• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-191
• 191-యువ నటి ,నిర్మాత –వాసంతి బి .ఏ.
• వాసంతి తెలుగు చలన చిత్ర నటీమణులలో ఒకరు. ఈవిడ అసలు పేరు లక్ష్మీరాజ్యం. ఈవిడ కొన్ని చిత్రాల నిర్మాత కూడా. ఈవిడ బి.ఏ. చదివారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం లోని తిమ్మసముద్రం గ్రామం ఈవిడ స్వస్థలం. ఈవిడ ‘లా’ చదువు తున్నప్పుడు “తేన్నిలవు” అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఔట్డోర్ షూటింగు కోసం కాశ్మీర్ వెళ్ళవలసి రావడం చేత ఈమె లా పూర్తి చేయలేకపోయింది. ఆ తరువాత బలేపాండ్యన్, ఎన్నదాన్ ముడివు మొదలైన తమిళ చిత్రాలలోను, పాదుకా పట్టాభిషేకం, అమ్మైకాన మొదలైన మళయాల చిత్రాలలోను, అనేక తెలుగు చిత్రాలలోను నటించారు.
నటిగా
• విరిసిన వెన్నెల (1961) – తొలి సినిమా
• మహాకవి కాళిదాసు (1960)
• సిరిసంపదలు (1962)
• మంచి మనసులు (1962)
• ఆరాధన (1962)
• దక్షయజ్ఞం (1962)
• పునర్జన్మ (1963)
• సవతి కొడుకు (1963)
• వివాహబంధం (1964)
• శభాష్ సూరి (1964)
• నవగ్రహ పూజా మహిమ (1964)
• కీలుబొమ్మలు (1965)
• గుడిగంటలు (1965)
• ఉయ్యాల జంపాల (1965)
• సుమంగళి (1965)
• ఆత్మగౌరవం (1966)
• పల్నాటి యుద్ధం (1966)
• శ్రీమతి (1966)
• వీరాంజనేయ (1968)
నిర్మాతగా
• భలేపాప (1971)
• మేమూ మనుషులమే (1973)
• కల్పనాలయా పేరిట వాసంతి నిర్మించిన భలేపాప సినిమాలో రంగారావు,హరనాద్ కేఆర్ విజయ పద్మనాభం ,రేలంగి వగైరాలున్నారు సంగీతం ఆర్ సుదర్శనం .దర్శకత్వం కే ఎస్ ప్రకాశరావు .వీటూరి రాసిన ఎల్ ఆర్ ఈశ్వరిపాడిన ‘’వయసు పదహారు నా వలపు సెలయేరు ‘’బాగుంటుంది .చిట్టిపాపా చిరునవ్వులపాప పాట అనిసెట్టి రాస్తే సుశీల పాడింది .అయ్యలారా అమ్మలారా మా అమ్మనేవరైనా చూశారా పాత సినారె రాయగా ఘంటసాల గానం చేశారు
కల్పనాలయా బానర్ పై వాసంతి తీసిన ‘’మేమూ మనుషులమే ‘’సినిమా కె.బాపయ్య డైరెక్ట్ చేయగా కృష్ణం రాజు జమున నటించారు .మంచి ఆలోచన రేకెత్తించే చిత్రం .ఆత్రేయ రాసిన ‘’ఏమంటున్నది ఈగాలీ ?ఎగిరే పైటను అడగాలి ‘’పాట సుశీల బాలు పాడారు ఎం ఎస్ విశ్వనాధం మ్యూజిక్ .ఈగీతం సూపర్ హిట్ అయింది .
•
•
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-4-22-ఉయ్యూరు
వీక్షకులు
- 979,601 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- చిద్విలాస శతకం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.23 వ భాగం.1.2.23.
- అరుణ మంత్రార్థం. 8వ భాగం.1.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -393
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -391
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.22 వ భాగం.31.1.23.
- అరుణ మంత్రార్థం. 7వ భాగం.31.1.23.
- పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం
- బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-3(చివరి భాగం )
- ముదు నూరులో డా.ఎన్.భాస్కర రావు గారింట్లో జీవిత చరిత్రల గ్రంధాలయ వార్షికోత్సవ 0లో 29.01.2023
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,921)
- సమీక్ష (1,276)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (302)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (359)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు