2000 నాటక ప్రదర్శనలిచ్చిన నాటక నటి బిజీ టివి నటి -నాగమణి
— నాగమణి ప్రసిద్ధ రంగస్థల నటి.
జననం
1959, జూన్ 6 న తూర్పు గోదావరి జిల్లా, ముమ్మిడివరం గ్రామంలో జన్మించారు.
రంగస్థల ప్రస్థానం
తన పదహారవ ఏట చదువెందుకు అనే వయోజన విద్యా ప్రచారక నాటికతో రంగస్థల ప్రవేశం చేసింది. తొలిదశలో ఎర్రంశెట్టి సుబ్బారావు దగ్గర అభినయరీతుల్లో మెళకువలు నేర్చుకున్న ఈవిడకి కన్యాశుల్కం నాటకం గుర్తింపు తెచ్చింది. ఆ నాటకంలో బుచ్చమ్మగా, మధురవాణిగా, పైటకూళ్లమ్మగా నటించింది. జె.వి. సోమయాజులు, జె.వి.రమణమూర్తి వంటి ప్రముఖులతో నటించారు.
అత్తిలి కృష్ణారావు, బాబీ, కృష్ణ చైతన్య, కె.ఎస్.టి. శాయి, తల్లావజ్ఝుల సుందరం, తాళ్లూరి శివరామకృష్ణారావు, రామనాథం వంటి దర్శకుల నాటకాలలో విభిన్న పాత్రలు పోషించారు.
తన నట జీవితంలో 200 నాటకాలతో 2000ల ప్రదర్శనలు ఇచ్చింది.
స్వీయ దర్శకత్వంలో నాలుగో సింహం నాటికను హైదరాబాద్ లో జరిగిన నంది నాటకాలలో ప్రదర్శించారు.
ప్రస్తుతం టీవి ధారావాహికల్లో నటిస్తున్నారు.
నటించిన నాటకాలు
- సంధ్యాఛాయ
- అడవి దివిటీలు
- గారడి
- పావల
- భయం
- అసురసంధ్య
- డామిట్ కథ అడ్డం తిరిగింది
- రాజా ఈడిపస్
- సామ్రాట్ అశోక
- మహోదధి
- చీకటింట్లో నల్లపిల్లి
- హిరోషిమా
- శ్రీకృష్ణ రాయబారం (పద్య నాటకం)
- మైరావణ (పద్య నాటకం)
మొదలైన నాటకాలు
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -14-4-22-ఉయ్యూరు