• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-199
199-రంగస్థలనటుడు ,ప్రయోక్త ,నాట్యకళా పోషకుడు ,కూచిపూడిసిద్దేంద్ర కళాక్షేత్ర నిర్మాత నిర్వాహకుడు ,బాలనాగమ్మ ,సారంగధర సినీ నటుడు ,కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డీ ,రాష్ట్రపతి పురస్కార గ్రహీత,అభినవ కృష్ణ –బందా కనకలింగేశ్వరరావు
బందా కనకలింగేశ్వరరావు, (జనవరి 20, 1907- డిసెంబరు 3, 1968) సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు.
ఇతను కృష్ణా జిల్లాలోని ఆటపాక గ్రామంలో జన్మించారు. ఆటపాకలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత బందరు నోబుల్ కళాశాలలో చదివి, మద్రాసు లా కళాశాల నుండి 1932 లో బి.ఎల్. పట్టా పుచ్చుకున్నారు. 1934లో మొదట న్యాయవాదిగా పనిచేసి, తరువాతి కాలంలో నాటక ప్రదర్శనమే వృత్తిగా చేసుకున్నారు.ఇతను నాటకాలలో అనేక పాత్రలు పోషించాడు. వాటిలో బాహుకుడు, బిల్వమంగళుడు ఇష్టమైనవి.
ఏలూరులో 1938లో నాటక కళాశాలను స్థాపించి పలువురు నటులకు శిక్షణ ఇచ్చారు. ప్రభాత్ థియేటర్ అనే సంస్థను స్థాపించి నాటక ప్రయోక్తగా నూతన ప్రదర్శన రీతులను ప్రవేశపెట్టారు. తెలుగు సినిమా ప్రపంచంలో మొదటి తరం సినిమాలైన బాల నాగమ్మ, ద్రౌపదీ మానసంరక్షణం, పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా), సారంగధర (1937 సినిమా) సినిమాలలో నటించాడు.కూచిపూడి నాట్యకళకు ఎనలేని సేవచేశారు. ప్రభుత్వ సాయంతో కూచిపూడి గ్రామంలో సిద్ధేంద్ర కళాక్షేత్రం నెలకొల్పి నిర్వహించారు.[1] ఈ కళ గురించి ప్రముఖ పత్రికలలో వ్యాసాలు రాసి దాని ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేశారు.[2] 1956 లో ఆకాశవాణిలో నాటక ప్రయోక్తగా పనిచేసి మంచి నాటకాలను, నాటికలను ప్రసారం చేశాడు. వీరు ఆటపాక గ్రామంలో ఒక శివాలయాన్ని, ఒక చెరువును తవ్వించారు, ఒక వేద పాఠశాలను స్థాపించారు.
ఇతను 1964 లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును గెలుపొందాడు. వీరి ఉత్తమ నటనకు రాష్ట్రపతి అవార్డు లభించింది.వీరికి ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
వీరి జన్మ శతాబ్ది ఉత్సవాలను హైదరాబాదులో 2006-07 సంవత్సరాలలో ఘనంగా నిర్వహించారు.
ఏలూరులో కొంతకాలం న్యాయవాదిగా ఉన్నారు .తాలూకా బోర్డ్ సభ్యులయ్యారు .నాటకాలు ఆరవప్రాణం .కృష్ణ పాత్రకు పెట్టిందిపేరు .సారంగధర ,బిల్వమంగళపాత్రలకు జీవం పోశారు .బళ్లారిలో చిత్ర నలీయం నాటకం లో బాహుకుడుగా నటింఛి ,బళ్ళారి రాఘవ ప్రశంసలు పొందారు .ఎన్నో పౌరాణిక ,చారిత్రకనాటకాలు ప్రదర్శించారు .కణ్వ ,అభిమన్యు ,ప్రతాపరుద్ర ,గిరీశం అల్లూరి ,పాత్రలను దీటుగా పోషించారు .ఈయన తండ్రి శ్రీశైలంగారు కొల్లేటి లంక కరణం .బియేబందరులో పూర్తీ చేసి ,మద్రాస్ లో లా చదివి ,ఏలూరులో ప్రాక్టీస్ పెట్టి ‘’ప్రభాత్ ధియేటర్స్ ‘’నాటక సమాజం స్థాపించి 40ఏళ్ళు నిర్వహించారు .
ద్రౌపదీ మాన సంరక్షణం సినిమాలో కృష్ణ పాత్రతో సినీ అరంగేట్రం చేసి ,సారంగధర ,పాడుక ,కాలచక్రం బాలనాగమ్మ లలో నటించారు .సినిమా పద్ధతులు అలవాట్లు నచ్చక ,1942లో ఏలూరు తిరిగి వచ్చారు .నాటక రంగ పరిశీలనకోసం 1955లో రష్యా ,ఫిన్లాండ్ ,జెకోస్లోవేకియా దేశాలు పర్యటించారు .
1956 విజయవాడ ఆకాశవాణి కేంద్రం లో నాటక ప్రయోక్తగా చేరి 12ఏళ్ళు అవిరళకృషి చేసి ఎన్నెన్నో అద్భుత నాటకాలను ప్రసారం చేశారు .కూచిపూడి నాట్య సంప్రదాయానికి ప్రాణం పోశారు .కేంద్ర సంగీత నాటక అకాడెమి ,ఆంధ్రప్రదేశ్ నాటకాకదేమి సభ్యత్వాలు ఆయనను వరించాయి .అభినవ కృష్ణ ,నటశేఖర బిరుదులు పొందారు ..ఉత్తమ నటుడుగా 1963లో రాష్ట్రపతి అవార్డ్ అందుకొన్నారు .రేడియో నాటికలను ఒక సంపుటిగా ప్రచురించి శాశ్వతత్వాన్ని చేకూర్చారు ,కూచి పూడి నృత్యం పై బందా గారి రచన పరమ ప్రామాణికం .1968 డిసెంబర్ 3 నాటక ధ్రువతార బందా కనుమూశారు ,అప్పటినుంచి ప్రతియేటా బందా వర్ధంతి కూచిపూడిలో జరుపుతున్నారు
నేను విజయవాడ ఎస్ ఆర్ అర సివి ఆర్ కాలేజిలో ఇంటర్ 1956-58లో చదువుతున్నప్పుడు బందాగారు మా ఆహ్వానం పై వచ్చి R -4 లో కృష్ణ పాత్ర ధారణ చేసి అలరించటం ఇంకా గుర్తు ఉంది .అప్పుడే రజని ,వింజమూరి కనకదుర్గ గార్లు కూడా లలిత గీతాలు పాడగా విని ఆనందించాం. కూచిపూడి సిద్ధేంద్ర కళా క్షేత్ర నిర్మాణం ఆయన చేతులమీదుగా జరగటం దాని ఆవిష్కరణ వేడుకలకు కూచిపూడి వెళ్లి చూడటం నాకు మరువరానిఅనుభవం .బందా ఒక లిజెండరీ మహాపురుషుడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-22-ఉయ్యూరు
1. ↑
•
—
•
•
• —
•
•
•
—
•
•
• —
•