మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-192
· 192-అవ్వయ్యార్ గా జీవించిన –సుందరంబాళ్
· 1953లో విడుదలైనశూలమంగళం సుబ్బు దర్శకత్వం వహించి .శ్రీమతి కే బి సుందరంబాల్ ,ముఖ్య పాత్ర పోషించిన జెమిని వారి ‘’అవ్వయ్యార్ ‘’తమిళచిత్రం తెలుగులోనూ డబ్బింగ్ పొంది అఖండ విజయం పొందింది .మురుగన్ మహా భక్తురాలు అవ్వయ్యార్ .ఎం డి పార్ధసారధి ,ఆనదరం ,మాయవరన్ వేణు సంగీతం కూర్చారు .అవ్వయార్ రాసిన గీతాలతోపాటు పాపనాశనం శివం ,కొత్తమంగళం సుబ్బు పాటలు రాశారు .
· ఒక వీధి వీధి అంతా ఆరోజుల్లోనే లక్షన్నర రూపాయలు పెట్టి సెట్ వేసి చిత్రీకరించారు .అవ్వయ్యార్ కుటుంబ సభ్యులనుంచి విషయ సేకరణ చేసి స్క్రిప్ట్ లో ఉపయోగించారు .10వేలమంది జూనియర్ ఆర్టిస్ట్ లతో నటిమ్పజేశారు .అవ్వయ్యార్ భక్తిగీతాలు తమిళ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి .ప్రారంభ గీతం తమిళనాడు గొప్ప తనాన్ని వర్ణిస్తుంది .అవ్వయ్యార్ అంటే తమిళ మాత అనే నమ్మకం .ఆమె ఆరాధ్యదైవం మురుగన్ అంటే కుమారస్వామి అంటే శరవణభవ .పాటలు పద్యాలు అన్నీ అవ్వయ్యార్ పాత్రధరించిన సుందరంబాల్ గానం చేసింది .మ్యూజికల్ హిట్ సినిమా .తెలుగు డబ్బింగ్ కూడా ఆంధ్రలో గొప్ప విజయం సాధించింది .
· అవ్వయ్యార్
తమిళంలో అవ్వయ్యార్ అంటే గౌరవనీయులైన మహిళ అని అర్థం. తమిళ సాహిత్యంలో ఈ పేరుతో సుమారు ముగ్గురు కవయిత్రులు ఉన్నారు. వారిలో ఒకరు 1 వ శతాబ్దంలో జీవించినట్లు, 59 పద్యాలు రచించినట్లు ఆధారాలు ఉన్నాయి. అవ్వయ్యార్-2 చోళ వంశ పాలనా సమయంలో(10వ శతాబ్దం) జీవించారు. రోజువారీ జీవితంలో చేయకూడని, చేయాల్సిన పనుల గురించి సామాన్య భాషలో పద్యాలు రచించారు. ఆమె రాసిన పద్యాలు నేటికీ తమిళ పాఠ్య పుస్తకాల్లో దర్శనమిస్తున్నాయి. తను ఎంతో ఙ్ఞాన సంపదను కలిగి ఉన్నానని, ఇక నేర్చుకోవాల్సిందేమీలేదని చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మారువేషంలో వచ్చిన మురుగన్ ఙ్ఞానసముపార్జన నిత్యప్రవాహం వంటిదని, నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆమెకు బోధ చేయడంతో మరలా విద్యాభ్యాసం ప్రారంభించిందని, చిన్నారుల కోసం పుస్తకాలు రాసిన మొదటి వ్యక్తిగా నిలిచిందని చరిత్ర చెబుతోంది.శైవ క్షేత్రాలన్నీ కాలినడకన దర్శించి అక్కడి దైవాలపై తనకు వచ్చిన అతి తేలికైన తమిళభాషలో పద్యాలు రాసింది అవి ఈనాటికీ జనుల నాలుకలమీద నర్తిస్తున్నాయి జాతిమతకుల భేదాలులేకుండా భక్తితొ అందర్నీ ఏకం చేసింది
· ఇలా క్షేత్ర దర్శనం చేస్తూ అలసిపోయి ఒకరోజు ఒక అడవిలో చెట్టు దగ్గర కోవెలలో కూర్చుంటే సుబ్రహ్మణ్యస్వామి గోప వేషం లో వచ్చి ‘’ఏంకావాలి అవ్వా ‘’అంటే ‘’నువ్వేమైనా ఆర్చేవాడివా ,తీర్చే వాడివా ?”’అంది .’’మురుగా అనిపిల్చావు కదా అందుకే వచ్చా ‘’అన్నాడు .’’నేను పిలిచిన్దిసుబ్రహ్మణ్యస్వామిని ‘’ ‘’అంటుంది .నాపేరుకూడా మురుగా అందుకే వచ్చా అంటాడు .ఇద్దరిమధ్య వాదోపవాదాయు జరిగిఅవ్వయ్యార్ ఓడిపోతుంది .అప్పుడు మురుగా ‘’నీ కేం కావాలో చెప్పు ‘’అంటాడు .’’వేడి వేడి పళ్ళు కావాలి తెస్తావా ?’’అడిగింది .అదెంతపని అని ప్రక్కనే ఉన్న చెట్టెక్కి పళ్ళు దులిపాడుఅవి కిందపడ్డాయి .అవ్వ వాటిని ‘’ఉఫ్ ఉఫ్అంటూ ఊదుకొని తిన్నది ‘’అవ్వా బాగా వేడిగా ఉన్నాయా పళ్ళు ‘’?అనగా ‘’నాయనా నిన్ను గుర్తి౦చ లేదు నా మురుగన్ నువ్వే ‘’అని నమస్కరించి స్తోత్రం చేస్తుంది .అ౦దులోభావం ‘’నా జన్మ జన్మాల తపస్సు ఫలం సుబ్రహ్మణ్యుడు ‘’అని .
·
· తెలుగు డబ్బింగ్ కు మాటలు పాటలు పద్యాలు ఎవరు రాశారో తెలీదు .
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-4-22