మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –తేనే మనసులు సినిమాలో నటులు -205నుంచి 216వరకు

  మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –తేనే మనసులు సినిమాలో నటులు -205నుంచి 216వరకు

  అంతా కొత్తవాళ్లే నటించిన తోలి తెలుగు చలన చిత్రంబాబూ మూవీస్ ’’తేనెమనసులు ‘’

ముళ్ళపూడి:- 

  బాబూమూవీస్‌ సంస్థ రూపొందింది. ఆంధ్ర దేశాన్ని ఊపివేసిన “మంచిమనసులు” చిత్రం పుట్టింది.

ఆ విజయోత్సాహంలోంచే ఆంధ్రులు ఈనాడు సగర్వంగా “మాది” అని చెప్పకుంటున్న “మూగమనసులు” జన్మించింది. అందులోంచే, రేపు ప్రేక్షకులు, పరిశ్రమ సుహృదయపూర్వకంగా స్వీకరించనున్న బాబూమూవీస్‌ బహుమతి – “తేనెమనసులు” నటబ్బందం రూపొందబోతున్నది. 

     చొరబడ్డపుడు ఆదుర్తికి సుబ్బారావే తోడు. మూగమనసులు” షూటింగుకు పాపికొండల సుడిగుండాల మధ్యకు పడవ మీద వెళ్ళిపోతున్న సుబ్బారావుకు చుక్కాని అదుర్తే. వాళ్ళకి గురి కుదిరితే, మరొకళ్ళ మాటవినరు. అసలు వాళ్ళిద్దరికీ భయం లేదు. యే భయం లేదు. ప్రాణభయం, ఆరోగ్య భయం, డబ్బు భయం లేవు. ఉన్నదల్లా పని గురించిన భయం. పీరు గురించిన భయం. ఒకళ్ళను నొప్పిస్తామన్న భయం. ఇవాళ అర్థబలం అంగబలం, దండిగా ఉండగా ఆయనకెంత ధైర్యసాహసాలున్నాయో, అవి రెండూ లేనినాడూ అంతే ఉండేవి. ఆదుర్తినీ సుబ్బారావునీ వేరుచేసి మాట్లాడడం, పాలూ నీరూ వేరు చెయ్యడంకన్న కష్టం. వ్యక్తిగా ఆయన జీవించే ప్రతి క్షణానికీ దర్శకుడుగా ఆయన చిత్రించే చిత్రం ప్రతి అంగుళం మీద ప్రభావం వుంటుంది. చైతన్యం, వేగం, ఉత్సాహం, ఆనందం వ్యక్తి లక్షణాలు. ఆయన చిత్రాలు కూడా అంత చైతన్యవంతంగా వుంటాయి. గంటకి గంటన్నర వేగంతో పరిగెడతాయి. ఆ చైతన్యం ఆ ఉత్సాహం నీరసంగా కూర్చున్న ప్రేక్షకుడిని కూడా లేపి నిటారుగా కూర్చోబెడుతాయి. జీవితంలో ఆయన ఎన్నో కష్టాలుపడ్డా ఎప్పుడూ ఆనందంగా తిరిగాడు జిడ్డు, తోముడూ ఎరగడు. అందుకే ఆయన చిత్రంలో విషాద సన్నివేశాలు విసుగెత్తకుండా ఉంటాయి. ఆసలు చలన చిత్రాలు ప్రధానంగా ప్రజల వినోదం కోసమేనని ఆయన నమ్మకం. జీవితానికి కూడా అందంగా (ఫ్రేము కడితే చూడడానికి అందంగా ఉంటుందని, అలాగే ఉండాలని ఆయన వాదం. సినిమా కళ కాదని వాదం, ‘కాదుసుమా కళ కాదు సుమా అంటాడు ఆయన నవ్వి కాదన్నంత మాత్రాన కాదని కాదు. నిజమైన కళ అనేది చాలా వ్యక్తిగతమైనది. కొద్దిమందికే అందుతుంది. అందరూ చూసి ఆనందించేది పై అర్థం ప్రకారం ఐతే కళకాదు. ఇదీ ఓ కళే అని ఒప్పుకుంటే, చాలా గొప్ప కళ అంటారు. అందుకే అన్ని వర్గాల స్థాయిల అభిరుచులవారూ ఆనందించదగిన సర్వజనరంజన శృతిలో మేళవించి ప్రస్తరిస్తారాయన.

