· 155-స్వాతంత్ర్య సమరయోధుడు నటుడు నిర్మాత ,దర్శకుడు నలదమయంతి ఫేం – కెంప రాజ్ ఉర్స్
· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-155
· 155-స్వాతంత్ర్య సమరయోధుడు నటుడు నిర్మాత ,దర్శకుడు నలదమయంతి ఫేం – కెంప రాజ్ ఉర్స్
· 5-2-1917పుట్టి 18-5-1982 మరణించిన కెంపరాజ్ ఉర్స్ స్వాతంత్ర్య సమరయోధుడు నటుడు నిర్మాత ,దర్శకుడు.కన్నడ చిత్ర నిర్మాత దర్శకుడు .1940-50మధ్యకాలం లో ఆయన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి .కన్నడ రాజకుమార్ తెరంగేట్రం చేయటానికి ముందే కెంపరాజ్ హీరోగా స్థిరపడ్డాడు .ఈతనిపెద్దన్న దేవరాజ్ ఉర్స్ కర్నాటక ముఖ్యమంత్రి,,.
· మైసూర్‌లోని కలహళ్లి లో పుట్టిన రాజ్ క్లాస్ మేట్ ను పెళ్ళాడి ముగ్గురు కూతుళ్ళకు జన్మ నిచ్చాడు .డాక్టర్ అవాలనుకొన్న కెంప రాజ్ ,గాంధీ ప్రభావంతో స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొని జైలుకు వెళ్ళాడు .కన్నడ నాటక యజమాని గుబ్బి వీరన్న నుకలిసిఆయన నాటకాలలో వేషాలు వేశాడు .గుబ్బి వీరన్న స్వంతకంపేని గుబ్బి ఫిలిమ్స్ లో కెంపరాజ్ ను తొలిసారి పరిచయం చేసి జీవన నాటక 1942లో తీశాడు .దీనిలో శాంతాహుబ్లికర్ ఎం వి రాజమ్మ కూడా నటించారు .1947లో కృష్ణలీలలు లో కంసుడుగా నటించి పెద్ద విజయం సాధించాడు రాజ్ .1951లో రాజవిక్రమ ఒకే ధియేటర్ లో 25వారాలు ఆడి ఇంకా గొప్ప పేరు తెచ్చింది .ఆతర్వాత కన్నడ తెలుగు తమిళసినిమాలు చాలా డైరెక్ట్ చేశాడు .అందులో నలదమయంతి ఒకటి .కర్నాటక ఫిలిం డెవలప్ మెంట్ బోర్డ్ చైర్మన్ అయ్యాడు .తన జీవితచరిత్ర ‘’అరవై ఏళ్ళు ‘’రాసి 1973ప్రచురించాడు . నలదమయంతి సినిమా 1957లో విడుదలైంది .కెంపరాజ్ నలుడు భానుమతి దమయంతి .నాగయ్య ముక్కామల రేలంగి బిగోపాలం ,జయలక్ష్మి ఇతర నటులు .సంగీతం బి గోపాలం .రచన సముద్రాల జూనియర్ .నేపధ్యగానం ఘంటసాల భానుమతి,మాధవపెద్ది పిఠాపురం వగైరా .కెంపరాజ్ దర్శకత్వం .
