మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-177
· 177-రంగస్థల నటుడు ,వ్యాఖ్యాత ,ప్రజానాట్యమండలి కళాకారుడు ,ప్రపంచం ,రోజులు మారాయి ఫేం –వల్లం నరసింహారావు
· వల్లం నరసింహారావు సినిమా, రంగస్థల నటుడు, వ్యాఖ్యాత, ప్రజా కళాకారుడు. ఇతడు 2006, మార్చి 13వ తేదీన 79 ఏళ్ల వయసులో హైదరాబాదులో గుండెపోటుతో మరణించాడు[1]. ఇతడు ప్రజా నాట్యమండలి కళాకారుడిగా ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. కృష్ణా జిల్లా,తిరువూరుకు చెందిన వల్లం నరసింహారావు 1952లో సినీరంగ ప్రవేశం చేశాడు. మా భూమి వంటి నాటకాల్లో నటించి ఈయన జైలు శిక్ష అనుభవించాడు. కులదైవం, ముద్దుబిడ్డ సినిమాల్లో ఈయన హీరోగా నటించాడు. ఇంకా పలు చిత్రాల్లో నటించాడు. నటుడు బి.పద్మనాభంతో కలిసి రేఖా అండ్ మురళి పతాకంపై పలు చోట్ల నాటకాలు ప్రదర్శించాడు.
సినిమాలు
- ప్రపంచం (1953)
- రోజులు మారాయి (1955)
- ముద్దు బిడ్డ (1956)
- ఎం.ఎల్.ఏ. (1957)
- ఎత్తుకు పైఎత్తు (1958)
- ముందడుగు (1958)
- కులదైవం (1960)
- అసాధ్యుడు – శ్రీశ్రీ వ్రాసిన అల్లూరి సీతారామరాజు నాటకానికి వ్యాఖ్యాత.
- నిలువు దోపిడి (1968)
- రణభేరి (1968)
- సంపూర్ణ రామాయణం (1971 )
- దేవుడు చేసిన పెళ్లి (1974)
- కొత్త కాపురం (1975)
- ఇది కథ కాదు (1979)
- యువతరం కదిలింది (1980)
- దారి తప్పిన మనిషి (1981)
- నాలుగు స్తంభాలాట (1982)
- భారతసింహం (1995)
- ధర్మచక్రం (1996)
- శ్రీరాములయ్య (1998)
- వెలుగునీడలు (1999)
- సూర్య పుత్రిక (1999)
- ఈతరం నెహ్రూ (2000)
- భద్రాచలం (2001)
- ఆయుధం (2003)
- సింహాద్రి (2003)
- ఆ నలుగురు (2004)
- లక్ష్మీనరసింహా (2004)
- శాంతి సందేశం (2004)
- సోగ్గాడి సరదాలు (2004)
- ప్లీజ్ నాకు పెళ్లైంది (2005)
- మేస్త్రీ (2005)
- నిన్న నేడు రేపు (2008)
నాటకాలు
మాభూమి
కాళహస్తి మహాత్మ్యం
శాంతి నివాసం
ఇన్స్పెక్టర్ జనరల్[2]
· ఈ వల్లం నరసింహారావు గారి అన్నకుమారుడి పేరుకూడా వల్లం నరసింహారావు .ఈయన మాకు 2017లో అమెరికాలోని షార్లెట్ నగరం లో ఆ దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం నాడు పరిచయమయ్యారు .ఈయనకూడా నాటక కళాకారుడే .ఆయనతో నాటకాలలో నటించిన వారే .ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యారు .ఇదొక యాక్సి డెంటల్ కోయింసి డెంట్.
అసలు వల్లం గారిని సుమారు 40ఏళ్ళక్రితం హైదరాబాద్ లో అనుపమ సంస్థ నిర్మాత దర్శకుడు కెబి తిలక్ మొదలైనవారితో చూశా .
·
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-4-22-ఉయ్యూరు