మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-166

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-166

·         166-పెళ్లి సందడి నిర్మాత ,బొబ్బిలియుద్ధం లో  వెంగళ రాయుడు  ,నిర్మాత ,దర్శకుడు ‘’అందాల రాణివే, నీవెంత జాణవే’’పాటఫేం –సి.సీతారాం

·         సమర్ధులైన దర్శకులు కఠినంగా చెబుతూ ఉంటే, బాగా నటించి రాణించగలవారిలో పద్మనాభాన్ని సీతారాంను, రామకోటిని చెప్పుకోవాలి.

·         సీతారాంకు కొంతకాలంగా హాస్య పాత్రలు లభించటమేలేదు. అతను వేశాడు కాబట్టి హాస్యం ఉందనుకోవలసి వస్తోంది. నిజానికి ఈ దుస్థితి, ఇటీవల దాదాపు అందరు హాస్య నటులకూ పట్టింది. 

·         హుషారుగా కబుర్లుచెబుతూ కుర్రకారు ప్రేమయణంమీద మూడు మైళ్లు షికారు తీసుకెళ్ళే “పెళ్లిసందడి” (రిపబ్లిక్‌ (ప్రొడక్షన్స్‌) ఆంధ్రలో1959 ఏప్రిల్‌ రెండునుండి సందడి చేస్తోంది. ఇందులోని పాత్రలలో చిన్నవాళ్లూ, పెద్దవాళ్లూ, వాళ్లలా నటించిన నటులలో పెద్దవాళ్లూ, చిన్నవాళ్లూ, దర్శక నిర్మాతలూ. రచయితా యావన్మందీ కూడా ఈసారి బేఖాతరీగా విహరించి హాస్యంచేసి రంజింపచేయడానికి వడికట్టి, దాదాపు అంతపనీ చేశారు. ఎటొచ్చి కొందరు ఆ పని చెప్పకుండా చేసి నవ్వించగలిగారు; మిగతా వారంతా కాసుకోమని వార్నింగు ఇచ్చారు. ఇస్తే ఇచ్చారుగాని మొత్తంమీద వాళ్లూ బాగానే నవ్వించగలిగారు. అందరికన్న ఎక్కువ నవ్వించగలినది మాటలు. సినీ అసందర్భాలన్నీ సమిష్టిగా ఒకచోట సందర్భపడ్డ ఈ చిత్రంలో గుర్నాధం అనే చిన్నవాడు తన పెళ్లిచూపులకు తన స్నేహితుని పంపి “ప్రాక్సీ? ఇచ్చి రమ్మనడం ముఖ్య విషయం. సముద్రాల జూనియర్‌కు సంభవించిన అసంభవమనిపించే ఈ తొలి ఊహ చుట్టూ మరికొన్ని అసంభవాలను, అపోహలను పేర్చి ఆయనా, దర్శకుడు యోగానంద్‌, నిర్మాత సీతారాం వాటికి తగ్గ మూటలు కూర్చి కథను కట్టారు. అసందర్భ ప్పిల్లడు గుర్నాధం వాలకాస్పీ అంతకో రీలు క్రితం బ్రహ్మాండమైన ఆస్తీ వేపకాయంత వెర్రి ఉన్న గుమ్మడినీ, అతని అన్నదమ్ముడు     

