మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-156
· 156-రచయితా నటుడు నిర్మాత సీరియల్స్ డాక్యుమెంటరీల నిర్మాత ,ప్ర్రాణం ఖరీదు ,కమలమ్మకమతం నవల ఫేం –సి.ఎస్.రావు
· సి.ఎస్.రావు (డిసెంబరు 20 , 1935 – ఏప్రిల్ 14, 2020) (చింతపెంట సత్యనారాయణరావు) రచయిత, నటుడు, నిర్మాత. ఆయన సుదీర్ఘ కథలు, స్టేజి నాటకాలు, రేడియో నాటకాలు, నవలలు, టి.వి. సీరియళ్ళు, డాక్యుమెంటరీలు, సినిమా వ్యాసాలను రాసాడు.[1]
జీవిత విషయాలు
రావు 1935, డిసెంబరు 20న ఆంధ్రప్రదేశ్ లోని ద్రాక్షారామంలో జన్మించాడు. నటనలో శిక్షణ కూడా అందించాడు. కొంతకాలంపాటు అర్థశాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేశాడు. చిక్కడపల్లి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ గా పనిచేశాడు. రావుకు సూర్యమణితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు.
సాహిత్యరంగం
1954లో అగ్నిపర్వతం నవల రాశాడు. 80 కథలు, 8 దృశ్య నాటికలు, 2 నాటికలు, 20 రేడియో నాటకాలు రాయడంతోపాటు 4 సినిమాలకు కథ, 8 సినిమాలకు మాటలు అందించాడు. బుల్లితెర నాటకాలు, 8 ధారావాహికలకు కథలు రాశాడు.[2]
సినిమారంగం
ఎన్టీఆర్ నటించిన సరదా రాముడు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘సొమ్మొకడిది సోకొకడిది‘ చిత్రాల్లో రావు నటించాడు.
1. ఊరుమ్మడి బతుకులు
2. కమలమ్మ కమతం
3. ప్రాణం ఖరీదు
4. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
5. తరం మారింది.
6. నాయకుడు వినాయకుడు
7. మల్లె మొగ్గలు
8. యజ్ఞం
9. దీక్ష
10. సొమ్మొకడిది సోకొకడిది (నటించారు)
11. సరదా రాముడు (నటించారు)
12. మట్టి మనుషులు (నటించారు)
కార్యక్రమాలు
1. యేగూటి చిలక ఆ గూటి పలుకు (ఒకే ఎపిసోడ్ కార్యక్రమం)
2. రాజశేఖర చరిత్ర
3. భతృహరి జన్మ వృత్తాంతము
4. రాజి బుజ్జి
5. జాతక కథలు
6. విక్రమార్క విజయం (సంభాషణలు మాత్రం)
7. కళాపూర్ణోదయం (హిందీ సీరియల్ – నేషనల్ నెట్ వర్క్)
8. ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాలు (హిందీ సీరియల్ – నేషనల్ నెట్ వర్క్)
9. కర్పూర వసంత రాయలు
10. మ్యూసిక్ అండ్ డాన్స్ ఇన్ ఎ.ప్ (50 సంవత్సరాల స్వాతంత్ర్య సీరియళ్ళు)
11. విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు (హైదరాబాదు దూరదర్శన్)
సీరియళ్ళు
1. మీరు ఆలోచించండి
2. శిఖర దర్శనం (ఒక ఎపిసోడ్)
3. మిత్రలాభం
4. వరుడు కావాలి (13 ఎపిసోడ్లు)
5. డామిడ్ కథ అడ్డం తిరిగింది.
6. దృష్టి
7. గణపతి
8. విద్య
9. మళ్ళీ తెలవారింది (స్క్రీన్ ప్లే మాత్రమే)
టెలివిజన్ నాటకాలు
1. క్రెడిట్ కార్డు
2. తీర్పు (20 విషయాల సూత్రంతో కూడిన నాటకం)
3. కామమ్మ మొగుడు
4. ఓరుమ్మడి బతుకులు
5. కళ్ళు తెరవండ్రా
6. పెరఫెక్ట్ వైఫ్
7. రాధా మాధవీయం
8. సెల్ గోల
9. లవ్ పాఠాలు
10. కొత్త దంపతులు
11. మీరెలా అంటే అలాగే
12. పుణ్యభూమి (డైలాగులు మాత్రమే)
స్టేజీ నాటకాలు
1. మళ్ళీ ఎప్పుడొస్తారు [3]
2. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు [4][5]
3. ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్యం [4]
4. ఊరుమ్మడి బతుకులు[6]
మరణం
రావు అనారోగ్యంతో 2020, ఏప్రిల్ 14న హైదరాబాదు మెట్టుగూడ రైల్వే ఆసుపత్రిలో మరణించాడు.[7]