పాటలు
- అరుభూమపధంబు తరణిమీరిన భోగి వంటలవాడగుచు (పద్యం) – మాధవపెద్ది
- అదిరెన్ నా కుడికన్ను నా కుడి భుజంభు అత్యంత (పద్యం) – పి. భానుమతి
- అతివా దాపగనేల నన్ వలచి నీకత్యంత సంతాప దుస్ధితి (పద్యం ) – ఘంటసాల
- అకటకటా దినమ్మును శతాధికతైర్దికఅర్దిక కోటికిన్ (పద్యం ) – ఘంటసాల
- అరయరానీ హరీ మాయ ఎరుగనెవరీ తరమయా – ఘంటసాల
- ఇంతి మా దమయంతి శ్రీమంతమిపుడు సంతోషమే పార – ఎన్.ఎల్.గానసరస్వతి బృందం
- ఇంతగలమా అహో ఇంతగలమా ఓహో ఇంతగలమా చెంచలా లతికరుహా – బి.గోపాలం, టి.కనకం
- ఈ వంతతోనే అంతమయేనా రవ్వంతే శాంతి – పి.భానుమతి
- ఈ వనిలో దయమాలినను ఎడబాయెనిల మనసాయెనయా ఇటు – పి. భానుమతి
- ఈ పాదదాసి మననేరదు మీ పదముల ఎడబాసి స్వామి – పి. భానుమతి
11 ఓహొ మోహన మాననమా విహరించు విహగమై వినువీధుల – పి. భానుమతి
- కనులు కాయలు కాయ కాచేవు వనిలోన కనికారమే లేని నను తలంచి (పద్యం ) – ఘంటసాల
- కలహంసి పలికిన అమరసందేశమేదో అనురాగపు అలలేవొ చెలరేగే – పి.భానుమతి
- ఘోరంభైన దవాగ్నికీలకెరయై ఘోషించు (పద్యం) – నాగయ్య
- చెలియరో నీ జీవితేశుని వలచి గొనుకొను సమయమే తొలగి నిలువక – పి. లీల, ఎన్.ఎల్.గానసరస్వతి
- చిన్నా సింగన్నా కునుకే రాదన్నా నిన్నే నమ్ముకున్నా నన్ను చూడుమన్నా- జిక్కి
- జాలి చూపవదేలరా ఈ బాల తాళగలేదు జాలి చూపవదేలరా – ఎం. ఎల్. వసంతకుమారి
- జీవనమే ఈ నవ జీవనమే హాయిలే పూవులును తావివలే కూరిమి మనేవారి – ఘంటసాల, పి. భానుమతి
- తారకావళీ తమ గతుల్ తప్పుగాక పొడుచుగావుట సూర్యుడు పడమటి (పద్యం ) – ఘంటసాల
- దెబ్బమీద దెబ్బ కడు దబ్బున ఏయి సుబ్బి – పిఠాపురం, ఎ.పి. కోమల
- నిత్యనావిచ్చితామర నీరజాక్షి బిరబిరా దిగిరా (పద్యం) – పిఠాపురం
- ప్రభో హే ప్రభో దరికొని దహియించు దావాగ్నికీలల కాలక నిలుచునే (పద్యం) – ఘంటసాల
- భువనైకమాతా గైకొమ్ము నాదు తుది నమస్కారము (పద్యం) – పి.భానుమతి
- భళిరే కంటిన్కంటి సప్తజలధిప్రావేష్టితా (పద్యం) – మాధవపెద్ది
- విచిత్రమే విధి లీల బలీయము కలి విలాసము – ఘంటసాల బృందం
- వీడా ప్రభూ బాహుకుడనువాడను నలుకొలుచు చుండువాడను (పద్యం ) – ఘంటసాల
- వరుణాలయ నివాసి కరుణా (పద్యం ) – ఘంటసాల
- వరుణది దేవుల వరియింపనను నాటి వలపైన తలపోయవా వనితా (పద్యం ) – ఘంటసాల
- హే గోవిందా హే ముకుందా శ్రీ వైకుంఠా నివాస సనాతనా జీవనమాల భూషణా – బి. గోపాలం
- హే భవానీ దయామయీ ఈ అపూర్వరూప (పద్యం) – పి. భానుమతి
- హే అగ్నిదేవా అమేయా కృపాపూరా పంచభూతా (పద్యం ) – ఘంటసాల
- హే మహేంద్రా శశినాధా ప్రేమసామ్రాజ్యా త్రిజగధభినాధ (పద్యం ) – ఘంటసాల సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-22-ఉయ్యూరు