మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-160
· 160-టిజి వెంకటేష్ కుమారుడు ఎ ఆర్ రహ్మాన్ మేనల్లుడు ‘’,ప్రేమ కదాచిత్రం ఫేం ‘’నటుడు ,సంగీత దర్శకుడు –జివి ప్రకాష్
· జి. వి. ప్రకాష్ భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు. ఎక్కువగా తమిళ సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు. 2010 సంవత్సరం మొదట్లో వెలుగులోకి వచ్చాడు.[1] తర్వాత ఇతను సినీ నిర్మాణం, నటనా రంగంలోకి ప్రవేశించాడు. ఇతను ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహ్మాన్ కు మేనల్లుడు. ఇతని భార్య సైంధవి గాయని. ముందుగా రెహమాన్ దగ్గర పలుచిత్రాలకు సంగీత విభాగంలో పనిచేశాడు. కొద్ది రోజులు హ్యారిస్ జయరాజ్ దగ్గర కూడా శిష్యరికం చేసి తరువాత సొంతంగా సంగీత దర్శకత్వం వహించడం ప్రారంభించాడు.
వ్యక్తిగత జీవితం
ప్రకాష్ తల్లి దండ్రులు జి. వెంకటేష్, ఏ. ఆర్. రిహానా. తల్లి ఏ. ఆర్. రెహ్మాన్ కు అక్క.[2] తల్లి రెహనాకు సంగీతం అంటే ఆసక్తి ఉండటంతో ప్రకాష్ ను నాలుగు సంవత్సరాల వయసు నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి పంపించేది. ఆరేళ్ళకి పియానో క్లాసులో చేరాడు. అదే సమయంలో మేనమామ రెహమాన్ ప్రకాష్ కు పాటలు నేర్పించి సినిమాల్లో పాడించాడు. ప్రకాష్ ఏడో తరగతిలో ఉండగా తల్లిదండ్రులు విడిపోయారు. పిల్లలు తండ్రి దగ్గరే ఉండిపోయారు. తల్లి మాత్రం ఒంటరిగా ఉంటూ గాయనిగా తన కెరీర్ ప్రారంభించింది.[3]
జూన్ 27, 2013 న ప్రకాష్ గాయని సైంధవిని చెన్నై లోని మేయర్ రామనాథన్ చెట్టియార్ హాల్ వేదికపై వివాహం చేసుకున్నాడు. సైంధవి, ప్రకాష్ చెట్టినాడ్ విద్యాశ్రమంలో కలిసి చదువుకున్నారు.[4]
కెరీర్
సంగీత రంగం
ప్రకాష్ మొదటి సారిగా తన మేనమామ ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన శంకర్ సినిమా జెంటిల్మేన్ కి సౌండ్ ట్రాక్ విభాగంలో పనిచేశాడు. ఇంకా రెహమాన్ ఇతర ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు.[5] తర్వాత కొద్ది రోజులు హ్యారిస్ జయరాజ్ తో కలిసి పనిచేశాడు. అన్నియన్ (తెలుగులో అపరిచితుడు), ఉన్నాళే ఉన్నాళే అనే రెండు సినిమాల్లో పాటలు పాడాడు.
ప్రకాష్ మొదటిసారిగా ఎస్. శంకర్ నిర్మాణ సారథ్యంలో, వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన వేయిల్ అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. తరువాత ఎ. ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన మదరాస పట్టణం అనే సినిమాకు ఇతను కూర్చిన సంగీతం కూడా ఆకట్టుకున్నది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన మయాక్కం ఎన్న అనే సినిమా ధనుష్ హీరోగా ప్రకాష్ కి మూడో సినిమా. ఈ సినిమా సంగీతం కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది.
సినీ నిర్మాణ ౦ ]
ప్రకాష్ 2013 లో జి. వి. ప్రకాష్ కుమార్ ప్రొడక్షన్స్ పేరుతో స్వంతంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ మొట్టమొదటి సినిమా, బాలు మహేంద్ర దగ్గర సహాయకుడుగా పనిచేసిన విక్రం సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన మాదా యానై కూట్టం.[6][7]
నటుడిగా
2012 లో దర్శకుడు మురుగదాస్ ఇతన్ని చూసి తన సినిమాలో నటించమని అడిగాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. తరువాత ప్రకాష్ మూడు సినిమాల్లో నటించడానికి అంగీకరించాడు. ఆడుకాలం నరేన్ దగ్గర నటనలో శిక్షణ పొందాడు.[8] తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రమ్ సినిమాకు రీమేక్ అయిన డార్లింగ్ సినిమాలో నటించాడు.
తెలుగులో అనువాదమై ఆయన సినిమాలు
· ఒరేయ్ బామ్మర్థి
· బ్యాచిలర్
పురస్కారాలు
· 2010: సంవత్సరపు ఉత్తమ గీతం పూకల్ పూక్కం తరుణం (మదరాస పట్టణం సినిమా)
· 2011: ఆడుకాలం తమిళ సినిమాకు ఫిల్మ్ ఫేర్ దక్షిణాది ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-3-22-ఉయ్యూరు