· 159-ఆంద్రా దిలీప్ కుమార్ ,హీరో ,సహాయనటుడు నిర్మాత మట్టిలో మాణిక్యం బొమ్మా బొరుసా ఫేం,-చలం
· చలం ఒక తెలుగు సినిమా నటుడు, నిర్మాత.[1] 100కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా, హాస్యనటుడిగా, సహాయనటుడిగా నటించాడు. ఇతని అసలు పేరు కోరాడ సూర్యాచలం. ఆంధ్రా దిలీప్ కుమార్ అని ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు. ఇతడు రమణకుమారిని వివాహం చేసుకున్న తరువాత తన పేరును రమణాచలం అని మార్చుకొన్నాడు. దాసి సినిమా ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. హీరోగానే కాక, రెండవ కథానాయకునిగా, హాస్యనటునిగా, సహాయ నటునిగా, చిత్ర నిర్మాతగా రాణించాడు. నటి శారదను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో దాసరి నారాయణరావు ఈయనను ప్రోత్సహించాడు.
కెరీర్
1952లో లక్ష్మీరాజ్యం నిర్మించిన దాసి చిత్రంలో రెండవ కథానాయకుడిగా సినీ రంగంలో ప్రవేశించాడు చలం. ఈ చిత్రం విజయం సాధించింది. అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అమర్ నాథ్ నిర్మించిన నా చెల్లెలు చిత్రంలో రెండో కథానాయకుడిగా నటించాడు. బబ్రువాహన చిత్రంలో ఎన్. టి. ఆర్, కాంతారావు, ఎస్. వరలక్ష్మి, రాజసులోచన వంటి నటులతో టైటిల్ రోల్ (బబ్రువాహనుడు) పోషించాడు. సారంగధర చిత్రంలో ఎన్. టి. ఆర్, భానుమతి, రంగారావు తో కలిసి నటించాడు.
చిత్ర సమాహారం
· శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం (1986)
· అల్లుల్లు వస్తున్నారు (1984)
· ప్రాణం ఖరీదు (1978)
· లంబాడోల్ల రాందాసు (1978)
· అన్నదమ్ముల సవాల్ (1978)
· అమ్మ మనసు (1974)
· బొమ్మా బొరుసా (1971)
· మట్టిలో మాణిక్యం (1971)
· మారిన మనిషి (1970)
· సంబరాల రాంబాబు (1970)
· సత్తెకాలపు సత్తెయ్య (1969)
· పూలరంగడు (1967)
· ప్రైవేటు మాస్టారు (1967)
· నవరాత్రి (1966)
· ఆత్మ గౌరవం (1965)
· ప్రేమించి చూడు (1965)
· బభ్రువాహన (1964)
· డాక్టర్ చక్రవర్తి (1964)
· పరువు ప్రతిష్ట (1963)
· సిరి సంపదలు (1962)
· తండ్రులు కొడుకులు (1961)
· వాగ్దానం (1961)
· పెళ్ళి మీద పెళ్ళి (1959)
· పెళ్ళి సందడి (1959)
· సారంగధర (1957)
· సంతానం (1955)
· వదినగారి గాజులు (1955)
· తోడుదొంగలు (1954)
· జాతక ఫలం (1954)
· దాసి (1952)
· నా చెల్లెలు (1952)
· మరి మరో ప్రముఖ హాస్య నటుడు ‘చలం’. ఈయన సైతం, అగ్ర హీరోల పక్కన కామెడీ పాత్రలు ప్రతిభావంతంగా పోషించి, అందమైన హాస్య నటుడుగా పేరుతెచ్చుకోవడం జరిగింది. (ఆంధ్రా దిలీప్‌కుమార్‌గా పేరుంది చలానికి) విజయవంతమైన చిత్రాలలో ఉత్తమ హాస్యనటుడిగా పేరుపొందిన చలం స్వంత చిత్ర నిర్మాణంలో చాలా చక్కని కుటుంబ కథా చిత్రాలతోబాటు, మంచి సందేశాత్మక చిత్రాలుకూడా నిర్మించడం, నిర్మాతగా ఆయనలోని అభిరుచిని తెలియచేస్తుంది.
ఒక పక్క హాస్యరసాన్ని పోషిస్తూనే, అదే పాత్రలో ఉద్వేగభరిత దృశ్యాలలో కూడా ప్రతిభావంతంగా నటించడం చలంలోని విశేషత! ఆయన నిర్మాణంలో వచ్చిన చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. అయితే, హాస్యనటుడిగా ఎంత ప్రసిద్ధుడయినా, ‘కథానాయకుడి’ తరగతిలోకి చేరిన నటుడు చలం అని చెప్పుకుంటే తప్పులేదు.
· సాంఘిక జానపద పౌరాణిక చిత్రాలలో నటించాడు నారద వేషం కూడా వేసిన గుర్తు .మట్టిలో మానిక్యంగా భానుమతి కి ఇష్టమైన వాడుగా అద్భుతంగా నటించాడు .జమునను ‘’అని ఆమె ను ‘’కోకమ్మా’’అని ఆరాధిస్తూ ఉపాధ్యాయ వృత్తికి గౌరవం కలిగించాడు బొమ్మా బొరుసు లో ఎస్వరలక్షమి అల్లుడుగా ,జట్కాబండి నడిపే వాడుగా పదునైన హాస్యం పండించాడు సవాల్‌పై సవాల్ విసిరి తనదే గెలుపు అనిపించుకొన్నాడు ‘’చల్ రే బేతా’’ చల్ ‘’పాటలో కిర్రెక్కించాడు .భలే రాముడు లో అక్కినేని తో పోటీ పది నటించాడు సీస్ ఆర్ చిన్నకోడుకుగా తమాషాలు చేశాడు .1959పెళ్లి సందడిలో మళ్ళీ సీస్ ఆర్ కొడుకుగా అందాలు ప్రేమ ఒలకబోసి రక్తి కట్టించాడు ‘’.బైటోబైటో పెళ్ళికోడకా ‘’పాటలో ఊపేశాడు .సారంగధర లో మంత్రి సుబుద్ధిగా మంచి నటన ప్రదర్శించాడు.మలుపులు తిరిగే జాతకఫలం సినిమాలో రంగారావు కొడుకుగా బాగా చేశాడు .సముద్రాల రచనా దర్శకత్వం చేసిన బభ్రువాహన లో రామారావు సరసన నటించాడు .పామర్తి వెంకటేశ్వరావు సంగీతం కూర్చాడు .సంబరాలరామ్బాబులో నటన,పాటలతో సంబరాలే చేశాడు .చిరకాలం గుర్తుండే పాటలున్నాయి ఇందులో .ఇలా వైవిధ్యపాత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యెక ముద్ర చూపిన అల్లరి నవ్వుల అమాయక హీరో గలగలమాటాడే చలం .
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-3-22-ఉయ్యూరు