మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –217
217-‘’ఎన్నాసారు వాడూ డైలాగ్ ఫేం ,’’మీ అమ్మావాడు నాకోసం కని’’ ఉంటాడు ‘’’’పాట ఆగిందా మీ ఆట గోవిందా ‘’సాంగ్ ఫేం విలక్షణ హాస్యనటుడు –కెవి.చలం
మద్రాసు తెలుగు యాసను పట్టుకుని హాస్యం కలిపి ప్రాచుర్యం కల్పించి నవ్వించిన హాస్యనటుడు కె.వి.చలం. మామూలుగా అతను సరదాగా ఆ మాటలు మాట్లాడుతూ జోక్స్ చెప్పేవాడు. అల్లూరి సీతారామరాజు (1974) చిత్రంలోని పిళ్లే పాత్ర ఆ తెలుగులోనే మాట్లాడుతుంది. కె.వి.చలం ఆ పాత్ర ధరించి, ఆ భాష మాట్లాడ్డంలో గట్టివాడనిపించుకుని పేరు తెచ్చుకున్నాడు. అలాగే శివరంజని (78) సినిమాలోనూ చిత్రనిర్మాత పాత్రలో బాగా నవ్వించాడు. ఆ మాటలతో ఆ సినిమాలో ” మీ అమ్మావాడు నాకోసం కని ఉంటాడు” అనే పాట కూడా వుంది. (యాసతోనూ ఆ భాషలోనూ పాడింది బాలసుబ్రహ్మణ్యం) చాలా అలరించింది.
సినీ జీవితం
·
చలం ముందు చిన్న చిన్న వేషాలు వేసినా, మొదటి నుండి హాస్యనటుడు కాడు. చిన్నప్పుడే కొంత నాటకానుభవం ఉంది. వ్యాపారరీత్యా మద్రాసు వచ్చాడు. మద్రాసు వచ్చిన తరువాత సినిమాల మీద మోజు పెంచుకున్నాడు. మద్రాసులో కూడా చిన్న చిన్న నాటకాల్లో వేశాడు. డాక్టర్ రాజారావు గారి బృందంలో నటించాడు. ఇంకొకరి ‘యాస’లో మాట్లాడ్డం సరదా ఉండేది. దాని కోసం చాలా సాధన చేసేవాడు. చలం విచిత్రమైన యాసలలో మాట్లాడటం చూసి హాస్య పాత్రలు ఇచ్చారు.
పేరు తెచ్చిన సినిమాలు
విజయావారి హరిశ్చంద్ర (1965)లో చిన్న వేషంలో కనిపించడంతో సినిమా ప్రవేశం జరిగినా, తేనె మనసులు (1965)తో బాగా తెలిశాడు. అందులో ఇంగ్లీషును తెలుగులా మాట్లాడే మేనేజరు వేషం వేసి “కమ్ము హియరూ, వాడ్డూయూ వాంటూ” అని చెప్పిన సంభాషణలకు చక్కటి నవ్వు వచ్చింది. అలాగే అతను బందిపోటు దొంగలు (1968) లో కూడా ‘మిస్టర్ అమెరికా’ అనే పాత్ర ధరించాడు. వచ్చీరాని తెలుగులో, ఇంగ్లీషు కలుపుతూ మాట్లాడే ఈ పాత్ర కూడా అతనికి రాణింపు తెచ్చింది. అక్కడి నుంచి కె.వి.చలం కమేడియన్‌గా మారి, వందకు పైగా చిత్రాల్లో హాస్య పాత్రలు ధరించాడు. కన్నెమనసులు (1966), స్త్రీ జన్మ (1967), నేనంటే నేనే (1968), మరపురాని కథ, మనుషులు మారాలి, ప్రేమకానుక, భలే రంగడు (1969), పెద్దక్కయ్య (1970), వంటి చిత్రాల్లో హాస్యం మిళాయించిన పాత్రలు చేసి పేరు తెచ్చుకున్నాడు.దాసరి చిత్రం చిల్లరకొట్టు చిట్టెమ్మలో పాత్ర కె.వి.చలానికి మంచి పేరు తెచ్చింది.ఈయన కుమార్తె ‘దేవి’ కొన్ని చిత్రాల్లో నటించింది.
శైలి
చలం హాస్యం అనగానే అతిగా చేసేవాడు కాదు. ముఖ్యంగా సంభాషణ చెప్పడంలో తమాషా చేసేవాడు. భాషేమిటో తెలియనీయకుండా, చైనా, రష్యాలు, మలయాళం, బెంగాలీ మాట్లాడేవాడు. ఆ భాష వరసా, తీరూ అంతా సహజంగా వుండడంతో అతనికి ఆ భాష వచ్చుననే అంతా అనుకునేవాళ్లు. అతని కృషి అంతా అందులోనే. ఆ భాషలతో కాకపోయినా, మామూలు హాస్యపాత్రలు కూడా నటించాడు.
