మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –234
234-తన కళ్ళ తోనే ప్రేక్షక హృదయాలను గెలిచి ,రియలిస్టిక్ ‘’కళ్ళు ‘’సినిమాతో అదే ఇంటిపేరుగా మారి ,పగలు ఉద్యోగం ,రాత్రి నాటకాలేస్తూ,పేద కళాకారులకు సాయం చేసిన –కొల్లూరి చిదంబరం ,
ళ్ళు చిదంబరం (అక్టోబర్ 10, 1945 – అక్టోబరు 19, 2015) తెలుగు హాస్య నటుడు. ఈయన మొదట నాటకరంగంలో నటించి, ఎం.వి.రఘు కళ్ళు చిత్రం లోని గుడ్డివాని పాత్ర ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యాడు. ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో పాత టీవీలు అమ్మేవాడి పాత్ర పోషించాడు. చిన్న పాత్ర ఐనా దానిద్వారా మంచి గుర్తింపు పొందాడు.[1]
నేపథ్యము
కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. 1945, అక్టోబర్ 10 న విశాఖపట్నంలో జన్మించాడు. ఆయన కళ్లు చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేశాడు. తన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని కళ్లు చిదంబరంగా గుర్తింపు పొందాడు. ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించాడు. కళ్లు, అమ్మోరు, చంటి, గోల్మాల్ గోవిందం (1992), మనీ, పెళ్ళిపెందిరి, పవిత్రబంధం, పెళ్ళి చేసుకుందాం (1997), ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, గోవిందా గోవిందా, అనగనగా ఒక రోజు, అదిరిందయ్యా చంద్రం, అడవిచుక్క (2000), తొలిపరిచయం, చంటిగాడు (2003), ఐతే ఏంటి (2004), అతడెవరు (2007) తదితర చిత్రాల్లో నటించాడు. ప్రత్యేకమైన పాత్రలు పోషించి గుర్తింపు పొందారు.
మరణ0
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2015, అక్టోబరు 19 సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు[2].
కళ్లు లేని వాళ్ల ధీనావస్త ఎలా ఉంటుంది? అందునా పేదరికంలో ఉంటే ఇక వాళ్లకు దిక్కెవరు? అలాంటి కొన్ని జీవితాల్లో ఎమోషన్ని అద్భుతంగా ఆవిష్కరించిన రియలిస్టిక్ సినిమా ‘కళు’్ల (1988). శివాజీ రాజా, ఎన్.జె.భిక్షు, రాజేశ్వరి, కళ్లు చిదంబరం కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గ్రేట్ సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు దర్శకత్వం వహించారు. డి.విజయ్‌కుమార్ నిర్మించారు. ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ మేటి చిత్రరాజం. ఇందులో శివాజీ రాజా నటనకు, గొల్లపూడి మారుతిరావు సంభాషణలకు చక్కని పేరొచ్చింది. ఈ సినిమాతోనే చిదంబరం కాస్తా ‘కళ్లు చిదంబరం’గా మారారు.
ఇండియన్ పనోరమ విభాగంలో ఈ సినిమా అప్పట్లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలోనూ ప్రదర్శితమైంది. ఉత్తమ చిత్రంగా, ఉత్తమ తొలి చిత్ర దర్శకత్వం విభాగాల్లో నందులు దక్కాయి. ఉత్తమ దర్శకుడిగా రఘు ఫిలింఫేర్ అందుకున్నారు. ఈ సినిమా పాటలు, సంగీతం మరో అద్భుతం. “చీకటోళ్ల లోకంలో కొత్త పొద్దు పొడుపురా.. అమావాస్య లోగిలిలో దీపావళి జాతరా..!” అంటూ ఎస్.పి.బాలసుబ్రమణ్యం స్వీయ ఆలాపనలో స్వరపరిచిన పాట హైలైట్. సీతారామశాస్త్రి రాసిన ఈ మెలోడీ హైలైట్.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కామెడీ యాక్టర్స్ ఉన్నారు కానీ కొందరు మాత్రమే వల్ల అ హావభావాలతో, రూపురేఖలతో మనందరికీ బాగా గుర్తుండి పోతారు అలాంటి కమెడియన్ గా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఒక నటుడు ఎవరు అంటే అది కళ్ళు చిదంబరం గారు.ఆయన కళ్ళు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఆ సినిమాలోని నటనకి నంది అవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు అయితే మొదటి నుంచి కళ్ళు చిదంబరం గారికి నటన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో తను పొద్దంతా జాబ్ చేస్తూ రాత్రి వేళల్లో నాటకాల్లో నటించేవారు చాలా రోజుల పాటు అలాగే చేయడంతో తన కళ్ళు అలా అయిపోయాయి అని ఆయన ఎప్పుడూ చెప్పుకొస్తూ ఉండేవారు కానీ ఆయన కళ్ళు అలా ఉండడం వల్లే సినిమాల్లో కమెడియన్ గా మంచి అవకాశాలు వచ్చాయి.
