మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –229
229-ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నాదురై ,కరుణానిధి లతో తమిళ సిని స్క్రిప్ట్ రాయించుకొని ,తెలుగులో లేతమనసులు హిట్ చిత్ర దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు
ఆర్.కృష్ణన్ (1909–1997), ఎస్.పంజు (1915–1984), జంటగా కృష్ణన్ – పంజు పేరుతో పిలువబడే భారతీయ సినిమా దర్శకులు. ఈ జంట హిందీ, దక్షిణ భారతీయ భాషలలో 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.[1]దర్శకజంట,కలైమామణి అవార్డ్ గ్రహీతలు –కృష్ణన్ –పంజు
జీవిత విశేషాలు
ఆర్.కృష్ణన్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై పట్టణంలో 1909, జూలై 18న జన్మించాడు.[2] మొదట్లో ఇతడు కోయంబత్తూరులోని పక్షిరాజా స్టూడియో (అప్పట్లో కందన్ స్టూడియోగా పిలువబడేది) లో లాబొరేటరీ ఇన్‌ఛార్జిగా పనిచేశాడు.[3] ఇతని కుమారుడు కె.సుభాష్ కూడా చలనచిత్ర దర్శకుడుగా పనిచేశాడు[4].
ఎస్.పంజు అసలు పేరు పంచాపకేశన్. ఇతడు కుంభకోణం సమీపంలోణి ఉమయాల్ పురంలో 1915, జనవరి 24న జన్మించాడు.[2] ఇతడు దర్శకుడిగా మారడానికి పూర్వం పి.కె.రాజాశాండో వద్ద సహాయ ఎడిటర్‌గా, ఎల్లిస్ ఆర్. దంగన్ వద్ద సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఇతడు పంజాబి పేరుతో కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు.[3][5][6]
వృత్తి
వీరిరువురూ కందన్ స్టూడియోలో పి.కె.రాజా శాండో దర్శకత్వం వహించిన మనునీధి చోళన్ (1942) అనే తమిళ సినిమాలో పనిచేశారు.[5] ఆ సమయంలో వీరిరువురూ మంచి మిత్రులుగా మారారు. వీరి పనితనాన్ని గమనించి రాజాశాండో తన తరువాతి ప్రాజెక్టు పూంపావై వీరికి ఆప్పజెప్పాడు. ఆ విధంగా పూంపావై (1944) దర్శకులుగా ఈ జంట మొదటి చిత్రం అయ్యింది.[7] 1947లో ఈ జంట పైతియక్కరన్ అనే సినిమాకు దర్శకులుగా పనిచేశారు.[8] 1949లో వీరు మిష్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ అనే అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేరణతో నల్లతంబి అనే సినిమాను తీశారు. ఆ సినిమాకు సి.ఎన్.అన్నాదురై స్క్రిప్ట్ వ్రాశాడు. ఇది అతని మొదటి సినిమా. తరువాతి కాలంలో ఇతడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[9] 1952లో వీరు దర్శకత్వం వహించిన పరాశక్తి సినిమాకు తమిళనాడుకు మరో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.కరుణానిధి సంభాషణలు వ్రాశాడు.[10][11] వీరు భాభీ, షాదీ వంటి హిందీ సినిమాలు కుడా దర్శకత్వం వహించారు. వీరికి 1960లో కలైమామణి పురస్కారం లభించింది.[1]
మరణాలు
1984, ఏప్రిల్ 6వ తేదీన ఎస్.పంజు చెన్నైలో మరణించాడు.[8] పంజు మరణం తర్వాత కృష్ణన్ ఏ సినిమాను తీయలేదు. అతడు 1997, జూలై 15వ తేదీన మరణించాడు.[1
తెలుగులో లేతమనసులు ,కాశ్మీర్ బుల్లోడు ,హిందీలో భాభీ ,బర్ఖా ,బిందియ ,మన్ మౌజి సుహాగ్ సిందూర్ ,షాదీ లాడ్లా తమిళం లో పూమ్ పావై ,నల్లతంబి ,పరాశక్తి ,రక్త కన్నీర్ ,కులదైవం ,తిలకం ,అన్నై,చక్రవర్తి వంటి అనేక హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు
230-పుణ్యవతి దర్శకుడు –దాదా మిరాశి
దాదా మిరాశి దర్శకత్వం లో నరసరాజు స్క్రిప్ట్ రాయగా రామారావు ,కృష్ణకుమారి శోభన్ రంగారావు హరనాద్ వగైరా నటించగా ఘంటసాల సంగీతం లో 1967 లో వచ్చిన చిత్రం పుణ్యవతి .నారాయణ రెడ్డి పాటలు .ఎంత సొగసుగా ఉన్నావు ,మనసుపాడింది ,ఇంతేలే నిరుపేదలు ,ఉన్నావా ఓ దేవా ఘంటసాల సుశీల స్వరమాదుర్యం లో ఆనంద వర్షం లో తడిపేశాయి .విషాదం గూడుకట్టుకొన్న పాట ఘంటసాల గానం లో మరోలోకం లోకి తీసుకు వెడుతుంది .
తమిళం లో దాదా మిరాశి డైరెక్ట్ చేసిన ‘’రాజ వీటు పిళ్ళై’’తెలుగులో పూలపిల్లగా 1968లో విడుదలైంది .తిరుమలేశ్వర ప్రోడక్షన్స్ పై షణ్ముగం,చెంగల్ రాయుడు నిర్మించారు .జైశంకర్ ,జయలలిత ,జయభారతి ముఖ్యనటులు .మాటలు రాజశ్రీ .సంగీతం ఎం ఎస్ సుబ్బయ్యనాయుడు ,రాజారాం.
1967లో దాదా దర్శకత్వం లో నిర్దోషి వచ్చింది .రామారావు సావిత్రి అంజలి వగైరా నటులు .నారాయణ రెడ్డి పాటలు ఘంటసాల సంగీతం .’’మల్లిక లారా మాలిక లారా మౌనముగా ఉన్నారా –మాకధలే విన్నారా ‘’సూపర్ డూపర్ హిట్ సాంగ్ .చిన్నారి క్రుష్ణయ్యరారా ,మా కన్నుఅల్లో వెలుగు నీవేరా ‘’కూడా హిట్ సాంగ్
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-22-ఉయ్యూరు
—