గోప బంధు దాస్ -4

గోప బంధు దాస్ -4
రాజకీయ అరంగేట్రం
గోపబంధు కటక్ లో ఉండగా మధుసూదన దాస్ ‘’ఉత్కళ సమ్మెళన ‘’అనే ఉత్కళ యూనియన్ కాన్ఫరెన్స్ జరిపాడు .ఆయనే తర్వాత ఒరిస్సా కురు వృద్ధ మూర్తిగా ప్రసిద్ధి పొందాడు .బెంగాల్ మద్రాస్ మధ్యప్రేదేశ్ లలో ఉన్న ఒరియా ప్రాంతాలను సమైక్యం చేసి ,అక్కడ సామాజిక సాంస్కృతిక చైతన్యం పెంపొందించి జాతీయత ప్రతిష్టించటం ఆ సంస్థ లక్ష్యం .1903లో పర్లాకిమిడి లో సమావేశం జరిపినపుడు దాసు విద్యార్ధిగా పాల్గొన్నాడు .కొంతమంది ఆప్రాంతాలు బెంగాల్ లో కలపాలని అంటే ,బెంగాల్ లో కలిస్తే ఒరియా అస్తిత్వం దెబ్బతింటుందని దాసు వర్గం వ్యతిరేకించారు .తనభావాలను పత్రిక ముఖంగా వ్యాసాలలో తెలియబరచాడు కూడా .చేనేత నుప్రోత్సహించటానికి చేనేత వస్త్రాలే కట్టేవాడు .ఒకసారి ఆచార్య హరిదాస్ ఈయనకోసం రెండున్నర రూపాయలు పెట్టి తన స్వస్థలమైన రాణపూర్ నుంచి చేనేత బట్టలు ఒక జత తెచ్చి ఇవ్వగా తనవంటి పేదవాడికి అవి కట్టుకొనే అర్హత లేదని కట్టుకోలేదు .
చదువుకోసం అన్నగారి మీద ఆధార పడటం ఇష్టం లేక న్యాయ శాస్త్రం మీదే దృష్టిపెట్టి ఏడాదిన్నర అధ్యయనం చేసి ,కలకత్తాలో పరీక్ష రాయటానికి వెళ్లి ,ఒక పూట కూళ్ళ ఇంట్లో బస చేశాడు .నాగరక కలకత్తాలో కూడా ఆయన తన సంప్రదాయ ఒరియా దుస్తులలోనే ఉండేవాడు .గంగాస్నానం చేసి పెద్దగా భగవద్గీత వల్లించేవాడు .ఆయన చాదస్తాన్ని వింతగా చూసినా నిర్మల విధానాన్ని మెచ్చేవారు .ఉన్నతపదవులు బెంగాలీ లకే అనీ ,ఒరియా వాళ్ళు వంటా ,కూలీ పని చేసే వాళ్ళే అని అభిప్రాయం ఉండేది .ఇది గ్రహించి ఒరియా వారిలో గతవైభవ స్మృతి రగిల్చి చైతన్యం తెచ్చాడు గోప బంధు .
1904లో కటక్ కాన్ఫరెన్స్ లో రాయ్ బహాదర్ రాజకిశోర్దాస్ ఆహ్వాన సంఘ కార్యదర్శి .గోపబందు బెంగాలీ స్నేహితులు చాలామంది వచ్చారు .రెండు వర్గాలు ఒకటి మధుసూదన దాస్ నాయకత్వం లో ఒరియావారు ,రెండవవర్గం నేతాజీ తండ్రి రాయ్ బహాదర్ జానకీనాధ బోస్ బెంగాలీలు ఏర్పడి .దాస్ నాయకత్వం వారు బెంగాలీలను సమావేశానికి రాకుండా అడ్డు పడ్డారు .ముఖ ద్వారం వద్ద గోపబందు తన బెంగాలీ మిత్రులతో మాట్లాడు తుంటే ‘’బెంగాలీలను లోపలి పంపద్దు’’ అని మధుసూదన్ కేక వేయగా ,ఆ సంకుచితత్వాన్ని వ్యతిరేకించి అది జాతీయసమావేశం కనుక అక్కడినుంచి మిత్రులతో కలిసి బయటికి వెళ్ళిపోయాడు .మర్నాడే మధుసూదన్ కు లేఖరాస్తూ తన ఆగ్రహం వ్యక్తం చేసి శిరస్త్రాణ౦ కూడా వాపస్ చేయగా ,మధుబాబు జరిగిన పొరబాటుకు దాసుకు మిత్రులకు క్షమాపణ చెప్పాడు .మర్నాడుముఖద్వారం వద్ద ఇద్దరూ ఆప్యాయంగా కౌగలిన్చుకొన్నారు .ఇలా విద్యార్ధి దశలోనే నిర్భయంగా తన మనో భావాలు వ్యక్తం చేసినవాడు గోప బంధు .
