.బి.కె.మోహన్ రాజు (మార్చి 23, 1934 – మార్చి 16, 2018) సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు.[1][2] ఈయన పూర్తి పేరు కొండా బాబూ కృష్ణమోహన్ రాజు.
జననం – విద్యాభ్యాసం
ఇతడు 1934, మార్చి 23న ఉషాకన్య, శేషయ్య దంపతులకు విజయవాడలో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.& సి.వి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో జరిగింది.
ఉద్యోగం – నివాసం
హైదరాబాదులో ఎలెక్ట్ర్తిసిటీ బోర్డులో ఉద్యోగంలో చేరి అసిస్టెంట్ సెక్రెటరీ హోదాలో పదవీవిరమణ చేశాడు. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు.
సినిమా రంగం
ఇతడు 1960- 70 దశకాలలో అనేక చిత్రాలలో పాటలు పాడాడు. ఘంటసాల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వి.రామకృష్ణ, ఎస్.జానకి వంటి గాయకులతో కలిసి మాస్టర్ వేణు, కె.వి.మహదేవన్, సాలూరు రాజేశ్వరరావు, చెళ్ళపిళ్ళ సత్యం, మహాభాష్యం చిత్తరంజన్ మొదలైన వారి సంగీత దర్శకత్వంలో పాటలు పాడాడు. ఒక విడుదల కాని చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించాడు.
పాడిన సినిమా పాటల పాక్షిక జాబితా:
సంవత్సరం | సినిమా పేరు | పాట పల్లవి | గేయ రచయిత | సంగీత దర్శకుడు | సహ గాయని/గాయకుడు |
1967 | పూల రంగడు | చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగ మారినవి | సి.నారాయణరెడ్డి | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల |
1967 | సాక్షి | ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరు నీ కోసం | ఆరుద్ర | కె.వి.మహదేవన్ | |
1970 | విధివిలాసం | కాలానికి హృదయం లేదు కన్నీటికి విలువే | మాస్టర్ వేణు | ||
1970 | విధివిలాసం | బాపూజీ మన బాపూజీ జిందాబాద్ | తాపీ ధర్మారావు | మాస్టర్ వేణు | కోరస్ |
1970 | విధివిలాసం | ముసిరేసిందంటే పైన అసలే మతి | మాస్టర్ వేణు | విజయలక్ష్మి శర్మ | |
1970 | విధివిలాసం | వల్లరి బాబోయి కావురోరయ్యా | మాస్టర్ వేణు | విజయలక్ష్మి శర్మ | |
1970 | విధివిలాసం | విధి విలాసమేలే అంతా విధి విలసమేలే | మాస్టర్ వేణు | ||
1971 | తాసిల్దారుగారి అమ్మాయి | కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం ఆ నాటకం | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | |
1972 | ఇన్స్‌పెక్టర్ భార్య | రాధను నేనైతే నీ రాధను నేనైతే నిను | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
1973 | దేవుడమ్మ | చిన్నారి చెల్లి మా బంగారు తల్లి నీవేనమ్మ | సి.నారాయణరెడ్డి | సత్యం | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
1973 | ధర్మ నిర్ణయం | శివపాదముంచ నేను శిలనైనను కారాదా | అరిపిరాల విశ్వం | జనార్ధన్ | |
1973 | మన మహాత్ముడు | ప్రేమించే మనసొకటుంటే ప్రేమించాలనుకుంటే | కోపల్లె శివరాం | మహాభాష్యం చిత్తరంజన్ | |
