మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –222
222-సెభాష్ సత్యం సంగీత దర్శకుడు ‘’మెకోలమెకోలా బం బుక బం ‘’పాట ఫేం –విజయా కృష్ణమూర్తి
శభాష్ సత్యం
ఈ చిత్రంలోని పాటలకు విజయా కృష్ణమూర్తి సంగీతం కూర్చాడు.జి.విశ్వనాధం దర్శకుడు .మాటలు ఆత్రేయ రాస్తే ,పాటలు ఆత్రేయ ,దాశరధి ,కొసరాజు రాశారు .కృష్ణ ,రాజశ్రీ జంట .
No. Title Lyrics గాయకులు Length
1. “నాలో నిన్ను చూడు” పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:00
2. “మెకొలా మెకొలా బుం బుంక బుం” పి.సుశీల 5:00
3. “ఇటు రావె రావె బంగారు చిలకమ్మ” ఎల్.ఆర్.ఈశ్వరి, ఎ.ఎల్.రాఘవన్ 2:35
4. “కలలు నిజాలై కనులు వరాలై” పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:00
5. “ఎక్కడికో ఎందుకో ఈ పరుగు” ఘంటసాల 5:00
6. “కాలు వేసావా కాటు వేస్తాను” పి.సుశీల
· 223-గులేబకావళి సంగీత దర్శకుడు ‘’నన్ను దోచు కొందువటే వన్నెల దొరసాని ‘’’’’మదనా సుందర నా దొరా ‘’’సలామ లెకుం సాహెబుగారు ‘’పాటల ఫేం –జోసెఫ్ కృష్ణ మూర్తి
గులేబకావళి కథ
· నేషనల్ ఆర్ట్ ధియేటర్ నందమూరి త్రివిక్రమ రావు నిర్మాతగా యోగానంద్ దర్శకత్వం లో రామారావు ,జమున నటించిన ఈ చిత్రం లో సినారె తోలి సారి తెరంగేట్రం చేశాడు .’’నన్నుదోచు కొందువటే వన్నెల దొరసానీ ‘’సాంగ్ సూపర్ డూపర్ హిట్ .కధ,మాటలు సముద్రాల .జమున యుక్తిమతి గా ,నాగరత్నం బకావలి గా నటించారు ఈ చిత్రకథను మూకీ చిత్రంగా ఒకసారి (1924), హిందీలో రెండు సార్లు (1932, 1963), తమిళంలో రెండు సార్లు (1935 1955), పంజాబీలో ఒకసారి (1939), తెలుగులో రెండు సార్లు (1938, 1962) లో నిర్మించారు.
ఈ సినిమాకు సంగీతదర్శకత్వం జోసెఫ్ కృష్ణమూర్తి వహించగా, పాటలన్నీ సి.నారాయణ రెడ్డి రాశారు. జోసెఫ్ కృష్ణమూర్తికి సంగీత దర్శకునిగానూ, సినారెకు గేయ రచయితగానూ ఇదే తొలిచిత్రం.[2]
· అంబా జగదంబా నా ఆర్తినే ఆలించవా.. ఏడి నా కన్నయ్య - పి. లీల
· అనురాగపయోనిధి ఓ జననీ నీ పదమేనమ్మి ( పద్యం) - ఘంటసాల
· ఈ ఆటలింక సాగవు మాముందు దొరబాబులంతా బందీలికముందు - ఎస్. జానకి బృందం
· ఉన్నది చెబుతా వింటారా నే నన్నది ఔనని అంటారా - బి.వసంత బృందం
· ఒంటరినై పోయాను ఇక ఇంటికి ఏమని పోను - ఘంటసాల
· ఓ మదనా సుందరా నా దోరా నామది నిన్నుగని పొంగినదిరా - పి.సుశీల
· కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై ఎగసిపోదునో చెలియా - ఎస్.జానకి, ఘంటసాల
· - రచన: సి.నారాయణ రెడ్డి; గానం: ఘంటసాల, పి.సుశీల
· మాతా జగన్మాతా ఓ మాతా జగన్మాతా నీకన్నా లోకంలో నాకెవరు - ఘంటసాల
· సలామాలేకుం సాహెబుగారు బలే షోకుగా వచ్చారా - ఎస్. జానకి, ఘంటసాల బృందం
· విన్నావా తత్వం గురుడా కనుగొన్నావా సత్యమ నరుడో నరుడా - బి. గోపాలం
· సశేషం
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-22-ఉయ్యూరు
·