న్యాయవాది
నీలగిరి సంస్థానం లో కొత్త విద్యా సంస్థ ప్రారంభిస్తూ డిగ్రీ ఉన్న హెడ్ మాస్టర్ కావాలని గోపంబందు ను కలియగా ఉమా చరణ దాస్ ను సూచించగా ఆయన ఒప్పుకొని చేరాడు .హరిహరదాస్ సెకండ్ హెడ్ మాస్టర్ . ప్రాచీన గురుకుల పద్ధతిలో విద్య నేర్పాలని హరిహర అనుకొంటే ,అభి వృద్ధి చెందని ఈ ప్రాంతం లోఆచరణ కుదరదని ఉమా చరణ్ అభిప్రాయపడి రాజీనామా చేసి ,డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. గోపబంధు హెడ్ మాస్టర్ అయ్యాడు .ఆరునెలలుశ్రమించి ఒక స్థిరరూపానికి తెచ్చి ,దానికి అడ్డు తగులుతున్న సంస్థానాల పొలిటికల్ ఏజెంట్ కొబ్డన్ రామ్సే వలన పదవి వదిలేసి కటక్ లో లా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు .
నీలగిరిలో ఉండగా గోపబందు హరి హర తోకలిసి ‘’స్వచ్చంద సేవా సంస్థ ‘’ఏర్పరచాడు .ఒక రోజు వాహ్యాళికి వెడుతుండగా దారిపక్క ఒక ముసలమ్మ దీనా వస్తలో కనిపించగా ఆమె కొడుకు కలరాతో చనిపోయాడన్న బాధలో ఉన్న ఆమెను ఓదార్చి అతడికి అగ్ని సంస్కారం చేయించారు. శవాన్ని ముట్టుకోవటానికి ఎవరూ రాలేదు అన్ని ఏర్పాట్లు చేసి ఆమెతోనే జరిపించారు .ఆమెకు ధన సాయం చేసి ఆమె ను ఆమె గ్రామానికి పంపారు .నీలగిరి బ్రాహ్మణులకు అది ఆగ్రహం తెప్పించి ,వీరిద్దరిని పంక్తి బాహ్యులను చేశారు .వారిని లెక్క చేయకుండా తమ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు .ఆతర్వాత వాళ్ళే తమ ప్రవర్తన కు సిగ్గుపడి క్షమాపణ కోరారు .సంస్థాన ఉద్యోగులలో సంఘసేవాభావం జాతీయతా కలిగించాడు గోపబందు .
కలకత్తా కాంగ్రెస్ కు ఒరియా ప్రతినిధులుగా దాసు మిత్రులు వెళ్లి ,అధ్యక్షుడు నౌరోజీ ‘’స్వాతంత్ర్యమే కాంగ్రెస్ లక్ష్యం ‘’అని ప్రకటించగా .కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని నిర్ణయించుకొన్నారు .1906లో నీలగిరి సంస్థాన పదవి వదిలేసి కటక్ లో న్యాయవాది అయ్యాడు దాసు .కొంతకాలం ప్రసిద్ధ న్యాయవాదులవడ్డ అప్రెంటిస్ గా ఉంటూ పేదలకు న్యాయం జరగటం లేదని భావించి అసంతృప్తి తో ఉన్నాడు. ఆగస్ట్ లో వైతరణి బ్రాహ్మణి ఖారాసోర్ నదులు పొంగి చాలా నష్టం కలిగింది .జాజ్ పూర్ ,కేంద్రపారా ప్రాంతాలు సర్వ నాశనమయ్యాయి .వెంటనే ఆహారం బట్టలు సేకరించే పని చేబట్టి రేవన్ షా విద్యార్ధులను వాలంటీర్స్ గా చేర్చుకొని వరదప్రాంతాలకు వెళ్లి చలించిపోయి ,పంట చేతికి వచ్చే దాకా వారి పోషణ జరగాలని భావించి ‘’కేంద్ర ఉత్కళ సమాజం ‘’స్థాపించి ప్రిన్సిపాల్ షా ను అధ్యక్షుడిని చేసి ,తాను ప్రధాన కార్యదర్శిగా వ్యాయం నైతికబోధన,ఆర్ధికాభి వృద్ధి సాహిత్య వికాసాలకు విడివిడిగా కార్యదర్శులను ఏర్పాటు చేసి ,వీటి పర్యవేక్షణకు మరో కార్యదర్శిని నియమించి ,అన్ని ప్రాంతాల్లో ఈ సమాజ శాఖలు ఏర్పాటు చేయించి ,అద్భుత కృషి చేసి లక్ష్యాన్ని సాధించాడు .తానూ ఎక్కడ ఉంటున్నా సమాజ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే ఉన్నాడు దాసు .ఆయనా మధుసూదన దాస్ స్టేట్స్ మన్ పత్రికకు పంపిన వరద భీభత్స విషయాలు తెలిసి దేశం దిగ్భ్రాంతి చెందింది .దేశం అన్ని ప్రాంతాలనుంచి అన్నిరకాల సాయం అందింది .8-4-1908 న జరిగిన యూనియన్ కాన్ఫరెన్స్ లో శాశ్వత నివారణోపాయ కమిటీ ఏర్పాటును గోపబందు ప్రవేశపెట్టి ఆమోదం పొందాడు . .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-18-3-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.