· 221-దేవ దాసు ,లైలా మజ్ఞు సంగీత దర్శకత్వ ఫేం –సి ఆర్ .సుబ్బరామన్
మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –221
· సి.ఆర్.సుబ్బరామన్ లేదా సి.ఆర్.సుబ్బురామన్ (1921 – 1952) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. వీరు చిన్ననాటి నుండే ప్రతిభావంతులుగా హార్మోనియం వాద్యంలో నిపుణత పొంది హెచ్.ఎం.వి. మ్యూజిక్ కంపెనీలో హార్మోనిస్టుగా సేవలు అందించారు. పియానోలో కూడా పట్టు సాధించారు. సుబ్బరామన్ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు సంతతికి చెందినవాడు.[1] మదురై సమీపంలోని చింతామణి ఆయన స్వస్థలం. శంకర్గణేశ్ ద్వయంలోని శంకర్, సుబ్బరామన్కు తమ్ముడు.
· 1943లో తమిళనాడు టాకీస్ సంస్థ వారు చెంచులక్ష్మి చిత్రాన్ని నిర్మించారు. చిత్ర నిర్మాణ సమయంలో చిన్నయ్య మరణించడం, తరువాత ఆ బాధ్యతలు స్వీకరించిన ఎస్.రాజేశ్వరరావు తప్పుకోవడం జరిగింది. దానితో సముద్రాల రాఘవాచార్య గారి ప్రోత్సాహంతో వీరు మిగిలిన పాటలు పూర్తి చేశారు.
· తరువాత తెలుగులో విడుదలైన రత్నమాల చిత్రానికి సంగీతం చేకూర్చి మధురమైన బాణీలతో అందరినీ అలరించారు. ఈ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వీరి వద్ద సహాయకులుగా చేరారు. లైలా మజ్ను చిత్రం వీరిని ఆకాశానికెత్తింది. ఆ చిత్రానికి అరేబియన్ సంగీత పోకడలను ప్రవేశపెట్టారు. అలాగే పాశ్చాత్య సంగీతాన్ని మిళితం చేసి తెలుగు తెరకు నూతన వరవడిని దిద్దారు. సుబ్బరామన్కు సహాయకులుగా పనిచేసినవారంతా తరువాత గొప్ప సంగీతదర్శకులయారు. వారిలో ముఖ్యులు ఘంటసాల, విశ్వనాథన్, రామమూర్తి, సుసర్ల దక్షిణామూర్తి (వయొలిన్ వాయించేవారు), ఆర్.ఎస్.గోవర్ధనం, సుబ్రహ్మణ్యం (మేండొలిన్) రాజు, లింగప్ప తదితరులు.
· 1950లో వినోదా వారి చిత్ర నిర్మాణ సంస్థలో భాగస్వామి అయ్యారు. ఆ సంస్థ తెలుగు చిత్రాలలో మణిపూసగా పేర్కొనబడే దేవదాసు చిత్రాన్ని 1953లో విడుదల చేశారు. ఆ చిత్రానికి వీరి సంగీతం అత్యుత్తమమైనది.
· చిన్ననాటి నుండి బాధిస్తున్న మూర్ఛవ్యాధితో వీరు 1952 సంవత్సరంలో 29వ ఏట పరమపదించారు. ఆయనకు బాగా తాగుడు అలవాటుండేది. దేవదాసు చిత్రనిర్మాణంలో ఆయన ఒక వాటాదారు. ఈయన దేవదాసు సినిమా నిర్మాణం పూర్తికాకుండానే మరణించాడు.[2] ఆయనతో వివాహేతరసంబంధం ఉన్న ఒకావిడ ద్వారా సహనిర్మాతలు 1952లో ఆయనకు విష ప్రయోగం చేసి చంపించారని వదంతి.
విశేషాలు
· రీరికార్డింగ్ జరుగుతున్నప్పుడు తెరమీద చిత్రం చూస్తూ సుబ్బరామన్ “ఆశువుగా” పియానో మీద వాయించేవారట
చిత్రసమాహారం
· ప్రజారాజ్యం (1954)
· చండీరాణి (1953)
· దేవదాసు (1953)
· ధర్మదేవత (1952)
· ప్రేమ (1952)
· స్వప్నసుందరి (1950)
· శ్రీ లక్ష్మమ్మ కథ (1950)
· లైలా మజ్ను (1949)
· బాలరాజు (1948)
· రత్నమాల (1947)
· చెంచులక్ష్మి (1943)
· సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-4-22-ఉయ్యూరు