మరణం
సరదాగా మాట్లాడుతూ, తానూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ తిరిగిన కె. వి. చలం- దుర్మరణం పొంది అందర్నీ దిగ్భ్రాంతుల్ని చేశాడు! రాత్రివేళ, రైలుపట్టాలు దాటుతూ ఎలక్ట్రిక్ ట్రెయిన్ కింద పడి చలం ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెల్లారేసరికి విని, సినిమారంగం నివ్వెరపోయింది. అతని అకాలమరణానికి ఎంతగానీ బాధపడింది. అతని అంతిమయాత్ర చాలా గొప్పవాడికి జరిగినంత ఘనంగా జరిగింది. దాసరి నారాయణరావు పూనుకొని, ఘనమైన వీడ్కోలు జరిపించి, అతని కుటుంబాన్ని ఆదుకున్నారు
సెట్స్ లో విడిగానూ స్పాంటేనియస్ గా డైలాగ్స్ కూర్చుకొని చెప్పటం చలం ప్రత్యేకత .ఒక సినిమాలో దాసరి ఆయనకు డైలాగులు రాయకుండా ‘’నువ్వే ఎదో ఒకటి మాట్లాడు ‘’అంటే అప్పటికప్పుడు సృష్టించిమాట్లాదిందర్నీ పగలబడి నవ్వేట్లు చేశాడు .ఒకసారి ఎవరో పెద్దాయన చనిపోతే దినం రోజునసినీ ప్రముఖుల్ని అందర్నీ ఆహ్వానించారు శోభన్ చలం కూడా ఉన్నారు .పిండాలను పళ్ళెం లోపెట్టి కాకులకోసం ఎదురు చూస్తుంటే అవి రావటం లేదు .అందరూ ఆకలితో ఉన్నారుఇన్తలొ చలం ‘’అవేమన్నా చలం ,మాడా లనుకోన్నారా పిలవగానే పరిగెత్తుకు రావటానికి ?’’అనగానే నవ్వులే నవ్వులు .శోభన్ ఎప్పుడూ చలాన్ని పిలిపించుకొని అతని స్పాంటేనియస్ జోకులతో చక్కగా కాలక్షేపం చేసేవాడు
చిలకా గోరింక సినిమా షూటింగ్ లో కొత్తహీరో కృష్ణం రాజు ఎస్వి రంగారావు కు దళాగ్ ఎలాచేప్పాలో చెప్పగాఎక్కదొ మండి,ఆయన భీష్మించుకు కూర్చుంటే ఎవరికీ ఏమి చేయాలో తోచకపోతే చలం వెళ్లి రంగారావు తో ‘’మీకు సలహైస్తే ఇక్చాదుకానేఆ కొత్త హీరో నాకు సలహైస్తాడేమిటండీ’’అనగానే రంగారావు పిచ్చగానవ్విశూటింగ్ కొనసాగించాడు .తనమీద తను జోకులు వేసుకోవటం కూడా చలం ప్రత్యేకత .అజాత శత్రువు .అలాంటి కెవి చలం దారుణంగా చంపబడ్డాడు .ఆ మిష్టరీ విడిపోలేదు.రైల్వే యాక్సి డెంట్ మాత్రం కాదు .
తెలుగు చిత్ర పరిశ్రమ లో ఏ జనరేషన్ లో అయినా డజన్ల కొద్దీ కమెడియన్స్ ఉండటం చాల సహజం అయిన విషయం, కానీ ఎవరి ప్రత్యేకత వారిది, పద్మనాభం, రాజబాబు, చలం, సమకాలికుడు అయిన కే.వీ.చలం తన తమిళ యాస తెలుగు తో చాల పాపులర్ అయ్యారు. కే.వి. చలం గారు కొన్ని విదేశీ భాషలు కూడా మాట్లాడే వారు తెలియని వారు నిజమయిన భాష అనుకొనే విధంగా భ్రమింప చేసే వారు, అయన సెట్ లో ఉంటె నవ్వులే నవ్వులు.కే.వి.చలం గారు వ్యాపార రీత్యా మద్రాసు చేరారు, కానీ విధి మరియు నటన పట్ల ఆయనకు ఉన్న మక్కువ సినిమా వైపు నడిపించింది.అల్లూరి సీతారామ రాజు, శివరంజని చిత్రాలలో వారు పోషించిన తమిళియన్ పాత్రలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి.దాసరి గారు కే.వి. చలం గారికి మంచి మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. అందాల నటుడు శోభన్ బాబు గారి కి అత్యంత సన్నిహితం అయినా నటుడు కే.వి.చలం గారు. వెండి తెర మీద బయట కూడా నవ్వులు పూయించిన కే.వి.చలం గారి జీవితం అర్ధాంతరం గ కోడంబాకం రైల్వే ట్రాక్ పైన ముగిసిపోయింది. అయన జీవితం ఒక నవ్వుల పుష్ప గుచ్ఛం అయితే, అయన మరణం మాత్రం ఒక మిస్టరీ గ మిగిలింది. తెలుగు చిత్ర పరిశ్రమను విషాదం లో ముంచిన అయన మరణం చివరగా అయన అంతిమ యాత్ర కూడా ఒక సినిమా కు పనికి వచ్చింది.మరణించే వరకు నటించటం కాదు, మరణానంతరం కూడా తేరా మీద కనిపించిన ఒకే ఒక నటుడు కే.వి. చలం గారు. అయన చనిపోయిన టైం లో దాసరి గారి డైరెక్షన్ లో “అద్దాల మేడ” అనే సినిమా లో నటిస్తున్నారు, ఆ సినిమా ఇతివృత్తం మొత్తం ఒక సినిమా షూటింగ్ ఆధారితం, అవుట్ డోర్ షూటింగ్ కోసం ఒక గ్రామానికి వెళ్లిన చిత్రం యూనిట్ కు విచిత్రం అయినా అనుభవాలు ఎదురు అవుతాయి. తనకు అత్యంత ప్రీతిపాత్రుడు అయిన చలం గారి మరణం కూడా అక్కడ జరిగిన ఒక సంఘటన గ చిత్రీకరించారు దాసరి గారు.మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ పాలుగొన్న అయన అంతిమ యాత్ర ను చిత్రీకరించి ఆ సినిచిత్రీకరించి ఆ సిని మా లో చూపించారు దాసరి గారు. ఇంత కంటే గొప్ప నివాళి ఏముంటుంది ఒక నటుడికి.