“తేనెమనసులు”కు కొత్త నటులు కావాలని బాబూ మూవీస్‌ వారు ఒకే ఒక్కసారి ప్రకటన చేయగానే నాలుగైదు వారాలలో ఐదువేల మంది ఫోటోలతో దరఖాస్తులు పంపారు. వారిలో జొత్సాహిక నటులు, విద్యార్థులు, అధ్యాపకులు, ఏడెనిమిది నందల జీతం తెచ్చుకునే పెద్ద ఉద్యోగస్తులు ఎందరో వున్నారు. 

  ‘వీరిలో నుండి నూటయాభై మందిని ఎన్నిక చేసి, వారికి మద్రాసు, హైదరాబాదులలో ్కీన్‌టెస్టులు తీశారు. అంటే ఒక్కొక్కరిచేత ఒక్కొక్క ఘట్టం నటింపచేసి సినిమా తీశారు. ఆ చిత్రాలన్నిటినీ రెండు వారాలపాటు తిరిగి ప్రదర్శించి చూసి వారిలో పన్నెండుమందిని ఎన్నుకున్నారు. వీరుకాక అర్హులు, సమర్జులు ఇంకా ఎందరో ఉన్నారు.

‘తేనెమనసులు’ కథ దృష్ట్యా అందులో పాత్రలకు తగిన వారిని ఎన్నుకోవాలి కాబట్టి, అది ఒక ప్రధాన సూత్రంగా ఈ పన్నెండుగురి యెన్నిక జరిగింది. వీరిలో కొందరికి రంగస్థల అనుభవం వుంది. కొందరికి లేదు. 

అందరికీ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, కో డైరెక్టర్‌ కె.విశ్వనాథ్‌, నృత్య దర్శకుడు హీరాలాల్‌ మూడు నాలుగు మాసాల పాటు శిక్షణ ఇచ్చారు. కూర్చొనడం, లేవడం, నడవడం దగ్గర నుండి నృత్యాల వరకూ నేర్పారు. సంభాషణలు చెప్పడం, నటించడం రెండూ పరస్పర సమన్వయంతో నడపడం వగైరాలు నేర్పారు. 

నటులందరూ ఉత్సాహవంతులు, సమర్జులు. ఆసక్తితో అన్నీ నేర్చుకున్నారు. కష్టపడి సాధన చేశారు. ఈ కృషి అంతా కలిసి అత్సంత మనోహరమైన “తేనెమనసులు” రూపం దాల్ఫింది. 

·         205-సుకన్య

·         ఇందులో భానుమతి పాత్రను ధరించింది. గోదావరి నడి బొడ్డున కల రాజమండ్రిలో పుట్టింది. విజయనగరంలో చదువు సంజెలు నెరిపింది. తిరిగి రాజమండ్రి చేరింది. నాటకానుభవం బొత్తిగా లేదు. కాని సినిమాల్లో ఛాన్సు లభిస్తే నటించాలనే మనసు వుండేది. అందుకే ఈ అమ్మాయికి “తేనెమనసులు” ఛాన్సు కష్చిదది ఆదుర్తి సుబ్బారావు ప్కీన్‌ టెస్ట్‌ చేసి -“అమ్మాయి, నీవు సెలక్ట్‌ అయ్యావు, నెక్టు టబ్రైనులో బయలుదేరి రా ‘ అన్నారు. టెలిగ్రామ్‌ చేరిన తరువాత “%వచ్చిన వన్స్‌ టైన్‌లోనే బయలుదేరి సక్సెస్‌ అయ్యింది. భానుమతి పాత్రలో నటించి – సైకిలెక్కి చక్కరకొడ్డూ మనల్ని చక్కలిగింతలు పెడ్తుంది. 