·           రమణారెడ్డినీ వాళ్ళ అపోహాపోహల తీరుతెన్నులనూ చూసేసరికి, మనకీ ఈ కధలో సాధ్యాసాధ్యాల గురించిన బెంగలు పోతాయి. డాన్సులూ రొమాన్సులూ అంటే ప్రాణం పెట్టే గుర్నాధం, ఒక దాన్సరుతో పెట్టుకున్న ఎంగేజిమెంటువల్ల తీరుబడిలేక గిలగిల్లాడుతూ ఉంటాడు. ఆ వేళకి అతని తండ్రి గంగాధరంగారు పొరుగూళ్ళో పెళ్లిసంబంధం చూసి పిల్లణ్ణి వెళ్ళి చూసి రమ్మంటాడు. అపుడు గుర్నాధం తన జర్నలిస్టు మిత్రుడు వాసును తన బదులు హాజరుకమ్మని పంపుతాడు. ఇలా “ప్రాక్సీ వెళ్లి మిత్రుడి తరపున గైరుహాజరినామా పలకబోయినందుకు వాసుకుపడ్డ జరిమానా (ప్రేమ కధలో జారిపడడం, అక్కడున్న ఇద్దరమ్మాయిలలోను పెద్ద చిన్నదాన్ని చూసి సరదాపడి డూయెట్‌ అందుకుంటాడు వాసు. ఆ పిల్ల రెండో చరణం అందుకోవడంతో ఒక జంట స్వయంవరణం పూర్తి అవుతుంది, అందువల్ల వాసు ఆ యింట్లో చిక్కడిపోతాడు. ఇటు, _వాసువచ్చేదాకా _ఇంటికెళ్ళకుండా అజ్ఞాతవాసంలో ఉండబోయిన గుర్నాధం, అక్కడ అలా ఉండలేక, ధైర్యంగా ఇవతల పడలేక అవస్థపడుతూ ఉంటాడు. అనూరాధగా అంజలీదేవి, నకిలీ పెళ్లీకొడుకు వాసుగా నాగేశ్వరరావూ కనిపించడంతో, అసలు పెళ్లికొడుకు గుర్నాధానికి (చలం), రెండో చిన్నది ప్రియంవద (సరోజాదేవి) మటుకే దక్కుతుందని మనం ముందే పసిగట్టినా, కథ ఈ చిక్కులు విప్పుకొని అడంగి చేరేవరకు, చూచి ఆనందించతగ్గ హాస్య సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. జర్నలిస్టుగా అభినయించిన స్థూలలబాల సరస్వతి, రమణారెడ్డి వివాహమాడుట వగైరాలు. ఈలోగా అనూరాధ జన్మవృత్తాంతం బయటపడడం కాస్తంత డ్రామా, మెలోడ్రామా, ఆ పైన ఆమె – కష్టదశలో పడే సినీ హీరోయిన్‌లందరూ తొక్కినదారిలోనే బయల్దేరి వూరూవాడా వదలి ఫోటోజెనిక్‌ అడవులలో తిరగడం, త్రాగుబోతులు ఆమెను చుట్టుముట్టడం, కొట్లాటలూ ఈలోగా హీరో వాసు కథ బయటపడడం వగైరా ఘట్టాలమీదుగా కథ జనరంజకంగా గమ్యస్థానం చేరుకొంటుంది, వెరసి మొత్తం నాలుగు పెళిళ్లూ ఫెళ్ళున జరుగుతాయి. నటీనటులందరూ ఎంత కథోచితంగా నటించినా మొత్తం మీద హాస్య నటన స్థాయి గర్వకారణంగా లేదు. చిన్న నటులంతా తమ పాత్రలను సమర్థంగా నిర్వహించారు గాని ముఖ్యపాత్రధారుల హాస్యనటన, హాస్యనటనకు ఉండతగ్గ అవధులను దాటిపోయింది. ఇది హాస్యము సుమీ అన్న తరహాలో హాలివుడ్‌ కమీడియన్‌లు కూడా ఈ మధ్యనే వదిలివేసిన హావభావాలతో మొదలై ముందుకు సాగి, హాస్య నటనమీద దర్శకునకు నటులకు గల చిన్నచూపును విశదంచేసింది. సి. ఎన్‌. ఆర్‌, రమణారెడ్డి, తొలిసారి హాస్యపాత్ర ధరించిన గుమ్మడి చెప్పుకోతగ్గ నటన ప్రదర్శించారు. హాస్యంపట్ల (ప్రేక్షకుల పట్ల దర్శకులకు మరికొంచెం గురి, గౌరవం ఉంటే, నాగేశ్వరరావు, చలం, బాలసరస్వతి బాగా రాణించేవారని, గుమ్మడి హాస్యనటనలో తన అజ్ఞాత ప్రజ్ఞను మరింత ప్రస్ఫుటంగా చూపగలిగే వాడనీ    

·         అనిపిస్తుంది. ఉన్నవారిలో అంజలీదేవి ధరించిన అనూరాధ అందంగా ఆహ్లాదకరంగా ఉంది. సరోజూదేవిని భరించిన ప్రియంవద గురించి చెప్పుకొనకపోవడం మంచిది. హాస్వేతరనటుడు అయినా తాగుబోతుగా ఆర్‌. నాగేశ్వరరావు ఒకడూ బాగా గుర్తుంటాడు. సంగీత దర్శకుడు ఘంటసాల చాలమంచి పాటలు వినిపించారు. నిండుగా ఉత్సాహవంతంగా ఉన్నాయి. జాగీర్టార్‌ ఛాయాగ్రహణం విశేషించి (ప్రశంసించవలసిన అంశాలలో ఒకటి. సరదాగా “చాలా సేపు కాలక్షేపం చెయ్యడానికి సకుటుంబంగా వెళ్లి చూడదగిన చిత్రం. ఈ సినిమా బాగా అడింది

