మలయాళసాహిత్య మార్గదర్శి –చందు మీనన్ -1
చందు మీనన్ అనే పుస్తకాన్ని మలయాళం లో టిసి.శంకర మీనన్ రాస్తే తెలుగులోకి కేకే రంగానాథాచార్యులు అనువదిస్తే కేంద్ర సాహిత్య అకాడెమి 1979లో ప్రచురించింది .వెల-రూ2-50.
మళయాళ సాహిత్య నూత్న పద నిర్దేశకుడు చందు మీనన్ .అత్యధిక విద్యాధికులున్న కేరళరాష్ట్రం లో జన్మించాడు .శతాబ్దాల క్రమ పరిమాణం కల మలయాళభాష 17 వ శతాబ్దిలో ప్రత్యేకతను ,ఆధునికత ను సంతరించుకొన్నది.మళయాళ సాహిత్య పితామహుడు తున్జల్ ఎళుత్తచ్చన్ ఆధునిక మలయాళాన్ని సాహిత్యం లో ప్రవేశలోపెట్టాడు .ఇవాళఅన్ని సాహిత్య ప్రక్రియలతో విస్తృతంగా వర్ధిల్లింది .1969లోనే మహాకవి జి శంకర కురూప్ భారతీయ జ్ఞాన పీఠ పురస్కారం పొందాడు .1890లో రావు బహదూర్ ఓ.చందు మీనన్ రాసిన ‘’ఇందులేఖ ‘’నవల మొట్టమొదటిసారిగా ఆంగ్లానువాదం పొంది మళయాళ సాహిత్యం అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేసింది .చందుమీనన్ వృత్తి రీత్యా న్యాయాధికారి కానీ రచయిత కాదు అంటే అవాక్కైపోతాం .
చందుమీనన తండ్రి ఎతపతి చందు నాయర్ కూడా న్యాయాదికారే .కేరళ కొట్టాయం తాలూకా పినరాయ్ వంశం లో కేలలూరు సబ్ డివిజన్ లో విద్య సదుపాయం పెద్దగా లేని చోటపుట్టి తండ్రి మళయాళ ఇంగ్లీష్ లలో పరిచయం పొంది తెల్లిచ్చేరి కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం లో చేరి ,వరుసగా ప్రమోషన్లు పొంది మేజిష్ట్రేట్ అయ్యాడు .తర్వాత తాసీల్దారై,మలబారులో చాలాచోట్ల పని చేశాడు .ఈయన రెండవభార్య పార్వతి అమ్మ కన్న అయిదుగురు సంతానం లో చందు మీనన్ చివరివాడు . 9-1-1847న పుట్టాడు .52ఏళ్ళు జీవించి 1857లో మరణించాడు .తండ్రి తెల్లచ్చేరిలో పని చేస్తూ ఒక ఇల్లు కట్టించుకొన్నాడు దానికి ‘’ఒయ్యరథ్’’అని పేరు పెట్టుకొన్నాడు .చందు ఇక్కడే పెరగటం వలన’’ ఒయ్యరథ్ చందు మీనన్ ‘’అయ్యాడు .
తండ్రి చనిపోయే నాటికి చందుకు పదేళ్ళు .తల్లి వాత్సల్యానురాగాలతో పెంచింది .పక్కింటాయన కొరాన్ గురుక్కళ్ దగ్గర మొదటి పాఠాలు నేర్చాడు .తర్వాత కు౦జు౦బి నంబియార్ వద్దసంస్కృతకవిత్వం నాటకాలు వ్యాకరణం నేరుస్తూ స్థానిక పాఠశాలలో ఇంగ్లీష్ నేర్చుకొన్నాడు .ఆతర్వాత అనువాదకుడు సబ్ జడ్జి అయిన కే.కుంజన్ వద్ద చదివి ,సివిల్ సర్వీస్ కు యోగ్యత పొందినా చదువు కొనసాగించి మెట్రిక్ చదివి 1864లో తల్లి చనిపోగా చదువుమానేశాడు .
