మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-186 · 186-‘’లేలేలే నా రాజా ,తీస్కో కోకాకోలా ,మసకమసక చీకటిలో ,బలేబాలే మగాడివోయ్ ‘’వంటి లంగా మార్క్ పాటల గాయని గా ముద్రపడిన కలైమామణి –ఎల్ ఆర్ ఈశ్వరి 

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-186

· 186-‘’లేలేలే నా రాజా ,తీస్కో కోకాకోలా ,మసకమసక చీకటిలో ,బలేబాలే మగాడివోయ్ ‘’వంటి లంగా మార్క్ పాటల గాయని గా ముద్రపడిన కలైమామణి –ఎల్ ఆర్ ఈశ్వరి

·

· ఎల్. ఆర్. ఈశ్వరి ప్రముఖ నేపథ్య గాయని. ఈమె మద్రాసులో ఒక రోమన్ కాథలిక్ కుటుంబంలో డిసెంబరు 8వ తేదీన జన్మించింది. ఈమె తండ్రి మద్రాసులో స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు. ఈమె ఐదేళ్ళ వయసులో అతడు మరణించాడు. ఈమె తల్లి నిర్మల కుటుంబభారాన్ని మోసింది. ఆమె మంచి గాయని కావడంతో సినిమాలలో అవకాశం లభించినప్పుడల్లా కోరస్ బృందాలకు పాడింది. ఆ సమయంలో తల్లితో పాటు ఈమె కూడా రికార్డు స్టూడియోలకు వెళ్ళేది. ఆ సమయంలోనే ఈమెకు కూడా కొన్ని చిత్రాలకు కోరస్ బృందంలో పాడే అవకాశం వచ్చింది. ఈమె పూర్తి పేరు “లూర్డ్ మేరీ”. ఈమె బామ్మ హిందూ కావడంతో “రాజేశ్వరి” అని పిలిచే వారు. ఈమె తన తల్లి, తండ్రి ఇరువైపుల బంధువులను తృప్తి పరచడానికి తన పేరును లూర్డ్ రాజేశ్వరిగా మార్చుకుంది. అప్పటికే తమిళ సినీరంగంలో ఒక రాజేశ్వరి గాయనిగా చలామణీలో ఉన్నందుకు తమిళ చిత్ర నిర్మాత ఎ.పి.నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం టూకీగా ఎల్. ఆర్. ఈశ్వరిగా మార్చాడు. ఈమె తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, హిందీ, తుళు, ఆంగ్ల భాషలలో కొన్ని వేల పాటల్ని పాడింది.

· ఈమెను మొదటగా కె.వి.మహదేవన్ గుర్తించి, “నల్ల ఇడత్తు సంబంధం” (1958) అనే తమిళ సినిమాలో మొదటి సారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. కాని “పాశమలార్” (1961) సినిమాతో ఆమెకు మంచి గాయనిగా పేరొచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఎక్కువగా చెళ్ళపిళ్ళ సత్యం దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్, ఐటమ్ నంబర్లకు పాడింది. ఈమె ఎక్కువగా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత మొదలైన నాట్యకత్తెలకు పాడింది. వీరే కాకుండా విజయలలిత, లక్ష్మి, సరిత వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేసింది. ఈమె మొత్తం 14 భాషలలో పాడింది.

· ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం విషాదమే. పేదరికంలో జీవించిన ఈమె కుటుంబం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. అవివాహితగానే ఉండిపోయి, సమాజం నుండి అంతగా గుర్తింపుకు నోచుకోలేదు.

· ఈమెకు తమిళనాడు ప్రభుత్వం 1984లో కళైమామణి అవార్డు ప్రదానం చేసింది.