·           తర్వాత చాలా సినిమాలలో నటించింది

·         206-సంద్యారాణి

·         ఈ+ రాణి కృష్ణానదీ తీరాన, ఆంధ్రదేశం నడుమ వున్న విజయవాడ నుండి వచ్చింది. పియు.సి. చదువుకుంది. ఆటా వచ్చు, పాటా వచ్చు. తెలుగే కాక ఇంగ్లీషు, హిందీ, బెంగాళీ భాషల్లో క్షుజ్ణంగా మాట్లాడగలదు, పోట్లాడగలదు. అయితే ఈ చిత్రంలో చాలా ఓర్పుగా, నేర్పుగా నటించింది. ఈ [ అమ్మాయికి నాట్యంగూడా బాగా వచ్చు. హైస్కూలులో ఓ మారు ఓ నాటకంలో వాళ్లందర్ని ఆడియన్స్‌గా కూర్చోబెట్టి – తానే పెద్ద పెద్ద వేషాలు వేన్తూ అభినయిన్లూ వెప్పిన్తూండేది. సినిమాలంటే చిన్నప్పటినుండి తెగ పిచ్చీ, తరగని పిచ్చీ కావటం వల్ల నటించాలనే అభిలాష పెచ్చు పెరిగి పోయింది. రానీ అయితే మొదటి షూటింగునాడు గద్గద స్వరంతో చెప్ప వలసిన డైలాగు చెప్పలేక అధైర్య పడి పోయింది.డైరక్షరూ, కో డైరక్షరూ ఎంతగానో ధైర్యం నూరి పోశారు. ఆమెయే స్వయంగా లెక్కకు మించిన గ్లాసులు మంచినీళ్లు, కాఫీ గట్రా తాగి నంటబట్టించుకుని ఆ సన్ని వేశాన్ని అవలీలగా నటించి వేసింది. ఇహ ఈవిడకు నటన వెన్నతో పెట్టిన విద్యయి కర్చురది, సంధ్యారాణి సినిమా రాణి అయి కూర్చుంది. ‘తేనెమనసులు”లో సీతగా నటించింది.

·          తర్వాత ఇద్దరుమోనగల్లు ,మరపురాని కధ,శ్రీకృష్ణావతారం ,సుడిగుండాలు ,నేనేంటే నే నే ,వి౦తకాపురం ,ప్రతీకారం ,పగసాధిస్తా బస్తీ కిలాడీలు ,ప్రేమ జీవులు ,బస్తీ బుల్ బుల్ ,శ్రీకృష్ణ విజయం ,శ్రీ కృష్ణ సత్య ,మహమ్మద్ బీన్ తుగ్లక్ ,స్త్రీ గౌరవం సినిమాలలో నటించింది .అక్కినేని ఆదుర్తి కలిసి తీసిన సినిమాలలో హీరోయిన్ గా సమర్ధవంతంగా నటించింది .

·         207-రామ్మోహన్

·         ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్రను నటించినా – ఇద్దరు అమ్మాయిలను (సంధ్యారాణి, సుకన్య) అమాంతం ప్రేమించేసి, ప్రేమింప చేసుకున్న గట్టి వాడు! పాపం చిన్నప్పుడు ఒకటో అరో నాటకాల్లో నటించి వుంటాడు. అంతకు తప్ప మళ్లీ ప్రాయం వచ్చాక స్టేజీ ఎక్తీ ఎరుగడు. , ఇంటరీ శడియట్‌ చదువుకుని హైదరాబాద్‌ విమాన నంన్బలో వెకానిక్‌గా వని మద్రాసు చేరింది. సినిమాల్లో నటించాలనే అభిలాష  చేస్తుండేవాడు. సినిమాల్లో నటించాలనే అభిప్రాయం బలమై కూర్చుంది. అసలే కండలు దీరిన మనిషి బలవంతుడైనప టికీ – ఆ అభిప్రాయం ధాటికి తట్టుకోలేకపోయాడు. వెంటనే “తేనె లు కొత్త తారల ప్రకటనకు దరఖాస్తు వేశాడు. ఛాన్సు వచ్చింది. అయితే మొదటి రోజు సెట్టులో తీసిన చిత్రాన్ని (రషెస్‌) చూసిన తర్వాత బలేగా ఖంగారు పడిపోయాడట. తెరపై జూసుకుని గజగజ వణికి పోయాడట. తనేమో సరిగ్గా చేయలేదేమో అనుకున్నాడట. సరిగ్గా చేయకపోతే డైరక్షరు “ఓకె అంటాడా? బడిలో పిల్లాడికి చెప్పినట్లు చెప్పడం-తన్నో నటునిగా తీర్చి దిద్దినదంటాడు. నదురూ బెదురూ లేకుండా నటించాడు.

·         208-కృష్ణ

·         ఈ+ అబ్బాయిది తెనాలి. కామ్‌గా బి.కామ్‌. చదివాడు. కొద్దిగా నాటకానుభవం ఉంది. సినిమాల్లో నటించాలనే అనుభవమూ ఉంది. అందుకే కొన్నాళ్లు మద్రాసులోని టి.నగర్‌ వాసాలను పట్టుకుని తిరిగే “షె వాడు. సరియైన అవకాశం చిక్కక తానూ చిక్కి తెనాలి చేరుకున్నాడు. ఆ లోగా బాబూ మూవీస్‌ వారి ప్రకటన వచ్చింది. దరఖాస్తు వేశాడు. ఖా రమ్మంటే రమ్మన్నారు. నటించాడు- యన నర్తించాడు కూడా. నృత్యం చేసేటప్పుడూ, పాటకు లిప్‌మూమెంట్‌ యిచ్చేటప్పుడూ చాలా కష్టపడ్డానంటాడు. నృత్య దర్శకుడు 1 1 హీరాలాల్‌, దర్శకుడు శ్రీ సుబ్బారావు, కో దర్శకుడు విశ్వంగారలు తన్ను గురించి – నటనలోని మెరుగులను గురించీ చాలా కష్టపడ్డారంటాడు. చిత్రం పూర్తయిన తరువాత తన నటనను చూసుకుని చాలా తేలిక టలు కృష్ణు ఇందులో బసవరాజుగా నటించాడు. ( ఈ ఘట్టమనేని శివరామకృష్ణ సూపర్‌స్టార్‌ అవడం, అలా సూపర్‌స్టార్‌ అవడానికి ముందు జరిగిన ఆ ఘట్టాలన్నీ అందరికీ తెలిసినవే. ఈ సినిమాలోని “వన్‌ టూ త్రీ ఫోర్‌ పాటలో తనకు – ప్రముఖ హాస్యనటుడు, ఆ తర్వాత దర్శకుడూ అయిన పద్మనాభం ప్లేబ్యాక్‌ పాడరని కృష్ణగారికి అప్పట్లో తెలియదట. ఈ విషయం “హాసం” ద్వారానే తెలుసుకున్నానని ఆయన అన్నారు. ఆ వివరాలు హాసం 25వ సంచికలో చదివిన పాఠకులకు గుర్తుండే ఉంటుంది.)   

·          

·         తర్వాత కృష్ణ ఎంత ఎదిగాడో ఎన్నెన్ని సినిమాలలో నటించాడో నిర్మించాడో డైరెక్ట్ చేశాడో మనకు తెలుసు .కృష్ణ ఒక సినీ సామ్రాజ్యాన్నే సృష్టించాడు స్వయం శక్తితో