·          

·           . నిర్మాత సీతారాం తరువాతి ప్రయత్నంగా “బొబ్బిలియుద్ధం” అనే చారిత్రాత్మక చిత్రం తీసి తనే దర్శకత్వం వహించారు. జమునకు జోడీగా ముఖ్యపాత్ర ధరించారు.   

·         బొబ్బిలి యుద్ధం సినిమాను సి. సీతారామ్ నిర్మించి దర్శకత్వం వహించారు. ఎన్.టి.ఆర్, ఎస్వీఆర్, భానుమతి, రాజనాల, ఎమ్.ఆర్.రాధా, జమున మొదలైన తారాగణంతో భారీగా నిర్మితమైనది. శ్రీకర కరుణాలవాల, మురిపించే అందాలే వంటి హిట్ గీతాలున్నాయి. శ్రీశ్రీ పాటలు, ఎస్.రాజేశ్వరరావు సంగీతం సినిమా విలువను పెంచాయి

రెండు ప్రధాన రాజవంశాలు, బొబ్బిలి, విజయనగరం ఇరుగుపొరుగు సంస్థానాలు. విజయనగర ప్రభువు విజయరామరాజు (రాజనాల) భార్య చంద్రాయమ్మ (జయంతి) కుమారునితో కలిసి బొబ్బిలిరాజు (రంగారావు నాయుడు (ఎన్.టి.ఆర్) రాణిమల్లమాంబ (భానుమతి)ల కుమారుడు వెంకటరాయల పుట్టినరోజు వేడుకలకు బొబ్బిలి వస్తాడు. ఆనాడు జరిగిన కుస్తీ పోటీల్లో, కోడిపందేల్లో, బలప్రదర్శనలో విజయనగరం వారిపై, బొబ్బిలివారు సాధించిన విజయాలకు, అసూయపడతాడు. రామరాజు వారినేవిధంగానైనా అణగద్రొక్కాలని సమయంకోసం ఎదురుచూస్తుంటాడు. రాజాం ప్రభువు తాండ్రపాపారాయుడు (యస్.వి.రంగారావు) బొబ్బిలికి అండ. అతని చెల్లెలు సుభద్ర(జమున)కు, రంగారావు నాయుడు, తమ్ముడు వెంగళరాయుడు (సీతారాం)కు వివాహం నిశ్చయిస్తారు. ఈలోపు ఫ్రెంచి గవర్నరు తరఫున బుస్సీ (ముక్కామల) కప్పాలు కట్టవలసినదిగా తాఖీదులు పంపుతాడు. తామెవరికి సామంతులు కామని, కప్పాలు కట్టమని బొబ్బిలిరాజులు తిరస్కరిస్తారు. ఈ అవకాశం తీసికొని విజయరామరాజు, బుస్సీ అనుచరుడు హైదర్‌జంగ్ (ఎం.ఆర్.రాధ) సహాయంతో బుస్సీకీ బొబ్బిలిపై చాడీలుచెప్పి, ఆ కోటను జయించి తనకిస్తే మొత్తం పరగణాల మాన్యంతానే చెల్లిస్తానంటాడు. వెంగళరాయుడు పెళ్ళి జరిగిన వెంటనే, బుస్సీ బొబ్బిలిపై దాడికి సిద్ధపడతాడు. రాజాం వైపునుంచి వచ్చే సైన్యాన్ని అటకాయిస్తానని అక్కడ విడిదిచేస్తాడు తాండ్ర పాపారాయుడు. కాని అడవి మార్గం గుండా బొబ్బిలిని ఆక్రమిస్తారు బుస్సీ సైనికులు. యుద్ధంలో బొబ్బిలి వీరులెందరో రంగారావునాయుడుతో సహా వీరమరణం పొందుతారు. తాండ్ర పాపారాయుడు బొబ్బిలి వచ్చి, విజయరామరాజును బాకుతో గుండెల్లో పొడిచి, చంపి, తానూ, ఆత్మత్యాగం చేసుకుంటాడు. ఇరు రాజ్యాల కుమారులు స్నేహంగా సాగుతుండగా కథ ముగుస్తుంది. చివరలో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించటం. ఆ స్వాతంత్య్ర వేడుకలు చూపటంతో చిత్రం పూర్తవుతుంది.