సినిమాలు-పాటలు

 1. దొంగలున్నారు జాగ్రత్త (1958) (తొలి తెలుగు సినిమా)
 2. జగన్నాటకం (1960)
 3. అగ్గిపిడుగు (1964)
 4. నవగ్రహ పూజామహిమ (1964) : నవ్వర నవ్వర నా రాజా నవ్వుల నివ్వర ఓ రాజా
 5. పాండవ వనవాసం (1965) : మొగలి రేకుల సిగదానా (హేమమాలిని అభినయించిన పాట)
 6. ప్రేమించి చూడు (1965)
 7. శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965)
 8. అగ్గిబరాట (1966)
 9. ఉమ్మడి కుటుంబం (1967)
 10. కంచుకోట (1967)
 11. గోపాలుడు భూపాలుడు (1967)
 12. శ్రీకృష్ణావతారం (1967) : చిలుకల కొలికిని చూడు నీ కళలకు సరిపడు జోడు
 13. అమాయకుడు (1968) : పట్నంలో శాలిబండ పేరైన గోలకొండ
 14. ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968)
 15. పాలమనసులు (1968)
 16. బంగారు గాజులు (1968) : జాజిరి జాజిరి జక్కల మావా
 17. బందిపోటు దొంగలు (1968) : గండరగండా షోగ్గాడివంటా
 18. బాగ్దాద్ గజదొంగ (1968)
 19. గండికోట రహస్యం (1969)
 20. నిండు హృదయాలు (1969)
 21. బందిపోటు భీమన్న (1969)
 22. కథానాయిక మొల్ల (1970) : నానే చెలువే అందరికి ( ఐదు భాషలలో పాడిన పాట)
 23. జన్మభూమి (1970)
 24. లక్ష్మీ కటాక్షం (1970) : అందాల బొమ్మను నేను చెలికాడ
 25. జగత్ జెంత్రీలు (1971)
 26. జేమ్స్ బాండ్ 777 (1971)
 27. బస్తీ బుల్ బుల్ (1971) : ఏ ఎండకా గొడుగు పట్టు రాజా నువ్వు పట్టకుంటే నీ నోట మట్టి రాజా
 28. దెబ్బకు ఠా దొంగల ముఠా (1971)
 29. నమ్మకద్రోహులు (1971) : ఏమా కోపమా నేను వేచింది నీకోసమే పాన్పు వేసింది
 30. బంగారుతల్లి (1971)
 31. ప్రేమనగర్ (1971) : లేలేలే లేలేలే నా రాజా… లేవనంటావా నన్ను లేపమంటావా
 32. రౌడీలకు రౌడీలు (1971) : తీస్కో కోకో కోలా వేస్కో రమ్ము సోడా
 33. పిల్లా-పిడుగు (1972)
 34. బాలభారతము (1972) : బలే బలే బలే బలే పెదబావ భళిర భళిర ఓ చినబావా
 35. భార్యాబిడ్డలు (1972) : ఆకులు పోకలు ఇవ్వద్దూ నా నోరు ఎర్రగ చెయ్యొద్దూ
 36. మంచి రోజులొచ్చాయి (1972)
 37. మావూరి మొనగాళ్ళు (1972)
 38. రైతుకుటుంబం (1972)
 39. ఎర్రకోట వీరుడు (1973)
 40. జీవన తరంగాలు (1973) : నందామయా గరుడ నందామయా
 41. తాతా మనవడు (1973) : రాయంటీ నా మొగుడు రంగామెల్లీ తిరిగి రాలేదు
 42. దేవుడు చేసిన మనుషులు (1973) : మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో
 43. దేశోద్ధారకులు (1973)
 44. ధనమా దైవమా (1973)
 45. పుట్టినిల్లు మెట్టినిల్లు (1973) : బోల్తా పడ్డావు బుజ్జి నాయనా
 46. అల్లూరి సీతారామరాజు (1974)
 47. నిజరూపాలు (1974)
 48. నిప్పులాంటి మనిషి (1974) : వెల్ కం స్వాగతం చేస్తా నిన్నే పరవశం
 49. చిన్ననాటి కలలు (1975)
 50. అంతులేని కథ (1976) : అరే ఏమిటి ఈ లోకం… పలుగాకుల లోకం
 51. పాడిపంటలు (1976)
 52. మన్మధ లీల (1976) : హలో మై డియర్ రాంగ్ నంబర్
 53. దొంగల దోపిడీ (1978)
 54. దొంగల వేట (1978)
 55. మరో చరిత్ర (1978) : భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
 56. సింహబలుడు (1978) : సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్
 57. అందమైన అనుభవం (1979) : ఆనంద తాండవమే ఆడేనుగా ఆ శివుడు
 58. చూసొద్దాం రండి (2000) (చివరిగా పాడిన సినిమా)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-4-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.