·         209-పి.వెంకటేశ్వరరావు

·         “ఈయనది మచిలీవట్నం. హిందూ కళాశాలలో బి.ఏ. ప్యాన్‌ అయ్యాడు. . పూనాలో ఎం.ఏ. చదివారు గానీ పూర్తి చేయలేదు. ఒకటిన్నర దశాబ్దాల నుంచీ నాటకాల్లో నటిస్తున్నారు. ఆంధ్ర నాటక కళాపరిషత్తులోనూ, ఇతర పరిషత్తుల్లోనూ |] మూడు నాలుగు సార్డు ఉత్తమ హాస్య . నటునిగా బహుమతులను పొందారు. | ఇదేమిటి” నాటకంలోని ప్రసాద్‌ | “పాత్రకు వీరినే ఘనంగా చెప్పుకోవాలి. లా ఆ నాటకాన్ని శ్రీ ఆదుర్తి సుబ్బారావు చూసి న అవకాశాన్నిచ్చారు. పైగా ఆ నాటకం నాడే వాగ్దానం కూడా చేసేశా వేషమిస్తానని. ఉద్యోగం విజయవాడలో – పోస్టు అండ్‌ కల్‌ “తేనెమనసులు’లో చిట్టిబాబు అన్న రంగారావుగా “నస ఊత పదంతో గిలిగింతలూ పెట్టారు. 

 తర్వాత చాలా సినిమాలలో కేరక్టర్ యాక్టర్  గా జీవించాడు రంగస్థలం కళాకారుడు, నటుడు పి. వెంకటేశ్వర రావు(90) కన్నుమూశారు. గత ‍ కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య లక్ష్మీ, ఏడుగురు పిల్లలు ఉన్నారు.  పి.వెంకటేశ్వర రావు పూర్తిపేరు పిసుపాటి వేంకటేశ్వర రావు. తొలుత రంగస్థలం కళాకరుడిగా పరిచయం అయిన ఆయన తేనె మనసులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు.ఆ తర్వాత కన్నెమనసులు, ఆత్మీయులు, మరోప్రపంచం, సుడిగుండాలు, మట్టిలో మాణిక్యం, ముత్యాలముగ్గు వంటి అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. గతంలో ఇదేమిటి అనే నాటకంలో నటించి ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు అందుకున్నారు.

210- జి ఎస్.ఆర్ మూర్తి

 ఈశయనది విజయవాడ. ర.స.న, సమాఖ్యలో రాటుదారిన మనిషి ముదిగొండ లింగమూర్తి వ్రాసిన “ఎంకన్న కాపురం” నాటకంలో వెంకన్నగా మద్రాసులో నటించి, అందర్నీ మెప్పించి ఉత్తమ నటుని బహుమతిని పట్టుకుపోయారు. “రాగరాగిణి” నాటకంలో కూడా ప్రశంసనీయంగా నటిస్తారు. 927 నంలో జన్మించారు. “తేనె జ్ర మనసులు’లో నరసరాజుగా నటించారు. వీరి పేరు గిడుగు సీతారామచంద్రమూర్తి, ఎన్‌.ఎన్‌.ఎల్‌.ని.చదివిన .తరువాత విశాఖపట్నంలో కొంతకాలం, మిలటరీలో కొంతకాలం చేశారు. ఉద్యోగం విజయవాడలోని ఆంధ్రా సిమెంటు కంపెనీలో. ఈయన ‘దొంగ వీరుడు” నాటకంలో వృద్ద జమీందారు పాత్రను అమోఘంగా నటిస్తారు. 1005ు పైగా సార్లు ఆ నాటకాన్ని ప్రదర్శించి వుంటారు.

211-పుష్పకుమారి

 కృష్ణా జిల్లా గుడివాడ తాలుకా విన్నకోట [గ్రామంలో పుట్టింది. గుడివాడలో పెరిగింది. ప్రస్తుతం మకాం కూడా స్ట ఆ గుడివాడే! నాట్యం బాగా వచ్చు. చాలా నాటకాల్లో నటించింది. అనేక పరిషత్సభలలో నేక సమాజాల వారితో పాల్గొని – లెక్కకు మించిన బహుమతులను సంపాదించింది. తీరిక సమయాలలో సినిమా చూడటం హాబీ అయి -ఆఖరికి నినిమాల్లో నటిస్తే , బాగుండుననే నిర్ణయానికి వచ్చింది. …తేనెవుననులు’ చితం ఆ వరాన్ని ౯ ప్రసాదించింది. మనకు వరంగా (వరలక్ష్మి) ఈ చిత్రంలో ఈమె సాక్షాత్కరిస్తుంది. –

