కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -1
వి సీతారామయ్య కన్నడ రచనకు డా.ఆర్వీ ఎస్ సుందరం తెలుగు అనువాదం ‘’పంజేమంజేష్ రావు ‘’పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడెమి 1981లో ప్రచురించింది వెల-4రూపాయలు .
పంజే మంగేష్ రావు పుట్టిన దక్షిణ కన్నడ జిల్లా మద్రాస్ ప్రావిన్స్ లో ఉండేది .పాలన మైసూర్ దే అయినా ఆజ్ఞలన్నీ మద్రాస్ నుంచే వచ్చేవి .కేరళకూడా అప్పుడు అందులోదే .
పంజే సారస్వత బ్రాహ్మణుడు .మాతృభాష కొంకణి .మంగుళూరు లో వ్యవహార భాష తుళు.ఇది గుర్తింపు పొందనికన్నడ భాష .కొంకణిలో రోమన్ కేధలిక్ ,ప్రోటష్టంట్ అనే క్రైస్తవ భాష ,ఉచ్చారణలో తేడాఉన్న గౌడ సారస్వత భాష ఉన్నాయి .దక్షిణ కన్నడ జిల్లాలో ఉడిపి వరకు శైవ వైష్ణవులలో తుళు వాడుకభాష .గౌడ సారస్వతులకు వ్యాపారం బాంకింగ్ పరిశ్రమ రవాణా ఉన్నాయి .వీరిమధ్య పెళ్ళిళ్ళు జరిగిన దాఖలా లేదు .మతపరంగా ద్వైతం ,అద్వైతం అవటం కూడా కారణం కావచ్చు .హవ్యక బ్రాహ్మణులు పాత కన్నడం సంస్కృతం లలో దిట్టలు .ఐకమత్యమూ లేదు. కన్నడం కూడా వీరిని కలిపి ఉంచలేక పోయింది .హవ్యకేతరులలో బుద్ధి సూక్ష్మత ,ఉత్సాహం ఎక్కువ .వీరు మలయాళీయులతో తమిళులతో పోటీ పడాల్సి వచ్చేది .అందరికి న్యాయ ,కేంద్రస్థానం మాత్రం మద్రాస్ .స్కూళ్ళల్లో బోధన కన్నడం .దక్షిణ భారతం లో రెండు చివర్లలో అంటే పశ్చిమాన మంగుళూరు ,తూర్పున మద్రాస్ ల మధ్యలో బెంగుళూరు ఉంటుంది .
సారస్వతులు అందగాళ్ళు తెలివి తేటలున్నచిన్న శాఖ .మేదాపర జ్ఞాన సంపాదనలో విశిష్టులు .శాంతి ,మానవతా దృక్పధం ఎక్కువ .సాహిత్య కళా వైజ్ఞానిక ,రాజకీయ ,పాలన వ్యవహారాలలో అఖండులు .వారిలో ఆత్మీయత బాగా ఎక్కువ ,దక్షిణ కన్నడ జిల్లాకు బయట బాంబే ధార్వాడ ,బెంగుళూరు మద్రాస్ లలో బాగా వ్యాపి౦చారు .అవి ఉన్నత విద్యకు సంస్కృతికి కేంద్రాలుగా ఉండేవి .సారస్వతులకు తమిళ మళయాళ కొంకణి ,మరాటా కన్నడాలలో మంచి పరిచయం ఉంటుంది .మరాటీ మీద కొందరికి ఎక్కువ పక్షపాతం ఉండేది .
తుంగ భద్రకు ఈవల అవతల ఉన్న కన్నడ సీమ లో అప్పట్లో కన్నడానికి పెద్ద ప్రాముఖ్యత ,గౌరవం లేదు .శుద్ధ కన్నడ ప్రాంతం మైసూరు లోనూ ఇదే పరిస్థితి .1870నుంచి మైసూర్ పాలన మద్రాస్ కు చెందిన దివాన్ల చేతిలో నే ఉండేది .మైసూర్ వారు ఇంగ్లీష్ ను బాగా ఆదరించారు .1799వరకు ఈ రెండుప్రాంతాలు ముస్లిం పాలకుల అధీనం లో ఉండటం వలన ఇస్లాం ప్రభావం కూడాఎక్కువె .కన్నడం పై అభిమానం మాత్రం లోపల్లోపల ఉండిపోయింది .బెంగాల్ మహారాష్ట్ర లలో వచ్చిన కొత్త భావనలు కన్నడ పండితులు ,సాహిత్యవేత్తలు జీర్ణించు కోవటం మొదలు పెట్టారు .తమకున్న ఇంగ్లీష్ పరిజ్ఞానం తో ప్రాంతీయ భాషలో సృజనాత్మక శక్తిని ఆధునిక విజ్ఞాన సాధనంగా మలచటానికి ప్రయత్నించారు. అదృష్ట వశాత్తు దక్షిణ కన్నడ జిల్లాలో పంజే వంటి వారు కన్నడ భాషాభి వృద్ధికి పాటుపడే మహనీయులను సమీకరించారు .వివేకి సృజన శీలి అయిన పంజే సృజనాత్మక సాహిత్య సృష్టికి నిర్విరామ కృషి చేశాడు .
పుట్టుక
22-2-1874 న సాంస్కృతిక ధార్మిక సాంప్రదాయ మధ్యతరగతి కుటుంబలో పంజే జన్మించాడు .పుణ్యక్షేత్రమైన సుబ్రహ్మణ్యానికి దగ్గర పల్లెటూరు లో పుట్టాడు .తర్వాత కుటుంబం 30మైళ్ళ దూరం లో ఉన్న బంట్వాల్ కు వచ్చి స్థిరపడింది .ఇది దక్షిణకన్నడ౦లొ నేత్రావతీ నది ఒడ్డున ఉంది .తండ్రి రామప్పయ్య దైవ భక్తుడు .తల్లి శాంత ఆదర్శ గృహిణి .తండ్రి మరణం తర్వాత ఆమె నలుగురుకోడుకులు ,ఇద్దరు కూతుళ్ళను పెంచి పెద్ద చేసింది .పితృ సంబంధ వ్యాజ్యాలలో ఆస్తి హారతి కర్పూరం అయింది .దేవాలయ అర్చకుడైన తండ్రి సంపాదనే అందరికి ఆధారం .తన ఆభరణాలు అమ్మి పొదుపు చేసిన డబ్బు సాయంతో ఒక ఇల్లు కట్టించింది .చిన్న కుటీరాలు రెండుకట్టి అద్దెకిచ్చి ఆ అద్దె డబ్బుతో పిల్లల్ని చదివించింది .అందరి గౌరవం మన్ననలు పొందిన ఇల్లాలామే .విజ్ఞాన ఖని అయిన ఆమె వద్దకు అనేకులు సలహాలకోసం వచ్చేవారు .భర్త ధర్మబద్ధ జీవిటం గడిపి పేరు పొందాడు .ఇలాంటి చక్కని వాతావరణం లో పంజే పెరిగాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-4-22-ఉయ్యూరు