మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-162
· 162-ఊరుమ్మడి బతుకులు సినీ ఫేం –సత్యేంద్ర కుమార్
· సత్యేంద్రకుమార్ తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడిని ఎం.బాలయ్య అన్నాతమ్ముల కథ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం చేశాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
క్ర.సం | సినిమా పేరు | విడుదల సంవత్సరం | దర్శకుడు | సహ నటులు |
1 | అన్నాతమ్ముల కథ | 1975 | డి.ఎస్.ప్రకాశరావు | ఎం.బాలయ్య,చంద్రమోహన్, ప్రభ, రోజారమణి |
2 | మొనగాడు | 1976 | టి. కృష్ణ | శోభన్ బాబు,రాజబాబు, ప్రభ, మంజుల, రోజారమణి |
3 | ఈనాటి బంధం ఏనాటిదో | 1977 | కె.ఎస్.ఆర్.దాస్ | కృష్ణ,ఎం.బాలయ్య, జయప్రద, ఫటాఫట్ జయలక్ష్మి |
4 | ఊరుమ్మడి బ్రతుకులు | 1977 | బి.ఎస్.నారాయణ | రాళ్లపల్లి, మాధవి |
5 | చలిచీమలు | 1978 | దేవదాస్ కనకాల | రాళ్లపల్లి, నూతన్ ప్రసాద్, ఎస్.పి.శైలజ |
6 | ప్రేమ పగ | 1978 | బి.వి.ప్రసాద్ | మురళీమోహన్, లత, సత్యనారాయణ |
7 | తుఫాన్ మెయిల్ | 1978 | కె.ఎస్.రెడ్డి | నరసింహ రాజు, గిరిబాబు, మంజుల, విజయ్ కుమార్ |
8 | చిలిపి కృష్ణుడు | 1978 | బోయిన సుబ్బారావు | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, గుమ్మడి, రావు గోపాలరావు |
9 | కాలాంతకులు | 1978 | కె.విశ్వనాథ్ | శోభన్ బాబు, జయసుధ, కాంచన, కాంతారావు |
10 | ఛాయ | 1979 | హనుమాన్ ప్రసాద్ | నూతన్ ప్రసాద్, రూప, అన్నపూర్ణ, పి.ఎల్.నారాయణ |
11 | కలియుగ మహాభారతం | 1979 | హనుమాన్ ప్రసాద్ | మాదాల రంగారావు, నరసింహ రాజు, వంకాయల, మాధవి |
· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-163
· 163-‘’మా ‘’వ్యవస్థాపక సభ్యుడు ,సినీకార్మిక సంఘ కోశాధికారి ,372సినిమాల హాస్యనటుడు –సారధి
· సారథి ప్రముఖ హస్యనటుడు. ఇతని పూర్తి పేరు కడలి జయసారథి.
జననం
ఇతడు పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండలో వీరదాసు, మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు.
రంగస్థల ప్రస్థానం
1945లో తొలిసారి మొదటిసారి శకుంతల నాటకంలో భరతుడిగా నటించాడు. ఆ తరువాత సుమారు 50 సంవత్సరాలు నాటకరంగానికి సేవచేశాడు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించాడు.
సినిమారంగ ప్రస్థానం
ఇతడు 1960లో సీతారామ కళ్యాణంతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ చిత్రంలో నలకూబరునిగా నటించాడు. అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇతడు దాదాపు 372 తెలుగు సినిమాలలో నటించాడు. తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నాడు[1].
కుటుంబం
ఇతనికి అనూరాధతో వివాహం జరిగింది. వీరికి ఉదయ్‌కిరణ్, ప్రశాంత్ అనే ఇద్దరు కుమారులున్నారు.
సినిమా రంగం
నందమూరి తారకరామారావు దర్శకత్వంలో వెలువడిన సీతారామ కళ్యాణం సినిమాలో నలకూబరునిగా తొలిసారి చలనచిత్రంలో నటించాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
1. సీతారామ కళ్యాణం (1961) – నలకూబరుడు
2. పరమానందయ్య శిష్యుల కథ (1966) – శిష్యుడు
3. ఈ కాలపు పిల్లలు (1976)
4. భక్త కన్నప్ప (1976)
5. అత్తవారిల్లు (1977)
6. అమరదీపం (1977)
7. ఇంద్రధనుస్సు (1978)
9. జగన్మోహిని (1978)
10. మన ఊరి పాండవులు (1978)
11. సొమ్మొకడిది సోకొకడిది (1978)
12. కోతల రాయుడు (1979)
13. గంధర్వ కన్య (1979)
14. దశ తిరిగింది (1979)
15. అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980)
16. నాయకుడు – వినాయకుడు (1980)
17. మదన మంజరి (1980)
18. మామా అల్లుళ్ళ సవాల్ (1980)
19. బాబులుగాడి దెబ్బ (1984)
20. మెరుపు దాడి (1984) – అంజి
21. ఆస్తులు అంతస్తులు (1988)
22. మామా కోడలు
సారధి తాత గారు కడలి వీరయ్య గారు ఆంధ్రదేశం లో ప్రఖ్యాత హరి కధకులు .కొంచెం పొట్ట ఉండేది బొద్దుగా ఉండేవారు కానీ వేదికపైకి వస్తే హరికధ చెప్పటం లో వీరంగమే వేసేవారు శ్రావ్యమైన స్వరం .బహుశా హరికధలు స్వయంగా రాసేవారని గుర్తు .మా ఉయ్యూరు లో ధనుర్మాసంలో సుమారు 40ఏళ్ళక్రితం వీరయ్యగారు వచ్చి కధాగానం చేయటం నేను స్వయంగా చూశాను గొప్ప అనుభవం అది .అలాంటి ఆయన మనవడు సారధి హాస్యాన్ని ఎంచుకొని ,రామారావు తీసిన సీతారామకల్యాణం లో మొదటి సారిగా నలకూబరుడుగా నటించి మెప్పించాడు .సినిమాలు తగ్గాయో లేక ఆయనే దూరంగా ఉన్నదో తెలీదు కానీ ఆయన ఎక్కడున్నాడో అని ఈ టివి వారు తమ ‘’అన్వేషణ’’ప్రోగ్రాం లో ఆయన్ను భీమవరం లో వెతికి ఆయనను పట్టుకొని చక్కని ఇంటర్వ్యు చేశారు .అందులో తన నటజీవితాన్ని సారధి చక్కగా ఆవిష్కరించాడు ఇప్పుడే ఆ ఇంటర్వ్యు చూసి వివరాలు రాశాను .
భక్తకన్నప్ప లో పూజారిగా నటించినట్లు గుర్తు .మరీ వెకిలి తనం లేని హాస్యం పండించాడు సారధి .తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకొన్నాడు .ఇంతకంటే వివరాలు దొరకలేదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-3-22-ఉయ్యూరు