మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-178
· 178-శతాధిక నాటక కర్త ,కళావని,కళా భారతి సమాజ స్థాపకుడు ,లంబాడోళ్ళ రాం దాసు ,పెండింగ్ ఫైల్ ఫేం,ఇద్దరు మిత్రులు ,బంగారు పంజరం సినిమాల డైలాగ్ రచయిత-కొర్రపాటి గంగాధరరావు
· కొర్రపాటి గంగాధరరావు (మే 10, 1922 – జనవరి 26, 1986) నటుడు, దర్శకుడు, శతాధిక నాటక రచయిత, కళావని సమాజ స్థాపకుడు.[1]
జీవిత సంగ్రహం
ఇతను 1922, మే 10న మచిలీపట్నంలో జన్మించాడు. ఏలూరు, మద్రాసులో చదివాడు. ఎల్.ఐ.ఎం. పరీక్షలో ఉత్తీర్ణులై వైద్యవృత్తిని చేపట్టి బాపట్లలో నివాసమున్నాడు.
రచనా ప్రస్థానం
తెలుగు నాటక సాహిత్యంలో వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత ఇతను. 1955-65 ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనల అనుగుణమైన రచనలు చేసి రాష్ట్రవ్యాప్తంగా నాటకొద్యమాన్ని బలోపేతం చేశాడు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేకమంది యువ కళాకారులను నాటకరంగానికి పరిచయం చేశాడు.
ఈయన నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి. నాటకరంగాన్ని గురించి, నాటక ప్రదర్శన విధానాల గురించి అనేక వ్యాసాలను రచించి నాటక కళాభివృద్ధికి కృషిచేశాడు. నాటకాన్ని ఒక పదునైన ఆయుధంగా సమాజంలోని చెడ్డ అలవాట్లపై ప్రయోగించాలని ఇతని ఆశయం. కళావని అనే నాటక సమాజాన్ని స్థాపించి, దానికి అధ్యక్షులుగా, దర్శకులుగా వ్యవహరించారు.
కళాభారతి అనే సాంస్కృతిక సంస్థకు, బాపట్ల ఫిల్ముక్లబ్ కు అధ్యక్షుడుగా అనేక సాంస్కృ తిక కార్యక్ర మాలను నిర్వంహించాడు. లంబడోళ్ళ రాందాసు, బోధిశ్రీ, ధంసా, నాలుగు నాలుగు నలభై నాలుగు, స్వర్గసీమ, శాంతి తోరణం, నారీ స్క్వేర్ బ్రహ్మచారి, అమృత మధనం, లకుమాదేవి- కుమారగిరి, నవతా!మానవతా అనే నవలలు రచించాడు. ఇవేకాక బ్రహ్మచారి పెళ్ళాం, యమలోకంలో సావిత్రి, పతి-పత్ని, వేగుచుక్క,డాక్టర్ గారి అమ్మాయి, సినిమా తారా, చేదుకో మల్లయ్య చేదుకో, ద్వి పాత్ర, పరకాయ ప్రవేశం, ఖబడ్దార్ ఖూనీకోర్ మొదలైన అముద్రిత నవలలు కూడా రచించాడు.
రచనలు
గంగాధర రావు గారు 130కి పైగా నాటక నాటికలు, 12 రేడియో నాటికలు, 20 నవలలు, 7 కథలు, ఏకపాత్రలు, నాటకరంగంపై 65 వ్యాసాలు వ్రాశాడు. విషకుంభాలు, కమల, యథాప్రజా-తథారాజా, తస్మాత్ జాగ్రత్త, లోకంపోకడ, పోటీనాటకాలు, రాగద్వేషాలు, రాగశోభిత, పుడమి తల్లికి పురిటి నొప్పులు మొదలైన నాటకాలు, ప్రార్థన, నాబాబు, పెళ్ళిచూపులు, బంగారు సంకెళ్ళు, తెలుగు కోపం, విధివశం, తనలో తాను, పెండింగ్ ఫైలు, మనిషి వంటి ప్రజాదరణ పొందిన నాటికలు రచించాడు. అంతేకాకుండా ఈ రోడ్డెక్కడికి?, పూలదోసిళ్ళు, మరా-మనిషి, సంక్రాంతి, సాహసి వంటి నాటకాలను తెలుగులోకి అనువదించాడు.[2]
నాటకాలు/నాటికలు
3. గుడ్డిలోకం
4. నిజరూపాలు
5. కమల
6. కొత్తచిగురు
7. పుడమితల్లికి పురిటినొప్పులు
8. ఈ రోడ్డు ఎక్కడికి?
