• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-169
• 169-సహాయ సంగీత దర్శకురాలు ,రచయిత చలం తమ్ముడికూతురు –‘’తీయని వెన్నెల రేయి ,కాదుసుమా కలకాదుసుమా ‘’పాటల ఫేం –వక్కలంక సరళ
• క్కలంక సరళ (1927 – 1999) [1] తెలుగు సినిమా గాయని. కీలుగుర్రం సినిమాలోని ‘కాదు సుమా కల కాదు సుమా’ పాట పాడిన గాయనిగా ప్రసిద్ధి చెందింది. 1940వ దశకంలో జెమినీ స్టూడియో హిందీ విభాగంలో సహాయ సంగీత దర్శకురాలిగా పనిచేసింది.[2] ఈమె పూర్వీకులు అమలాపురానికి చెందిన బ్రాహ్మణులు, అయితే మద్రాసులో స్థిరపడ్డారు. సరళ తండ్రి గోపాలరావు, చలం (గుడిపాటి వెంకటాచలం) తమ్ముడు[3] సరళ 1927, ఆగష్టు 8 న మద్రాసులో సుందరమ్మ, గోపాలరావు దంపతులకు జన్మించింది. ఈమె తల్లి సుందరమ్మ కూడా గాత్ర సంగీత కళాకారిణే.
• ఆమెకు అలనాటి సినీనటి అంజలీదేవికి మంచి స్నేహితురాలు. అంజలీదేవి మొదటిసినిమా బాలరాజులో ‘ఇది తీయని వెన్నెల రేయి’ పాటను సరళ పాడింది. అప్పటి నుంచీ వారు స్నేహితులయ్యారు. 1950ల్లో అంజలీదేవి ‘స్వప్నసుందరి’ తీసిన తర్వాత నాకు గనుక కూతురు పుడితే కచ్చితగా ఇదే పేరు పెడతానని సరళ అంజలీదేవికి మాటిచ్చింది. అలా మాటిచ్చిన పదేళ్లకు పుట్టిన బిడ్డకు మాట ప్రకారం స్వప్నసుందరి అని పేరుపెట్టింది.[4] ఈమే కూచిపూడి నాట్యకళాకారిణి, పద్మభూషణ గ్రహీత స్వప్నసుందరి.
• ఘంటసాలతో కలిసి సరళ, కాదు సుమా కల కాదు సుమా’ పాటతో సహా అనేక పాటలు పాడింది. ఈమెకు ఘంటసాలతో పెళ్ళికుదరబోయి, అనుకోని పరిస్థితుల్లో, ఘంటసాలకు మరో రంగూన్ ‘సరళ’తో ద్వితీయ వివాహం జరగింది.[5]
• సరళ వివాహం అయ్యాక సినిమా రంగం నుంచి వైదొలగింది. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో పెళ్లవగానే సినిమాల్ని వదిలేసేవాళ్లు. ఈమెకు స్వప్నసుందరితో పాటు మరో కూతురు, ఒక కొడుకు పుట్టారు. 1979లో విడుదలైన గోరింటాకు సినిమాలో నటించిన వక్కలంక పద్మ కూడా సరళ కూతురే.[6]
• సరళ కూతురు స్వప్నసుందరి ప్రతి సంవత్సరం తల్లి జ్ఞాపకార్ధం, ఆగష్టు 8న స్వరలహరి అనే కర్ణాటక సంగీత కచ్చేరిని నిర్వహిస్తుంది. ఈ కచ్చేరీలో యువ గాయనీగాయకులు సరళ స్వరపరచిన పాటలను ప్రముఖంగా పాడతారు.[1][7]
• ఈమె ఆలపించిన తెలుగు సినిమా గీతాల జాబితా
విడుదల సం. సినిమా పేరు పాట ఇతర గాయకులు సంగీత దర్శకుడు రచయిత
1948 బాలరాజు
తీయనివెన్నెల రేయి ఎడబాయని వెన్నెల హాయీ ఘంటసాల
సముద్రాల సీనియర్
1949 కీలుగుర్రం
అహా ఓహో ఎంతానందంబాయెనహా ఊహాతీతముగా ఘంటసాల తాపీ
1949 కీలుగుర్రం కాదుసుమా కలకాదుసుమా అమృతపానమును ఘంటసాల ఘంటసాల తాపీ
1949 రక్షరేఖ
బిడియమా మనలో ప్రియతమా సఖా బిగువ చాలు నాతో ఓగిరాల రామచంద్రరావు బలిజేపల్లి
1949 లైలా మజ్ను
అనగనగా ఓ ఖాను ఆ ఖానుకో జనానా భానుమతి సి.ఆర్.సుబ్బరామన్
సముద్రాల సీనియర్
1952 సింగారి
శుద్ధం చెయ్యండోయ్ తొలంచి శుద్ధం చెయ్యండోయ్ తంగవేలు బృందం ఎస్.వి.వెంకట్రామన్,
టి.కె.రామనాథన్
టి.ఎ.కళ్యాణం
1952 మరదలు పెళ్ళి
పిలిచే గోదావరోడ్డు నూరూరించే బందరు లడ్డు చిత్తూరు నాగయ్య,
టంగుటూరి సూర్యకుమారి
శ్రీశ్రీ
1953 అమరకవి
జి.రామనాధన్,
టి.కె.కుమారస్వామి
•
•
సారంగదేవ్ సరళగురించి రాసిన విశేషాలు
• మన మధుర గాయకులు – వక్కలంక సరళ
• అలనాటి మధుర గాయకుల మీద తెలుగు స్వతంత్ర వార పత్రికలో ప్రచురితమైన వ్యాసాలను (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో) వెలికితీసి కొన్ని పాటలు జోడించి ఈ శీర్షిక ద్వారా 15 మంది గాయనీ గాయకుల వివరాలు వెలుగులోకి తేవటం జరిగింది. ఈ వ్యాసాలు వ్రాసిన “సారంగదేవ” రజని గారని శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు వ్రాసిన ఒక వ్యాసంలో చదవటం జరిగింది. ఈ మధుర గాయకులు అందరూ ఆకాశవాణి వారికి పాడటం జరిగింది. సినిమా పాటలు మినహాయిస్తే ఈ వ్యాసాల్లో పేర్కొన్న చాలా రేడియో కార్యక్రమాలు, గేయాలు లభించటం లేదు. ఆకాశవాణి వారి వద్ద కూడా ఉన్నాయో లేదో తెలియదు. చివరగా వక్కలంక సరళ గారి మీద వచ్చిన వ్యాసం చూడండి. ముందు ముందు, ఇతర గాయనీ గాయకుల మీద లభ్యమైన వ్యాసాలు, వివరాలు ఈ శీర్షిక ద్వారా అందించటానికి ప్రయత్నిస్తాను
• సశేషం
• మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-3-22
•
•
•