మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -151
151- రెండు స్వర్ణ నందులు పొందిన ‘’చిలకమ్మ చెప్పింది ‘’సినీ దర్శకుడు,మన బందరు వాడు –ఈరంకి శర్మ
రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, వంటి వారితో సినిమాలు తెరకెక్కించిన దర్శకులు ఈరంకి శర్మ (93) శుక్రవారం మృతి చెందారు. చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మచిలీపట్నంకి చెందిన ఈరంకి శర్మ తన తండ్రి చనిపోవడంతో చెన్నైకి వెళ్లారు. తన సోదరుడు దర్శకత్వం వహించిన ‘చిన్నమ్మ కథ’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారాయన. వేదాంతం రాఘవయ్య, కె.బాలచందర్ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా చేశారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలకు ఎడిటర్‌గానూ చేశారు.
1977లో రజనీకాంత్ నటించిన ‘చిలకమ్మ చెప్పింది’తో దర్శకునిగా మారారు. ఆ సినిమాకి బంగారు నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత తీసిన ‘నాలాగా ఎందరో’ చిత్రం కూడా బంగారు నంది గెల్చుకుంది. చిరంజీవి, మాధవిలతో ‘కుక్కకాటుకి చెప్పుదెబ్బ’ సినిమా తీశారు. ఆ తర్వాత ‘అగ్నిపుష్పం, సీతాదేవి’ వంటి చిత్రాలు తెరకెక్కించారు. తమిళ సినిమాలూ చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమకి వెళ్లాక తెలుగు సినిమాలు తగ్గించేశారాయన. ఈరంకి శర్మకి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు..
చిలకమ్మ చెప్పింది
ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. నిర్మాత చేగొండి హరిబాబు (రాజకీయనాయకులు చేగొండి హరిరామజోగయ్య), ఈరంకి శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమాకు మలయాళ సినిమా అడిమైకళ్ మాతృక
చిత్రకథ
సంగీత, లక్ష్మీకాంత్ అక్కాతమ్ముళ్ళు. మల్లి(శ్రీప్రియ) పేదమ్మాయి. పల్లెలో చిలక జ్యోస్యం వాడు చెప్పినట్టు తనకు చదువుకొన్న పెద్దింటి వరుడు వస్తాడని కలలు కంటుంది. సంగీత దగ్గర పని కోసం పల్లె నుండి పట్నం వస్తుంది. పేదవాడైన నారాయణరావు కూడా అక్కడే పనిచేస్తుంటాడు. అతడు కొంత చెవిటితనం కలిగి ఉంటాడు. మల్లిని అభిమానిస్తుంటాడు. రజనీకాంత్, లక్ష్మీకాంత్ కు స్నేహితుడు. పాలకొల్లు లాకుల ప్రభుత్వోద్యోగిగా వీరుంటున్న గ్రామానికి వస్తాడు. సంగీత పురుష ద్వేషి, సంగీతం టీచరు. ఆమె రజనీకాంత్ ను ‘కుర్రాడి’గా సంబోధిస్తుంది. అతనిపట్ల అయిష్టత ప్రదర్శిస్తుంది. మల్లి పెళ్ళి కాకుండానే గర్భవతి ఔతుంది. ఆమె లక్ష్మీకాంత్‌తో సంభందం కలిగి ఉండటం నారాయణరావు చూస్తాడు, అతడు చూసాడని వీళ్ళూ గమనిస్తారు, సంగీత రజనీకాంత్ ను దీనికి కారణం అనుకుంటుంది. ఆమెకు లోలోపల రజనీకాంత్ పట్ల ప్రేమ. రజనీకాంత్ మల్లి భాద్యతలను నారాయణరావుకు అప్పగించి అతడికి లాకులవద్ద ఉద్యోగం వేయించి బదిలీమీద వెల్లే తాను మళ్ళీ తను వచ్చేవరకూఅతడివద్దే ఉంచమని చెప్తాడు. బిడ్డపుట్తేవరకూ నారాయణరావు దగ్గర ఉన్న మల్లికి తనపై అతడి ప్రేమ తెలుస్తుంది. చివరకు బిడ్డ తండ్రిగా ఒప్పుకున్న లక్ష్మీకాంత్ మల్లిని తీసుకు వెళ్ళాలని వస్తే ఆమె ఒప్పుకోదు. తనకు పేదవాడైన నారాయణరావుతోనే జీవితం అని చెప్పి అతడితో పల్లెకు వెళ్ళీపోతుంది. సంగీత రజనీకాంత్‌ను క్షమించమని తనను పెళ్ళీచేసుకోమని కోరుతుంది.
చిత్ర విశేషాలు
· చిత్రం ఎక్కువ భాగం పశ్చిమగోదావరి జిల్లా లంకలకోడేరు గ్రామంలో చిత్రీకరించారు. గ్రామంలో ఉన్న ఎదురు ఎదురుగా కల రెండు మేడలను, ఉన్నతపాఠశాలను చిత్రీకరించారు.