9. తెరలో తెర
ఆంధ్ర కళాపరిషత్ నిర్వహించిన పోటీలలో పాల్గొన్న, బహుమతులను అందుకున్న 25 నాటికలను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పక్షాన నాటికా పంచవింశతి అనే పేరుతో సంకలనం చేసి ప్రచురించారు.
పురస్కారాలు
వీరి నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి.
1. యథాప్రజా-తథారాజా నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు
2. ప్రార్థన నాటకానికి ఆంధ్రనాటక కళాపరిషత్తు అవార్డు,
3. మద్యపాన నిషేధం వస్తువుగా రాసిన పెడదోవ నాటకానికి కేంద్ర ప్రభుత్వ ప్రథమ బహుమతి లభించాయి.
మరణం
తెలుగు నాటకరంగానికి విశేష సేవ చేసిన ఇతను 1986, జనవరి 26 తేదీన మరణించాడు.
సీక్వెల్ గా నాటకాలు నవలలు రాశారు .ఎన్నెన్నో నాటకపోటీలు నిర్వహించి యువకులను ప్రోత్సహించారు .దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఇద్దరుమిత్రులు సినిమాకు ,బిఎన్ రెడ్డి బంగారు పంజరం సినిమాకు కోర్రపాటితో సంభాషణలు రాయించారు .వీరి అత్యుత్తమనాటకం ‘’యధా ప్రజా తధా రాజా ‘’నాటక ,సంగీతప్రియులను విశేషంగా ఆకర్షించింది .గరికపాటి రాజారావు తో పరిచయం మద్రాస్ లో ఏర్పడి కొన్ని నాటకాలు ఆయనతో కలిసి ఆడారు .నిజరూపాలు ,తెరలోతెర ,భవబంధాలు ,రాగశోభిత ,గృహదహనం రాగద్వేషాలు ,ఆరని పారాణి ,నిర్మల ,కమల ఈ రోడ్డేక్కడికి ,తస్మాత్ జాగ్రత ,భాయి భజరంగ్ ,గుడ్డిలోకం గొప్ప ప్రజాదరణ పొందిన నాటకాలు .రాయం రంగనాధం పేరుతొ స్త్రీ పాత్రలులేని 13హాస్యనాటికలు కాలేజీ యువకులకోసం రాశారు. ఒకే పేరుతొ సీక్వెల్ గా రాయటం ,ప్రదర్శించటం ఒక అద్భుతమై ఎవ్వరూ చేయని ప్రయోగం గా నిలిచింది .నాటక ప్రయోగానికీ ఊపిరి పోసింది ఆయనే .పరిషత్తులలో ఉత్తమ నటులు నటీమణులను ఎంపిక చేసి వారికి ఒక సంఘటన చెప్పి ,అప్పటికప్పుడు పది నిమిషాలలో నటింప చేసి పోటీ లనూ నిర్వహించిన మొదటి వాడు ఆయనే.ఉత్తమనటుడు ,నటి హాస్యనటుడు ,కేరక్టర్ ఆర్టిస్ట్ ,లాంటి బహుమతులను ప్రవేశపెట్టినవాడూ కొర్ర పాటే.వారందరినీ సత్కరించి ప్రోత్సాహం కల్గించాడు .
కళావనినాటక విద్యాలయం స్థాపించి ఎందఱో ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇచ్చాడు .కొర్రపాటి శిష్యులలో పిఎల్ నారాయణ ,కే ఎస్ టి.సాయి వంటి మహానటులున్నారు .నటుడు,ప్రయోక్త ,,విశ్రాంత ఆచార్యుడు డి.ఎస్.ఎన్ . మూర్తి ఆయన బృందం వారే .అయోమయంలో చీకటిలో బతుకుతున్న సామాన్యులకు ఆయన నాటకాలు ఆసరా .’’పది రూపాయలిస్తే ‘’నాటకం లో పది ఉచిత పధకాలిస్తే ఓట్లేస్తే జనాన్నీ దేశాన్నీ పది వేలకోట్లకు అమ్మేసే ప్రభుత్వాలోస్తాయిజాగ్రత్త అని చెప్పారు .కారా మాస్టారి ‘’యజ్ఞం ‘’కధ ను నాటిక గా మలిచి అద్భుతం చేసిన ప్రజ్ఞాశాలి కొర్రపాటి .అలాగే ఎందఱో గొప్ప రచయితల కధలను దృశ్యమానం చేసిన ఘనత డా. కొర్రపాటిది.
ఆంధ్రప్రదేశ్ నాటక అకాడెమి ‘’కళాప్రపూర్ణ ‘’బిరుదుతో సత్కరించింది .యధారాజ నాటకప్రదర్శనకు 9-2-1972కు యాభై ఏళ్ళు నిండాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-4-22-ఉయ్యూరు