మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –232
232-నటనకు ఊపిరులూది ,ఎందరోనటులను తీర్చి దిద్ది ,నటిస్తూనే ఊపిరి వదిలేసిన ధన్యమూర్తి,యాక్టింగ్ గురువు ,దర్శకుడు –దీవి శ్రీనివాస దీక్షితులు
దీవి శ్రీనివాస దీక్షితులు ప్రముఖ కమెడియన్, రైటర్ ఉత్తేజ్ బంధువైన డీఎస్ దీక్షితులు పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. 1956లో దీవిహనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, రేపల్లెలో 1956, జులై 28 న జన్మించాడు. . నటుడిగా, యాక్టింగ్ గురుగా ఆయన ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే.
‘మురారి’ సినిమాతో పాపులర్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘మురారి’ చిత్రంలో పూజారి పాత్రలో నటించడంతో ఆయన ‘మురారి’ దీక్షితులుగా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. ఇంద్ర, ఠాగూర్, అతడు, వర్షం, పలు తెలుగు చిత్రాల్లో నటించారు. సంస్కత, తెలుగు భాషలలో రంగస్థల కళల్లో ఎం.ఏ. డిగ్రీలు పొందాడు. రంగస్థల నటుడిగా, అధ్యాపకుడిగా పేరు గడించాడు. రేపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరరుగా పనిచేశాడు.
రంగస్థల ప్రస్థానం
నాటక రంగంలో సేవలు ఆంధ్రప్రదేశ్ థియేటర్ ఇన్స్టిట్యూట్లో డిప్లమా పూర్తి చేశారు. శకుంతలం, హరిశ్చంద్ర, కీలు బొమ్మలు లాంటి నాటకాల్లో నటించడంతో పాటు గోగ్రహణం, కొక్కొరొక్కో, వెయింటింగ్ ఫర్ గోడాట్ లాంటి నాటకాలకు దర్శకత్వం వహించారు.
ఆల్ ఇండియా రేడియోలో నటుడిగా పాల్గొన్నాడు. టి.వి.లో ఈయన నటించిన “ఆగమనం” సీరియల్ కు దాదాపు అన్ని నంది అవార్డులు లభించాయి. 2019లో మాటీవిలో వచ్చిన సిరిసిరిమువ్వలు ఈయన చివరి సీరియల్. ఎల్లమ్మ, మురారి, ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, అతడు, గోపాల గోపాల బెండు అప్పారావు మొదలగు చిత్రాలలో నటించాడు
యాక్టింగ్ గురువుగా అక్కినేని యాక్టింగ్ ఇన్స్టిట్యూట్, రవీంద్ర భారతిలోని మీడియా యాక్టింగ్ సంస్థల్లో గురువుగా సేవలు అందించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఆయన వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు.
ప్రముఖ తెలుగు సినీ, టీవీ, రంగస్థల నటుడు, యాక్టింగ్ గురు డీఎస్ దీక్షితులుదీక్షితులు 2019, ఫిబ్రవరి 18 సోమవారం సాయంత్రం నాచారంలోని రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో ‘సిరిసిరి మువ్వలు’ సీరియల్ షూటింగులో నటిస్తూనే గుండెపోటుకు గురై మరణించాడు.[2][3][4]
మూలాలు
నాచారంలోని ఓ ఆసుపత్రికి దీక్షితులు తరలించారు. అయితే మర్గమధ్యంలోనే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఊహించని ఘటనతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు.
ఈ విషయం తెలిసి హైదరాబాద్‌లోని దీక్షితులు నివాసానికి వేలాదిగా ఆయన శిష్యులు తరలి వస్తున్నారు. దీక్షితులు అంత్యక్రియలు తెనాలి పక్కన ఉన్న ఆయన స్వస్థలం కొల్కలూరులో దహన క్రియలు జరుగుతాయి.
ఊపిరి కూడా నటనకే అంకితం చేశారు ‘‘దీక్షితులు మాస్టారు మరణం ఎంతో బాధించింది. నేను నటిస్తూ నటిస్తూ పోవాలని ఉందని నాగేశ్వరరావు ఎప్పుడూ అనే వారు. అది వారి విషయంలో జరుగలేదు కానీ… దీక్షితులుగారి విషయంలో జరిగింది. దీక్షితులుగారు తన జీవితాన్ని, సంపాదనను, సర్వస్వాన్ని ఆఖరు ఊపిరి కూడా నటనకే అంకితం చేశారు. ఆయన మరణం బాధ కలిగించినా.. ఆయనకు నటనపట్ల ఉన్న అంకిత భావం ఆశ్చర్యం కలిగిస్తుంది.” అని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు.
అవార్డులు – పురస్కారాలు
- శ్రీ కృష్ణతులాభారం పద్యనాటకానికి దర్శకత్వం వహించి 1999 నంది నాటకోత్సవాలలో ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడు బహుమతులు
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు
- గరికపాటి రాజారావు మెమోరియల్ అవార్డు
- రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం
- చైతన్య ఆర్ట్ థియేటర్ అవార్డు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-22-ఉయ్యూరు