అవార్డులు
పాటలు
· చిట్టి చిట్టి చేపల్లారా సెలయేటి పాపల్లారా, చిలకమ్మ చెప్పింది చల్లని మాట
· కుర్రాడనుకుని కునుకులుతీసే వెర్రిదానికీ పిలుపు (గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
· ఎందుకు నీకీ దాపరికము ఎన్నాల్లు దాస్తావు దాగని నిజము
నాలాగా ఎందఱో సినిమా
నాలాగ ఎందరో 1978, మే 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ప్రేమ్ రంజిత్ నిర్మాణ సారథ్యంలో ఈరంకి శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి. నారాయణరావు, రూప, హేమసుందర్, పి.ఎల్. నారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎమ్మెస్. విశ్వనాధన్ సంగీతం అందించాడు.[1] 1978 నంది అవార్డులులో నంది ఉత్తమ చిత్రం, నంది ఉత్తమ నటుడు (హేమసుందర్) అవార్డులతో పాటు ఈ సినిమాలోని పాటలకు నంది ఉత్తమ నేపథ్య గాయకుడుగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకు తొలి నంది అవార్డును వచ్చింది.
నటవర్గం
· జి. నారాయణరావు
· రూప
· హేమసుందర్
· పి.ఎల్. నారాయణ
· పల్లవి
· వాణి
· జానకి
· సీతాలత
· జయ
· జయ సుజాత
· శ్రీలక్ష్మీదేవి
· కృష్ణవేణి
· సుజాత
· బేబి రాణి
· లక్ష్మీకాంత్
· విక్రంబాబు
· దాశరథి
· కోనేశ్వర శాస్త్రి
· బుర్రా సుబ్రహ్మణ్యం
· శ్రీహరి రావు
· విజి ప్రసాద్
· పి. వెంకటేశ్వరరావు
· ఎం.బి.కె.వి. ప్రసాదరావు
· ప్రదీప్ కుమార్
· ఎస్. ప్రసాద్
సాంకేతికవర్గం
· చిత్రానువాదం, దర్శకత్వం: ఈరంకి శర్మ
· నిర్మాత: కె. ప్రేమ్ రంజిత్
· కథ: గణేష్ పాత్రో
· సంగీతం: ఎమ్మెస్. విశ్వనాధన్
· ఛాయాగ్రహణం: బి.ఎస్. లోకనాథ్
· కూర్పు: ఎన్.ఆర్. కిట్టు
· నిర్మాణ సంస్థ: ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్
పాటలు
ఈ చిత్రానికి ఎమ్మెస్ స్వామినాథన్ సంగీతం అందించాడు.[2]
- అనుభవాలకు ఆదికావ్యం ఆడదాని జీవితం (ఆచార్య ఆత్రేయ)
- కళ్యాణిని కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని (ఆచార్య ఆత్రేయ)
- బుల్లెమ్మ నీకళ్ళలో
- ఒకటా రెండా మూడా
అవార్డులు
1978 నంది అవార్డులు
- నంది ఉత్తమ చిత్రం
- నంది ఉత్తమ నటుడు – హేమసుందర్[3]
- నంది ఉత్తమ నేపథ్య గాయకుడు – ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (మొదటి నంది)[4]
కుక్క కాటుకు చెప్పు దెబ్బ
వికీపీడియా నుండి
కుక్క కాటుకు చెప్పు దెబ్బ గోపీకృష్ణా ఇంటర్నేషనల్ బ్యానర్‌పై వెలువడిన తెలుగు సినిమా.
సాంకేతికవర్గం
· కథ: చివుకుల పురుషోత్తం
· మాటలు: సి.ఎస్.రావు
· దర్శకత్వం, స్క్రీన్ ప్లే: ఈరంకి శర్మ
· పాటలు: ఆత్రేయ
· సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్
· ఛాయాగ్రహణం: రఘునాథరెడ్డి
· నిర్మాత: చలసాని గోపి
నటీనటులు
· మాధవి – పార్వతి
· చిరంజీవి – శేఖర్
· నారాయణరావు
· పల్లవి – కనకం
· హేమసుందర్
· పి.ఎల్.నారాయణ
· వంకాయల సత్యనారాయణ
· లక్ష్మీకాంత్
· రజని
· జానకి
పాటలు
- ఏమండీ ఏమనుకోకండి ఆకు చాటు మొగ్గను రేకు విడని పువ్వును – పి.సుశీల
- కన్నువంటిదీ ఆడదీ కన్నీరామెకు తప్పనిది తనవున – ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- యింత మంచోడివైతే బావా బావా బావ పనికి రావు – ఎల్.ఆర్.ఈశ్వరి, జి.ఆనంద్
- అందాల రాముడు సీతను కౌగిట పొదిగిన – ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం
- హే బేబి కాని కాని కైపులోన తేలనీ ఇలాగే తేలి – ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమోలా
అగ్నిపుష్పం
1987, డిసెంబరు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] జూపిటర్ ఫిల్మ్స్ పతాకంపై బోనం నరసింహరావు, సి. బుద్ధావతారం రాజు నిర్మించిన ఈ సినిమాకు ఈరంకి శర్మ దర్శకత్వం వహించాడు. ఇందులో శుభాకర్, రాజి, సీత నటించగా, ఎమ్.ఎస్.విశ్వనాధన్ సంగీతం అందించారు.[2
నటవర్గం
· శుభాకర్
· రాజి
· సీత
ఎమ్.ఎస్.విశ్వనాథన్
సాంకేతికవర్గం
· దర్శకత్వం: ఈరంకి శర్మ
· నిర్మాత: బోనం నరసింహరావు, సి. బుద్ధావతారం రాజు
· సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాధన్
· నిర్మాణ సంస్థ: జూపిటర్ ఫిల్మ్స్
· ఈరంకి శర్మ జీవిత విశేషాలు పెద్దగా తెలియ లేదు అందుకే ఆయన తీసిన గొప్ప సినిమాల గురించి వివరాలు అందించాను .
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-22-ఉయ్యూరు