ఇంకా ఈ చిత్రంలో నరసారాయుడుగా ధూళిపాళ, అడిదం సూరకవిగా, కె.వి.యస్.శర్మ, దుబాసీ లక్ష్మయ్యగా సి.యస్.ఆర్, మొరాసిందొరగా (ప్రభాకర్‌రెడ్డి) హర్కొరులుగా (రాజ్‌బాబు, డా.శివరామకృష్ణయ్య) వరహాలుగా పద్మనాభం, వెంకటలక్ష్మిగా బాలసరస్వతి, చారులుగా బాలకృష్ణ, గీతాంజలి, మల్లయోధునిగా నెల్లూరు కాంతారావు నటించారు. తగిర్చి హనుమంతురావు నిర్మాతగా, దొప్పలపూడి వీరయ్యచౌదరి దర్శకుడిగా ఈ చిత్రం టైటిల్స్ లో కనబడుతుంది. వీరు ఇద్దరూ కంకటపాలెం వాస్తవ్యులు . పెళ్ళిసందడి’, ‘రక్తసింధూరం’ చిత్రాలు నిర్మించిన రిపబ్లిక్ ప్రొడక్షన్స్‌వారు నిర్మించిన చారిత్రాత్మక చిత్రం ‘‘బొబ్బిలియుద్ధం’’. 1964లో విడుదలయింది. ఈ చిత్రానికి మాటలు- గబ్బిట వెంకట్రావు, పర్యవేక్షణ సముద్రాల సీనియర్, నృత్యం- వెంపటి సత్యం, పసుమర్తి వేణుగోపాల్, ఫొటోగ్రఫీ- కమల్‌ఘోష్, కూర్పు- కందస్వామి, సంగీతం- యస్.రాజేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత- సీతారాం. పాటలు- శ్రీశ్రీ, సి.నా.రె, కొసరాజు, ఆరుద్ర, సముద్రాల జూ., గబ్బిట వెంకటరావు.
‘బొబ్బిలియుద్ధం’ చిత్రంలో నటీనటులందరూ అఖండులు కావటంతో, ఎంతో సమర్ధవంతంగా పరిపూర్ణంగా నటించి, తమ పాత్రలకు న్యాయం చేశారు. వెంగళరాయుడుగా ఉద్రిక్తతను, ఆవేశాన్ని, పరాక్రమాన్ని సమపాళ్ళలో సీతారాం, తమ్ముని ఆవేశాన్ని అడ్డుకట్టవేసే సోదరునిగా, ప్రజాసంక్షేమంకోరే ప్రభువుగా, పరాక్రమవంతునిగా సామ, దాన, ధీర గంభీరంగా ఎన్.టి.ఆర్. ఆయా సన్నివేశాలకు వన్నెతెచ్చారు. తాండ్ర పాపారాయునిగా, యస్.వి.ఆర్. మల్లయుద్ధంలోనూ, విజయరామరాజును సంహరించే సమయంలో, ‘నీ పేరాశకిదే నా బహుమతి, ఒక్కొక్క ప్రాణానికి ఒక్కొక్కపోటు’ అంటూ అతని గుండెలపై కూర్చొని బాకుతో పొడుస్తూ చెప్పే డైలాగులు, తన్నుతాను పొడుచుకున్నాక ‘‘మాతృభూమికోసం, ఈనాడు వీరులు కార్చిన రక్తబిందువులు ఏనాటికైనా విదేశీపాలన అంతానికి కారణం కాకపోవు’’ దర్శకునిగా సీతారాంకు, రచయితగా గబ్బిటవారికి నటునిగా ఎస్.వి.రంగారావును అభినందించాల్సిందే. మరో పాత్ర ధర్మరాయుడుగా (బాలయ్య) సంధికోసం బుస్సీవద్దకు వెళ్ళిన సన్నివేశం, వీరోచితంగా సంభాషణలు పల్కటంలో, సైన్యాన్ని ఎదిరించి, తిరిగివచ్చి వెంగళరాయునిచే ఎగతాళికి, దాంతో ఆవేశానికి గురైన పాత్రను నటనలో బాలయ్య ఎంతో సంయమనాన్ని, వీరాన్ని ప్రదర్శించటం, గుర్తుండిపోయేలా చిత్రీకరణ మరో విశేషం.
