• 225-మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –225
• 225-పండంటికాపురం సినీ దర్శక ఫేం ,అఖిలభారత పురస్కార గ్రహీత,కుటుంబ కధా చిత్ర దర్శకుడు –పి.లక్ష్మీ దీపక్
• 1972లో జి హనుమంతరావు పద్మాలయా బానర్ పై కృష్ణ విజయనిర్మల రంగారావు అనాలి గుమ్మడి జమున మొదలైన తారాగణం తో పి.లక్ష్మీదీపక్ దర్శకత్వం లో వచ్చిన ‘’పండంటికాపురం ‘’సినిమా ఆల్ టైంరికార్డ్ గా నిలిచి నేషనల్ ఫిలిం అవార్డ్ పొందింది . ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ . సంగీతం కోదండపాణి.గోపి పాటలు రాశాడు .లక్ష్మీ దీపక్ తెలంగాణా లో పుట్టాడు .
పాటలు
1. ఆడే పాడే కాలంలోనే అనుభవించాలి తేనెలూరు – పి.సుశీల, ఎస్.పి. బాలు
2. ఇదిగో దేవుడు చేసిన బొమ్మా ఇది నిలిచేదేమో – ఎస్.పి. కోదండపాణి, పి.సుశీల
3. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు – సుశీల, ఎస్.పి. బాలు
4. ఏవమ్మా జగడాల వదినమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో – ఎస్.పి. బాలు, సుశీల
5. బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి కలతలు లేని నలుగురు కలసి సాగించారు పండంటి కాపురం (సంతోషం) – ఘంటసాల బృందం
6. బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి కలతలు లేని (విషాదం) – ఘంటసాల
7. మనసా కవ్వించకే నన్నిలా, ఎదురీదలేక కుమిలేను నేను, సుడిగాలిలో చిక్కినా నావలా – పి.సుశీల
•
• ఈ సినిమాతర్వాత లక్ష్మీ దీపక్ –ధైర్యవంతుడు ,తెలుగునాడు ,మహాపురుషుడు ,ధర్మచక్రం ,సన్నాయి అప్పన్న ,ఏడడుగుల అనుబంధం ,కార్తీక దీపం వంటి హిట్ చిత్రాలు డైరెక్ట్ చేశాడు ఇవికాక విన్తిల్లు సంతగోల ,ఈ కాలపు పిల్లలు ,నాకూ స్వాతంత్ర్యం వచ్చింది ,వయసొచ్చిన పిల్ల ,హారతి ,ఇంటికోడలు ,లైటర్ వీణ లో దర్శకత్వం వహించాడు తర్వాత గొప్ప చిత్రం ‘’గాంధీ పుట్టిన దేశం ‘’1973లో డైరెక్ట్ చేశాడు
•
• కృష్ణం రాజు ,లత ప్రమీల ,ప్రభాకరరెడ్డి ,పద్మనాభం నిర్మలమ్మ నటించారు .సంగీతం కోదండ పాణి .నారాయణ రెడ్డి శ్రీశ్రీ మైలవరపు గోపి పాటలు రాశారు .గోపీ రాసిన ‘’గాంధీ పుట్టిన దేశంరఘురాముడు ఏలిన రాజ్యం ‘’గీతం సుశీల గానం చేసి కలకాలం గుర్తుంది పోయేట్లు చేసింది .నారాయణ రెడ్డి రాసిన ‘’ఎవరిని అడగాలీ బాపూ మూగగుండేలో యేమని అడగాలి ‘’అర్ధవంతమైన గీతం శ్రీశ్రీరాసిన ‘’ఓరోరి గుంటనక్క ‘’దాశరధి రాసిన ‘’వలపే వెన్నెలలలాగా ‘’బాగా పాప్యులర్ అయ్యాయి .
• గూడు పుతాణి,జగత్ జంత్రీలు కూతురు కాపురం ,పచ్చని సంసారం సినిమాలు కూడా హిట్ చేశాడు లక్ష్మీ దీపక్ డైరెక్ట్ చేసి .
• సశేషం
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-4-22-ఉయ్యూరు
• •
• •
• •
• •
• •
• •
• •
• •
•
ృ
,
•
•
•
•