మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –231
231-ఇద్దరమ్మాయిలు సినీ దర్శకుడు –పుట్టన్న
1970లో ఇద్దరు అమ్మాయిలు 1970లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి కప్పు బిలుపు (1969) అనే కన్నడ సినిమా మాతృక. ఇందులో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసి అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబుల సరసన నటించింది.
వాణిశ్రీ ద్విపాత్రాభినయం నాగేశ్వరరావు శోభన్ బాబు హీరోలు .రంగారావు గుమ్మడి సూర్యకాంతం నాగయ్య అల్లు వగైరా ఇతర నటులు .కధ-ఆర్యాంబ పట్టాభి .సంభాషణలు నరసరాజు .సంగీతం మహదేవన్ .దాశరధి ,కొసరాజు పాటలు రాశారు తెలుగులో సూపర్ హిట్ సినిమా .డైలాగ్స్ బాగా పేలాయి రెండు విభిన్న పాత్రలలో వాణిశ్రీ నట విశ్వరూపం చూపింది .పాటలన్నీ బాగా పాప్యులర్ అయ్యాయి .ముఖ్యంగా దాశరధి రాసిన –‘’నా హృదయపు కోవెలలో ,నా బంగారు లోగిలిలో ‘’బాగా మెప్పుదలపొందింది .ఈ సినిమా నేను కనీసం నాలుగు సార్లు అయినా చూసి ఉంటాను .ఇంతకీ డైరెక్టర్ ఎవరో చెప్పలేదు .పుట్టన్న .అంటే ఎస్.ఆర్ .పుట్టన్న కనగల్ –కర్నాటక ప్రముఖ దర్శకుడు .
పుట్టన్న 1-12-1933లో పుట్టి 5-6-1985న చనిపోయాడు .అసలుపేరు శుభ్ర వేష్టి రామస్వామయ్య సీతారామ శర్మ .కానీ ఎస్ ఆర్ పుట్టన్న కనగాల్ గా ప్రసిద్ధుడు .కన్నడ సినిమాను కదిలించిన గొప్ప దర్శకుడు .మైసూర్ రాష్ట్రం లో కనగాల్ అనే చిన్న గ్రామం లో పేద బ్రాహ్మణ కుటుంబం లో పుట్టాడు .పొట్టకోసం టీచర్ గా క్లీనర్ గా చిన్న చిన్న పనులు చేశాడు .వీటివలన దియేటర్ లకు సినిమాలకు దగ్గరయ్యాడు .ప్రముఖ దర్శకుడు బి ఆర్ పంతులు వద్ద కారు డ్రైవర్ గా చేరి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు .మొదటిసినిమా1957లో వచ్చిన రత్నగిరి రహస్యం .నాగలక్ష్మిని పెళ్ళాడి అయిదుగురు సంతానానికి తండ్రి అయ్యాడు .కానీ 1970 లో ఆరతి అనే ప్రముఖ నటిని ప్రేమించి పెళ్ళాడాడు .యశశ్వినికి జన్మనిచ్చి తర్వాత ఇద్దరూ వేరయ్యారు .
1981లో రంగనాయకి సినిమా డైరెక్ట్ చేసినా హిట్ కాకపోయినా క్లాసిక్ అనే పేరొచ్చింది .ఆరతి ని వదిలేశాక పనిలేకుండా ఏడాదిన్నర గడిపాడు .తర్వాత శుభ మంగళ ,ధర్మ సేరె అనే బ్లాక్ బస్తర్ సినిమాలకు డైరెక్ట్ చేశాడు తర్వాత తీసిన మానస సరోవర బాగా ఆడలేదు ,అమృతకలిగే రుణ ముక్తాలు కూడా ఆవరేజ్ అనిపించాయి ,గజ్జేపూజ ,శరపంజర .చారిత్రాత్మక ,పౌరాణిక చిత్రాల ను చాలాగోప్పగా డైరెక్ట్ చేసిన పుట్టన్న చరిత్ర సృష్టించాడు కన్నడ ఫిలిం అసోసియేషన్ కు మొట్టమొదటి డైరెక్టర్ పుట్టణ్ణ.మూడు సార్లు కన్నడ ఫిలిం ఫేర్ అవార్డ్ లు పొందాడు పుట్టన్న.బెస్ట్ స్క్రీన్ ప్లే కు ,బెస్ట్ ఫీచర్ ఫిలిం కు ,రెండుసార్లు జాతీయ స్థాయి అవార్డ్ లు పొందాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-4-22-ఉయ్యూరు