1976 | పెద్దన్నయ్య | అన్న వదిన మాకోసం అమ్మా నాన్నగ నిలిచారు | గోపి | సత్యం | ఎస్.జానకి |
1977 | పెళ్ళి కాని పెళ్ళి | మరుమల్లెలు ఘుమ ఘుమలాడే వేళ | దాశరథి | సత్యం | పి.సుశీల |
విడుదల కాని చిత్రం | ప్రియురాలి నీలి కళ్ళల్లో సరదాలు నిండెను | ఎం.కె.రాము | కె.బి.కె.మోహన్ రాజు |
లలిత సంగీతం
ఆకాశవాణి, దూరదర్శన్‌లలో పాడిన కొన్ని పాటల వివరాలు:
గీతం | రచన | సంగీతం | సహ గాయని/గాయకుడు | ఇతర వివరాలు |
ఆది కవితా గళము చరచగ ఆణిముత్యములేరి మన విజ్ఞులౌ గురజాడ గిడుగులు | ||||
ఇది నా దేశం భారతదేశం | ఆచార్య తిరుమల | పి.వి.సాయిబాబా | విజయలక్ష్మీ శర్మ | ఈ మాసపు పాట |
ఎవరది ఇంతగ నను వేటాడేదెవరది | డా.బోయి భీమన్న | మహాభాష్యం చిత్తరంజన్ | ||
ఎవ్వరిదోయీ ఈ రేయి | డా.దాశరథి కృష్ణమాచార్య | మహాభాష్యం చిత్తరంజన్ | ||
కోకిలా నా పాట కూడా వినిపించుకో | డా.జె.బాపురెడ్డి | మహాభాష్యం చిత్తరంజన్ | ఈ మాసపు పాట | |
గుండెల్లో ఉండాలి కులాసా | దేవులపల్లి కృష్ణశాస్త్రి | మహాభాష్యం చిత్తరంజన్ | ||
చూచేకొలదీ సుందరము | డా.బోయి భీమన్న | మహాభాష్యం చిత్తరంజన్ | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | |
నాలోన రసభావమే | ఆచార్య తిరుమల | నల్లూరి సుధీర్ కుమార్ | ||
నింగిపై నీలాల తెరపై | ఓలేటి శశాంక | మహాభాష్యం చిత్తరంజన్ | ||
నిను కొలుచును ఈ జగమంత | పాలగుమ్మి విశ్వనాథం | పాలగుమ్మి విశ్వనాథం | ||
నీకథ సుధామృతం | కోపల్లె శివరాం | కలగా కృష్ణమోహన్ | ||
నీకన్నా పెద్దల | ||||
నీలి నీలి గగనంలో ఒక తార మెరిసింది | ఫాదర్ మాథ్యూస్ రెడ్డి | మహాభాష్యం చిత్తరంజన్ | వేదవతి ప్రభాకర్ | శివరంజని రాగం |
నీవే సురుచిర సుమధుర | కోపల్లె శివరాం | ఈమని శంకరశాస్త్రి | ||
నేల నవ్వుతోందా | ఓలేటి శశాంక | ఈ మాసపు పాట | ||
పంచ వన్నెల రామచిలుక | ||||
మా ఇంటికొచ్చింది గోదావరి | దాశరథి కృష్ణమాచార్య | మాస్టర్ వేణు | ||
మరచిపోవబోకె బాల మరచి పోవకే | అడివి బాపిరాజు | కె.బి.కె.మోహన్ రాజు | ||
మధుమాసంలా మృదుహాసంలా | అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి | ఎం.వి.రమణమూర్తి | ||
మేలుకో కోలుకో | ||||
మోహన రాగ రాగిణి | డా.బోయి భీమన్న | మహాభాష్యం చిత్తరంజన్ |
మరణం
ఈయన 2018, మార్చి 16న హైదరాబాదులో మరణించాడు[3].
వింజమూరి సీతా అనసూయ లతో కలిసి రేడియోలో పాతలుపాడాడు .అన్నమయ్య ‘’పలుకుతేనియల తల్లి పవళించెను ‘’లలితమనోహరంగా గానం చేశాడు .పదములే చాలు రామా గీతమూ గొప్పగా పాడాడు .’’వినవమ్మా చెలియా గుణ భద్రా తుంగభద్రా ‘’ అనే కృష్ణ శాస్త్రి గారి గీతానికి జీవం పోసి పాడాడు .;;లలిత సంగీతం అంటే కృష్ణశాస్త్రి గారే ‘’అని ఆరాధనగా చెప్పాడు గానరాజు .
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-3-22-ఉయ్యూరు