 1988లో ఆయన మరణించే నాటికి ఆయన వయసు కేవలం 49 సంవత్సరాలు మాత్రమే. లుకేమియా తో బాధపడ్డాడు ఈ గొప్ప దర్శకుడు. ఇక్కడే విచారకరమైన విషయం ఏమిటంటే తనకు ఈ రకమైన క్యాన్సర్ ఉందన్న విషయం భార్యతో సహా కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. వారికి అనుమానం రాకుండా మెడిసిన్స్ తీసుకుంటూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో షూటింగ్ లో పాల్గొనీ గొప్ప గొప్ప సినిమాలను తెరకెక్కించారు. ఆయనకు ఆ వ్యాధి ఉందన్న విషయం కుటుంబ సభ్యులకు చివరి దశలో తెలిసిందట. అప్పటికే ఆయనను క్యాన్సర్ దాదాపుగా కబలించేయడంతో కుటుంబ సభ్యులు కూడా దాన్ని ఏమీ చేయలేకపోయారు.
·
· ఫ్యామిలీ డ్రామాల స్పెషలిస్ట్ కట్టా సుబ్బారావు
·
కట్టా సుబ్బారావు అంటే 1980ల్లో తెలుగు తెరను ఒక ఊపు ఊపిన దర్శకుడు. ఫ్యామిలీ డ్రామాలు తీయడంలో బహు నేర్పరి. ఆయన కెరీర్ మొత్తం మీద సుమారు 20 సినిమాలు తీసుంటారు. అన్నీ కుటుంబ కథా చిత్రాలే. అది కూడా మాస్‌కి నచ్చే విధంగా తీయడమే ఆయన ప్రత్యేకత. ఆయన గురించి చెప్పాలంటే ముందు ‘వయ్యారి భామలు-వగలమారి భర్తలు’ గురించి చెప్పుకోవాలి. ఎన్టీఆర్, కృష్ణ కలిసి నటించిన ఆఖరి సినిమా అది. వారిద్దరూ అన్నదమ్ములుగా పోటాపోటీగా యాక్ట్ చేశారు. ఓపెనింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్‌లో వచ్చాయి.
·
·
పత్యగాత్మ, వి.మధుసూదనరావు దగ్గర దర్శకత్వశాఖలో శిక్షణ పొందిన కట్టా సుబ్బారావుకు ‘దశ తిరిగింది’ (1979) సినిమాతో దర్శకునిగా దశ తిరిగింది. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, మురళీమోహన్, చంద్రమోహన్‌లాంటి ప్రముఖ హీరోలతోసినిమాలు చేశారు. కృష్ణతో నాలుగు సినిమాలు చేశారు. చిరంజీవికి కెరీర్ తొలినాళ్లలో ‘మొగుడు కావాలి’లాంటి సూపర్‌హిట్ ఇచ్చారు. చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర చేసిన సినిమా అది. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ‘శ్రీరస్తు-శుభమస్తు’ కూడా మంచి మార్కులు సంపాదించింది. ఇక చిరంజీవి గెస్ట్‌గా చేసిన తొలి సినిమా ‘ప్రేమ నాటకం’ (1981). దానికి కట్టా సుబ్బారావే దర్శకుడు.
·
ఫామిలీ డ్రామాల స్పెషలిస్ట్ కట్టా
·
కట్టా సుబ్బారావు స్టార్స్‌తో సినిమాలు చేసినా కూడా స్టోరీకే వేల్యూ ఇచ్చేవారు. భారతీయ వివాహ సంస్కృతి, భార్యాభర్తల దాంపత్యం, అల్లుళ్లు, కోడళ్లు… ఎక్కువగా ఈ నేపథ్యాన్నే నమ్ముకున్నారాయన. వియ్యాలవారి కయ్యాలు, బంగారు బావ, కోడళ్లొస్తున్నారు జాగ్రత్త, కొంటె మొగుడు-పెంకి పెళ్లాం, పెళ్లి గోల, అల్లుడుగారు జిందాబాద్, గడసరి అత్త-సొగసరి కోడలు, ఘరానా గంగులు, కోరుకున్న మొగుడు, అక్క మొగుడు-చెల్లెలి కాపురం, పుణ్యం కొద్దీ పురుషుడు ఇత్యాది చిత్రాలను డెరైక్ట్ చేశారు. సుమన్, చంద్రమోహన్ నటించిన ‘మాంగల్య బంధం’ (1985) ఆయన ఆఖరి సినిమా. 1940 జనవరి 3న పుట్టిన ఆయన చాలా చిన్న వయసులోనే (1988 జూలై 12న) కాలధర్మం చెందారు. రాశి కన్నా వాసికే ప్రాధాన్యమిచ్చిన కట్టా సుబ్బారావు తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకోదగ్గ దర్శకుడు.
· సశేషం
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-22-ఉయ్యూరు