మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -203
· 203-మచి రోజు ,పెళ్లి రోజు సినీ దర్శకుడు ,టీ.వీ .అసిస్టెంట్ డైరెక్టర్ –ఎం.ఎస్.శ్రీరాం
· విజయవాడ రేడియో కేంద్రం లో 1977లో U.P.S.C ప్రోగ్రాం ఎక్సి క్యూటివ్ గా చేరి రెండేళ్ళ తర్వాత కడపకు బదిలీ అయ్యాడు .అక్కడినుంచి మద్రాస్ దూరదర్శన్ కేంద్రానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు .అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పొందాడు .దురదృష్టవశాత్తు అక్కడే మరణించాడు అకస్మాత్తుగా .ఈమని శంకర శాస్త్రి గారికి మేనల్లుడు శ్రీరాం .మంచి సంగీతకార్యక్రమ రూపకర్త .
· సినీ రంగ ప్రవేశం చేసి మంచి రోజు ,పెళ్లి రోజుసినిమలు దర్శకత్వం చేశాడు .వీటి హీరోయిన్ జమున ..సూర్య చిత్ర వారి మంచి రోజులో జమున ,రామకృష్ణ నాయికా నాయికలు .సంగీతం దర్శకత్వం ఎం ఎస్ .శ్రీరాం .కధ-.పిబి శ్రీనివాస్ .మాటలు అప్పలాచార్య –పాటలు ఆత్రేయ ,పిబి శ్రీనివాస్ .
· 1968లో పెళ్లిరోజు చిత్రం విడుదలైంది జమున ,హరనాద్ జంట జమున డబల్ రోల్ గీరోయిన్ ఇందులో .రాజశ్రీ రచన .సంగీతం డైరెక్షన్ –ఎం ఎస్ శ్రీరాం ‘’జమున పాడిన ‘’పెళ్లి వారమండి ఆడపెళ్ళి వారమండి ‘’పాటఆరోజుల్లో సూపర్ హిట్ .
· సశేషం
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-4-22-ఉయ్యూరు