ఇక ఈ చిత్ర గీతాలు పెళ్ళికి సిద్ధంచేసిన వంటకాలు, రుచితో ఊహల్లోకి వెళ్ళిన రంగారావునాయుడు తమ తొలి రేయిని స్మరిస్తూ చిత్రీకరించబడిన గీతం, ఎన్.టి.ఆర్, భానుమతిల అభినయంతో మనసును ఊయల లూగిస్తుంది. ‘‘ఊయల లూగినదోయి మనసే తీయని ఊహల తీవెలపైనా’’ (భానుమతి- సి.నా.రె) జమున, చెలికత్తెలపై చిత్రీకరించబడిన గీతం ‘‘ముత్యాల చెమ్మచెక్కా, రతనాలా చెమ్మచెక్క’’ సాంప్రదాయపు ఆటతో, పొడుపుకథలతో రమ్యంగా సాగింది. (పి.సుశీల బృందం- ఆరుద్ర) భానుమతిపై చిత్రీకరించిన భక్తిగీతం- ‘‘శ్రీకరకరుణాలవాల వేణుగోపాలా’’ (భానుమతి- సముద్రాల జూ.) గీతాంజలిపై చిత్రీకరించిన నృత్య గీతం ‘‘ఏమయా రామయా ఇలా రావయా’’ (స్వర్ణలత- బి.వసంత. వి.సత్యారావు- రచన కొసరాజు) యల్.విజయలక్ష్మిపై చిత్రీకరించిన జావళి ‘‘నినుచేర మనసాయెలా’’ (పి.సుశీల- శ్రీశ్రీ) రాజనాలపై చిత్రీకరించిన పద్యం ‘‘పర వీర రాజన్య భయద ప్రతాపుడు ఆరంగరాయ’’ (మాధవపెద్ది- గబ్బిట) బుస్సీ, హైదరుజంగులన్ (మాధవపెద్ది- గబ్బిట) యస్.వి.ఆర్.పై ‘‘చెల్లిలా నీ అన్న జీవించి యుండగా (మాధవపెద్ది- ఆరుద్ర) కె.వి.యస్.శర్మపై పద్యం ‘‘రాజు కళింకమూర్తి రతిరాజు శరీర విహీనుడు’’ (మాధవపెద్ది- అడిదం సూరకవి) అందాల నటి జమునతో జంటగా సీతారాం నటించిన ఈ చిత్రంలో వారిపై చిత్రీకరించిన గీతాలు, ఎంతో ముచ్చటగా, పరవళ్ళుత్రొక్కే సంగీతంతో కూడిన గీతం ‘‘అందాల రాణివే, నీవెంత జాణవే’’(పి.సుశీల, ఘంటసాల) వారిద్దరిపై చిత్రీకరించిన తొలిరేయి గీతం ‘‘సొగసుకీల్జెడదానా’’ వజ్రాల వంటి పలువరుస దానా అని వర్ణన జమునకు సరిపోయేలా సాకీ వ్రాయటం పాట ‘‘మురిపించే అందాలే అవి ననే్న చెందాలే’ (ఘంటసాల, పి.సుశీల) ఈ రెండూ గీతాలు శ్రీశ్రీ వ్రాయటం ముదావహం. చిత్ర ప్రారంభంలో గోపాలకుడు నాగయ్యపై చిత్రీకరించిన గీతం ‘‘సిరినేలు రాయుడా, శ్రీమన్నారాయణ’’ (ఆరుద్ర రచన ఈ గీతాన్ని చిత్ర సంగీత దర్శకులు యస్.రాజేశ్వరరావు, నాగయ్యకు ప్లేబాక్ పాడడం ఎన్న దగినది). చిత్ర సంగీత, సాహిత్యాలు ఈనాటికీ శ్రోతలను అలరిస్తూనే వున్నాయి.

అందాల రాణివే, నీవెంత జాణవే కవ్వించి సిగ్గుచెంద నీకు న్యాయమా
ఏమయ్య రామయ్యా ఇలా రావయ్యా

·         మురిపించే అందాలే అవి నన్నే చెందాలె నాదానవు నీవేలే నీవాడను నేనేలే
మురిపించే అందాలే అవి నన్నే చెందాలె నాదానవు నీవేలే నీవాడను నేనేలే

·           సశేషం

·         మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-3-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.