17వ ఏట ఉద్యోగ వేటలో పడ్డాడు .తెల్లిచ్చేరి స్మాల్ కాజెస్ కోర్టులో గుమాస్తా ఉద్యోగానికి దరఖాస్తుపెట్టి ,ఇంటర్వ్యు చేసిన జడ్జి టిఆర్ షార్ప్ ను షార్ప్ సమాధానాలతో మెప్పించి సెలక్ట్ అయి ఆరవ గుమాస్తాగా నియమింపబడి ఉద్యోగం లో చేరాడు .మూడేళ్ళు పని చేసి తన అమోఘ శక్తిసామర్ధ్యాలు ప్రదర్శించగా సబ్ కలెక్టర్ లోగాన్ కావాలని చందు మీనన్ ను తన ఆఫీసులో మూడవ గుమాస్తాగా బదిలీ చేయించి వేసుకొన్నాడు .కొద్దికాలానికే మొదటి గుమాస్తా అయ్యాడు చందు .1871లో కాలికట్ సచివాలయం లో హెడ్ మున్షి అయ్యాడు .కావ్యంగా గుర్తింపు పొందిన ‘’ మలబార్ జిల్లా మాన్యువల్’’ తయారు చేయటం లో చందు మీనన్ గొప్ప కృషి చేసి లోగాన్ కు సాయపడ్డాడు .జస్టిస్ షార్ప్1872లో కాలికట్ జిల్లా జడ్జి అయినప్పుడు చందు మీనన్ ను సివిల్ కోర్ట్ హెడ్ క్లార్క్ గా చేశాడు అతని పనితీరును పరిశీలించి తృప్తి చెంది .1875లో ప్రభుత్వం పట్టామ్బి లో ఆయన్ను తాత్కాలిక మున్సిఫ్ ను చేసి గుమాస్తాకు స్వస్తి చెప్పించింది .పాల్ఘాట్, కాలికట్ వగైరా లలో పని చేసి 1886నుంచి 1892వరకు పరప్పనం గుడి లో జిల్లా మున్సిఫ్ చేస్తూ ,1890లో తన ప్రఖ్యాత నవల ‘’ఇందులేఖ ‘’రాసి ప్రచురించాడు చందు మీనన్ .1890లో మలబార్ మారేజ్ కమిటీలో మహోన్నతులతో సమానంగా సభ్యుడయ్యాడు .1891లో నివేదిక విడుదలయ్యాక అందరూ దాన్ని ఒప్పుకొంటే చందు తన అసమ్మతిని సూచించాడు .మరుమక్కత్దాయం కుటుంబాలలో ఆచారాల పవిత్రత అధికారం వాటికి ఉన్నాయనీ వాటిలో మార్పులు తేవటం అవాంఛనీయమని, వాటికి చట్టబద్ధ గుర్తింపు తేవటం ఒక్కటే సంస్కరణ అని చెప్పాడు .అప్పటి మద్రాస్ ప్రభుత్వం వాడుకలో ఉన్న విధానాన్నే మార్పులు లేకుండా ఆమోదించింది .చందు మీనన్ ఎంత లోతుగా అధ్యయనం చేశాడో మనకు అర్ధమౌతుంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-4-22-ఉయ్యూరు
వీక్షకులు
- 979,595 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- చిద్విలాస శతకం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.23 వ భాగం.1.2.23.
- అరుణ మంత్రార్థం. 8వ భాగం.1.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -393
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -391
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.22 వ భాగం.31.1.23.
- అరుణ మంత్రార్థం. 7వ భాగం.31.1.23.
- పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం
- బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-3(చివరి భాగం )
- ముదు నూరులో డా.ఎన్.భాస్కర రావు గారింట్లో జీవిత చరిత్రల గ్రంధాలయ వార్షికోత్సవ 0లో 29.01.2023
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,921)
- సమీక్ష (1,276)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (302)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (359)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు