మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200
· 200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ-2
శ్రీవాత్సవ గురించి యామిజాల జగదీశ్ ,గొల్లపూడి మారుతీరావు చెప్పిన మరిన్ని విశేషాలు
ప్రభుత్వ ఉద్యోగాలలోనో, ఆకాశవాణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలలోనో పనిచేసేవారు ఇంకొక చోట సొంత పేరుతో రాయడానికి వీలులేని పరిస్థితులలోనో, భద్రత కోసమో కలంపేర్లను ఉపయోగించుకుంటారు.
ఆకాశవాణిలో పనిచేసిన యండమూరి సత్యనారాయణ ‘శ్రీవాత్సవ’ పేరుతో రచనలు చేశారు. తెలుగు స్వతంత్ర వార పత్రికలో ప్రతి సంవత్సరం ఆయనచేసిన సాహిత్య సింహావలోకనాలు చాలా ప్రసిద్ధాలు.
ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1956లో నాటక ప్రయోక్తగా ప్రవేశం చేసి 12 సంవత్సరాల పాటు ఎన్నో నాటకాలు ప్రసారం చేశారు. కూచిపూడి నాట్య సంప్రదాయానికి ఊపిరిపోసింది బందా. కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సభ్యత్వాలు లభించాయి. అభినవకృష్ణ, నటశేఖర బిరుదులతో సత్కరించారు. ఉత్తమనటుడుగా 1963లో రాష్ట్రపతి అవార్డు పొందారు. రేడియో నాటికలు సంపుటిగా ప్రచురించారు. కూచిపూడి నృత్యంపై వీరి రచన ప్రామాణికం
1968 డిసెంబరు 3న నాటకరంగంలో ధృవతార రాలిపోయింది. ఇప్పటికీ కూచిపూడిలో బందా వర్థంతి ఏటా జరుగుతుంది. కూచిపూడిలో సిద్దేంద్ర కళాక్షేత్ర నిర్మాణానికి ఆయన కృషి అపారం.
వీరి తర్వాత జ్ఞప్తికి తెచ్చుకోవలసిన వ్యక్తి ఆమంచర్ల గోపాలరావుగారు వీరు నాటక విభాగ ప్రయోక్తగా విజయవాడలో పనిచేసి పదవీ విరమణ చేశారు. చాలాకాలం మదరాసులో కూడా పనిచేశారు.యండమూరి సత్యనారాయణ (శ్రీవాత్సవ) 1913 }} శ్రీవాత్సవగా ప్రసిద్ధి చెందిన యండమూరి సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా పసలపూడిలో 1913 మే 21న జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం గావించిన సత్యనారాయణ ఆకాశవాణిలో విజయవాడ, మదరాసు కేంద్రాలలో కార్యక్రమ నిర్వహకులుగా చాలాకాలం పనిచేశారు. ఆపైన అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా ఢిల్లీ బదలీ అయి వెళ్ళారు.
ఘంటసాల వేంకటేశ్వర రావు 1944 సెప్టెంబర్ ఇరవైన మొదటిసారి రేడియోలో పాడారు. ఆ తరువాత అనేక సార్లు ఆయన లలితసంగీత కార్యక్రమాల్లో, సంగీత నాటకాల్లో పాల్గొంటూ వచ్చారు. దీపావళి పండుగ కోసం సముద్రాల రాఘవాచార్యులు రాసిన ‘వెలుగు వెల్లువ’ అనే సంగీత నాటకంలో ఘంటసాల, భానుమతి ప్రధాన పాత్రధారులు. విశ్వనాధ రాసిన ‘కిన్నెరసాని’ సంగీత నాటకానికి ఘంటసాల సంగీతం సమకూర్చారు. ‘లైలా మజ్నూ’ నాటకంలో ఘంటసాల మజ్నూ పాత్ర పోషించారు. అందులో ఆయన పాడిన ‘గుడారమెత్తివేశారు’, ‘ఎందు చూచినగాని లైలా…’ అనే పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.(రచన: యండమూరి సత్యనారాయణ, సంగీతం : రజని). 1945 లో ఘంటసాల పాడిన రజని గేయం ‘ఘనాఘనా గర్జింపవొ..’ అనే పాట ఢిల్లీ నుంచి జాతీయ కార్యక్రమంలో ప్రసారమయింది. ఏరి రచనలకు కేం[ద పురస్కారం లభించింది. పెళ్లాడే బొమ్మ, తీరని కోరికలు నాటకాలు, నాగరిక, చెట్లు గేయ సంపుటిని రచించారు. వీరు 1968 మార్చిలో ఢిల్లీలో చనిపోయారు. వీరి కుమారులు రామచంద్రరావు జర్నలిస్టుగా విజయవాడలో స్థిరపడ్డారు,
ఉష కిరణాలు
గొల్లపూడి మారుతీరావు
1959-63 వరకూ ఆంధ్రప్రభలో పనిచేసి 1963 జనవరి 17న హైదరాబాదు రేడియో స్టేషన్లోకి అడుగుపెట్టాను. అప్పుడక్కడ రజనీకాంతరావుగారు పనిచేస్తున్నారు. ఇంకా దేవులపల్లి కృష్ణశాస్త్రి, నాయని సుబ్బారావు, మునిమాణిక్యం నరసింహారావు, బుచ్చిబాబు, యండమూరి సత్యనారాయణ, అయ్యగారి వీరభద్రరావు, ఆచంట నారాయణ మూర్తి, భాస్కరభట్ల కృష్ణారావు, స్థానం నరసింహారావు, న్యాపతి రాఘవరావు, దాశరథి – ఇలా ఎందరో మహానుభావుల సమక్షంలో నౌఖిరీ. నిజానికి అది ఉద్యోగం కాదు. వైభవం. అప్పటికి రజనిగారు పాటలు రాసి, బాణీలు చేయగా పాటలను చిరస్మరణీయం చేసిన ఒక తరం వెళ్లిపోయింది. ఎస్. వరలక్ష్మి, టంగుటూరి సూర్యకుమారి, శాంతకుమారి – ఇలాగ. నా జీవితంలో అదృష్టం – తర్వాతి కాలంలో మళ్లీ వారందరితోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. కొందరితో పనిచేశాను. ఓ ముప్ఫై సంవత్సరాల తర్వాత ఇంగ్లండులో కెంట్‌లో మిత్రులు డాక్టర్ వ్యాకరణం రామారావు గారింట్లో సూర్యకుమారి గారిని కలిశాను. ‘‘మీ అందరివల్లే నేను రేడియోలో చేరాను’’ అని ఆమెకు గుర్తు చేశాను.
మద్రాసు కేంద్రంలో తెలుగు శాఖలో నాటక శాఖను కీ.శే.యండమూరి సత్యనారాయణ (శ్రీవాత్సవ) నిర్వహించేవారు. ఆయన గొప్ప రచయిత. షహరజాద్ – అరేబియన్ నైట్స్ – వేయిన్నొక్క రాత్రుల కథలు, లైలామజ్ను, షిరీజ్ ఫర్‌హద్ లాంటి ఇతివృత్తాలతో నాటకాలు రాసేవారు. వాటిలో పాటలూ, సంగీత రచనా రజనీయే.
ఏటా వార్షిక సాహిత్య సమీక్షలు రాసిన యండమూరి సత్యనారాయణ ఆకాశవాణి మద్రాసులో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా చిరకాలం పనిచేశారు. వారి కలం పేరే ‘శ్రీవాత్సవ’, ‘ఆనంద నిలయమ్’ 1954లో ఒకసారి, 1957లో మరోసారి మద్రాసు, విజయవాడ కేంద్రాలలో.. ప్రసారమైంది. ఇందులో ఆరు ప్రధాన పాత్రలు – తండ్రి, తల్లి, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు. వంగర వెంకట సుబ్బయ్య, ఎన్.ఉదయలక్ష్మి, వావికొలను కృష్ణకుమారి, కాటూరి అన్నపూర్ణగార్లు రెండుసార్లు పాల్గొనడం విశేషం. 1954లో వై.జోగారావు, ఎ.ఎస్. గిరిగార్లు నటించగా 1957లో అవే పాత్రలను ఎ.పుండరీకాక్షయ్య, పేకేటి శివరామ్‌గార్లు చేశారు. వంగర, పుండరీకాక్షయ్య, పేకేటి గార్లు సినిమారంగంలో కూడా ప్రసిద్ధులని గమనించాలి.
శ్రీవాత్సవ విమర్శకులుగా పేరు తెచ్చుకొన్నారు. భారతి, జయంతి, ఆంధ్ర పత్రిక తదితర పత్రికలలో సాహిత్య సింహావలోకనాలు ఏటా ప్రచురించేవారు. ఉష:కిరణాలు, శారదాధ్వజం గ్రంథాలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1966లో బహుమతి ప్రకటించింది. తంజావూరు నాయకరాజుల సాహిత్య భాషను శారదా ధ్వజంలో వివరించారు. ఆనాటి సాంఘిక సాంస్కృతిక రాజకీయ చారిత్రక స్థితిగతులు ఆయన ఆ గ్రంథంలో విశ్లేషించారు. జలతారు జాబిల్లి పేరుతో బాలలకు ఒక పుస్తకం వ్రాశారు. వయోజన విద్యావ్యాప్తిలో భాగంగా టెలివిజన్ కథ రంగురంగుల పూలు అనే గ్రంథాలు వ్రాశారు.
అలనాటి గాయని ఏ.పి.కోమల
రేడియో కార్యక్రమాలు నిర్వహించు యండమూరి సత్యనారాయణ చాలా సుప్రసిధ్ధులు.పాతతరం రేడియో శ్రోతలందరికీ ఆయన గురించి బాగా తెలుసు .ఆయన కార్యక్రమం ప్రారంబం కావడానికి పది నిముషాలు ముందు పాట రాసేవారు .ఆ పాటని అప్పటికప్పుడు నేర్చు కొని ఆమె పడేవారు .దాంతో ఆమె ప్రతిభని గుర్తించి 1944లో రేడియో ఆర్టిస్ట్ ఉద్యోగం ఇచ్చారు .అప్పుడామెకు 50 రూపాయల జీతం .అప్పుడు రెండో ప్రపంచ యుద్దం జరుగుతు ఉండటంతో వార్ అలెవన్సుస్ కింద మరో 14 రుపాయాలు కలిపి మొత్తం 64 రూపాయలు జీతం ఇచ్చారు .ఆమె మొదటి సంపదనే అదే . స్వతంత్రం వచ్చే వరకు ఎప్పటి ట్రిప్లికేన్ నుంచి లాగుడు రిక్షా లో ఎగ్మూరు స్టేషన్ కి వెళ్లి ,రిక్షా అతనికి నెలకి రెండు రూపాయలు ఇచ్చేవారు .అప్పటికి అందరికి తెలిసిన తాత ఉమామహేశ్వర రావు అప్పట్లో రేడియో అనౌన్సర్ గ పనిచేసారు .
త్యాగయ్యలో లో తొలి పాట ……
యామిజాల జగదీశ్
ఇది అరవై ఏళ్ళ పైమాటే. గోరాశాస్త్రిగారు చలంగారిపై అలిగి శ్రీవాత్సవ గారితో ఓ విమర్శ రాయించారు. శ్రీవాత్సవ గారి అసలు పేరు యండమూరి సత్యనారాయణ రావుగారు.
ఈ వ్యాసంతో అప్పట్లో వాదవివాదాలు జరిగాయి. ఈ వివాదాల వ్యవహారాలలో బి.వి. నరసింహారావుగారు, కె.కె. నాయుడుగారు తదితరులు పాల్గొన్నారు.
అయినప్పటికీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారితో శ్రీవాత్సవగారి విమర్శకు ఓ దీటైన జవాబు ఇప్పించడానికి చిన్నారావుగారు, నరసింహారావుగారు, వజీర్ రహ్మాన్ గారు శాస్త్రిగారింటికి వెళ్ళారు.
చిన్నారావుగారు చిత్రకారులు. నరసింహారావుగారు స్త్రీ వేషధారణతో మంచి నర్తకిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం గడించినవారు. రహ్మాన్ గారేమో అప్పుడే కాకినాడలో డిగ్రీ పూర్తి చేసారు. చలంగారంటే గాఢమైన అభిమానమున్నవారు.
ఈ ముగ్గురి విజ్ఞప్తితో శాస్త్రిగారు ప్రజామాతలో సాహిత్యభాణం అనే శీర్షికతో ఓ వ్యాసం రాశారు. “భాణం” అంటే ఇక్కడో మాట చెప్పుకోవలసి ఉంది. సంస్కృత రూపక భేదాలలో ఓ ప్రక్రియ. ఎదుటి వారి పాత్రల సంభాషణలను తనే ప్రస్తావిస్తూ చేసే సంభాషణ. మరొక మాటేమిటంటే, భారవిలో భా అంటే భావుక, ర అంటే రచన, వి అంటే విమర్శ.ఈ విషయం గొర్రెపాటి వెంకట సుబ్బయ్యగారు 1958 ప్రాంతంలో ప్రచురించిన చలం జీవితం – సాహిత్యం అనే పుస్తకంలో ఉన్న విషయాన్ని ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు తమ వ్యాసంలో పేర్కొన్నారు.
ఆ రోజుల్లో శాస్త్రిగారి వ్యాసం ఓ సంచలనం సృష్టించింది.
చలంగారిని విమర్శించిన శ్రీవాత్సవగారు ఈ వ్యాసాన్ని చదివిన తర్వాత శాస్త్రిగారింటికి వెళ్ళి “మీ ప్రతిస్పందన చాలా బలంగా ఉంది” అన్నారు.
మరోవైపు, చలంగారు శాస్త్రిగారికి ఓ ఉత్తరం రాస్తూ చలానికి విలువ కట్టిన రచనగా తెలిపారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-4-22-ఉయ్యూరు