 తర్వాత బాపు విక్టరీ మధుసూదనరావు విఠాలాచార్య ,విశ్వనాద్,బానుమతి విజయనిర్మల ,బిఎ సుబ్బారావు మొదలైన దర్శకులవడ్డ అగ్రశ్రేణి నటీ నటులతో నటించింది .కొన్ని సినిమాలు –ఆత్మగౌరవం అవేకళ్ళు ,బ్రహ్మ చారి ,మంచి కుటుంబం ,భలేరంగడు విచిత్ర కుటుంబం ,బాలరాజు కధప్రేమ నగర్ ,కాలం మారింది ,సతీసావిత్రి ,శుభలేఖ వగైరా .

212-ఎం.వి.చలపతి రావు

ఆస్తమానూ అడ్డగాడిదా, గాడిదా అంటూ భార్యా బిడ్డల్ని గాడిదల్ని చేస్తూ వచ్చే వీరభద్ర స్వామి పాత్రను ధరించాడీయన. విజయవాడ రైల్వేలో ఉద్యోగం. ఈయన చాలా పొట్టి మనిషే అయినా నటనలో మాత్రం గట్టి థ్‌ మనిషి – గడుగ్గాయి. నాటకాల్లో నటించడమంటే స్మ మహా పండుగ ఈయనకు. బందరులో 1 ప్రదర్శించిన “ఇదేమిటి హాస్య నాటికలో ప్రెసిడెంటు వేషం వేశాడు. ఈ వేషం, సి అభినయం శ్రీ ఆదుర్తి సుబ్బారావు కి బాగా ఖా. నచ్చింది. అదే ‘తేనెమనసులు’ చిత్రంలో అవకాశం లభించడానికి మార్గమయ్యింది. ఈయన అనేక పరిషత్తులలో పాల్గొని ఉత్తమ హాస్య నటునిగా బహుమతు లందుకున్నారు. 

తర్వాత ఇలాగే ముసలి పాత్రలు చాలాధరించాడు .

213–రాధాకుమారి

ఈ+మెది విజయనగరం. విజయనగరం రాఘవ నాటక పోటీల్లో పాల్గొని చాలాసార్లు ఉత్తమ నటిగా బహుమతులను తెచ్చుకుంది. నవ్వించే వేషాలు, కవ్వించే వేషాలు, ఏద్బే వేషాలు, ఏడిపించే వేషాలు, హాస్య వేషాలు, లాస్య వేషాలు, గయ్యాళి వేషాలు, నెయ్యాలి వేషాలు లాంటివన్నీ వేసింది

   గతంలో హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ప్రదర్శించిన ‘నాలుగిళ్ల చావడి’ పాత్రను నటించి – ఉత్తమ నటిగా బహుమతిని ‘ నంపాదించింది. ఈ చిత్రంలో , నాగరత్నమ్మగా కనిపిస్తుంది. (ఈ కుమారి . ప్రముఖ నటుడు, రచయిత అయిన రావి జీ కొండలరావు గారికి శ్రీమతి కూడా. ఇటీవల విడుదలైన ‘ఒకరికి ఒకరు’ చిత్రంలో బామ్మగా వేసిన సంగతి పాఠకులీపాటికి గుర్తు పట్టివుంటారు.)

 -గయ్యాళితనం, సాత్వికత్వం ఇవి రెండూ కలబోసిన పాత్రల్లో నటించి మెప్పించారు. సహాయనటిగా, హాస్యనటిగా తెలుగు తెరపై తనదైన ముద్రవేసారు. ఇప్పటి వరకు ఈమె సుమారు 400కి పైగా సినిమాలలో నటించి అందరి మన్ననలు పొందింది.కేవలం చలనచిత్రాల్లోనే కాకుండా పలు ధారావాహికల్లోను నటించారు. అనువాద కళాకారిణిగానూ ఆమె వంద సినిమాలకు పనిచేసారు.

ఈమె మొదటిసారిగా ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో అందరూ నూతన తారలతో తయారైన తేనె మనసులు (1965) సినిమాలో నటించింది. ఈ చిత్రంలో 20 ఏళ్ళ వయసులో హీరో కృష్ణ కు సవతి తల్లిగా నటించి మెప్పించింది.

కొంతకాలం విరామం తర్వాత మరla 2002 నుండి తిరిగి డి. రామానాయుడు పిలుపు మేరకు నువ్వు లేక నేను లేను తో సినిమాలలో నటించడం ప్రారంభించారు

శ్రీ కృష్ణ విజయం ,మొల్ల ,విచిత్రబంధం ,కన్నెమనసులు రంగులరాట్నం ,బృందావనం వగైరా .

214-కోనేశ్వరరావు

పసితనంలో కోనేశ్వరరావు పదిమంది మాటా, చేతలను అనుకరించి – అభినయించి మెప్పించడాన్ని నేర్చుకున్నాడు. ఆ ఉత్సుకత, ఉత్సాహము మ… నాటకాల్లో నటునిగా చేసింది. బందరులోని _ వసంతవనిలో సభ్యునిగా వుంటూ “అపరాజిత, . ‘ఫణి” ఆదిగా గల నాటకాల్లో వేషాలు వేసి ‘ పరిషత్సభలలో పాల్గొని ప్రజులు సంపాదించాడు. ‘. ఇంటర్‌మీడియట్‌ చదువుకున్నాడు గాని ఉద్యోగాలేవీ చేయలేదు. సినిమాల్లో నటిద్దామనే క్షే పనిగా పెట్టుకుని – కొన్నాళ్లు మద్రాసులో మకాము పెట్టి తిరిగి బందరు చేరుకున్నాడు. అదృష్టం బాగుండి ‘తేనెమనసులు’లో అవకాశం లభించి – శ్రీనివాసరావు పాత్రను ధరించాడు. అనేక పర్యాయములు మద్రాసులోని ఏ.ఐ.ఆర్‌. నాటకాల్లో పాల్గొన్నాడు.

215-వాణీ బాల

ఈమెది కూడా మచిలీపట్నమే! ‘వసంతవని” నాటక సమాజంలో సభ్యురాలే! అనేక నాటకాల్లో అనేక పాత్రలను ధరించి విశేషంగా బహుమతులను పుచ్చుకుంది. విజయవాడ, మద్రాసు,ఢిల్లీ, హైదరాబాద్‌, బొంబాయిల్లాంటి నగరాలల్లోని రంగ స్థలాలపై అనేక నాటకాల్లో ప్రధాన పాత్రలు ధరించింది. మద్రాసులో ప్రదర్శించిన “అపరాజిత నాటకంలో ఉత్తమనటిగా ఎన్నుకోబడింది. “తేనెమనసులు’లో జానకమ్మగా నటించింది.

216-రోజారాణి

  స్ఫంతవూరు తెనాలి అటగాని కొంతకాలం వీళ్ల నాన్నగారు మద్రాసులో పనిచేశారట. అప్పుడే యీ రోజా ఆదివారం రోజున జరిగే పిల్లల రేడియో కార్యక్రమాల్లో పాల్గొంటూండేదట. ఇప్పుడు హైదరాబాద్‌లో పదో క్లాసు చదువు కొంటోంది. బడి నాటకాల్లో వేషాలు వేసింది. కాబట్టి సినిమాల్లో కాస్తా బాగుండునని తలంచింది. మరి ఎలాగా? “తేనె మనసులు” చిత్రంలో “చిన్ని” అనే చిన్న వేషాన్ని యిచ్చారు. చాలా పెద్దగా చేసి పెద్దల్ని, చిన్నల్ని మెప్పించింది. (తర్వాత ఈ అమ్మాయి పెరిగి పెద్దయ్యాక హైద్రాబాద్‌ దూరదర్శన్‌లో ఉద్యోగం చేస్తూ ఆ చిన్ని తెరపై కూడా ఎన్నోసార్లు కనిపించి, అక్కడే పనిచేస్తున్న శాంతిస్వరూప్‌ని వివాహం చేసుకుంది.)

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-4-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.