ఆయన తెలుగు సినిమాల్లో చేసిన కామెడీకి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఫలానా క్యారెక్టర్ ఉంది అంటే అది కళ్ళు చిదంబరం గారే చేయాలి అనేంతగా ఆయన నటనని చూపించి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు.ఆయన తెలుగులో చాలా సినిమాల్లో నటించారు ముఖ్యంగా ఎస్.వి కృష్ణారెడ్డి, ఇ.వి.వి సత్యనారాయణ, రేలంగి నరసింహారావు, కోడి రామకృష్ణ గారి సినిమాల్లో ఎక్కువగా నటించారు.ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చేసుకుందాం సినిమా లో కూడా కళ్ళు చిదంబరం ఒక మంచి క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
తనదైన కామెడీతో జనాలు అందరికీ చాలా దగ్గర అయిపోయాడు.అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు సినిమా లో మంచి క్యారెక్టర్ పోషించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు చివర్లో అయితే సౌందర్య రౌడీ చేతిలో ఇబ్బంది పడుతుంటే బొట్టు పెట్టమ్మా అనే డైలాగు చాలా ఫేమస్ అయిపోయింది.
ఆ ఒక్క సినిమాతో కళ్ళు చిదంబరం కొన్ని రోజులపాటు స్టార్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు.అయితే తను నటుడిగా నటిస్తూ సినిమాలో నాటకాల్లో వచ్చే డబ్బులతో పేద కళాకారులకు సహాయం చేసేవాడు తను మాత్రం తను చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన డబ్బు మాత్రమే తన జీవనానికి వాడుకొనేవాడని చెప్పేవాడు.అయితే ఆయన్ని ఇండస్ట్రీకి చెందిన చాలామంది చాలాసార్లు సన్మానించారు.ఇక కళ్ళు చిదంబరం చాలా మంది పేద కళాకారులకు కూడా తనకు తోచినంత సహాయం చేస్తారని చాలా మంది చెప్పుకుంటారు.
కళ్ళు చిదంబరం గారు 2015లో అనారోగ్యం కారణం వల్ల కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే ఆయనకి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు.కళ్ళు చిదంబరం ఇండస్ట్రీలో అందరితో చాలా కలివిడిగా ఉండేవాడు అని ఎవరితో ఎప్పుడు గొడవలు పెట్టుకునే వాడు కాదని అసలు కాంట్రవర్సీ లోనే నిలిచే వాడు కాదని ఇప్పటికీ చాలా మంది అంటుంటారు.
అయితే కళ్ళు చిదంబరం చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి చెందిన ఆయన కొడుకులు ఎవరు ఇండస్ట్రీకి రాలేదు ఫ్యూచర్ లో వస్తే రావచ్చు ఏమో.ఇండస్ట్రీలో అప్పుడు చాలా మంది కామెడీ యాక్టర్స్ ఉన్నప్పటికీ తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ తో జనాల్ని నవ్విస్తూ ఉండేవారు కన్ను డిఫరెంట్ గా ఉండడమే అతనికి ప్లస్ అయిందని ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు.బ్రహ్మానందం
బ్రహ్మానందం లేక మల్లికార్జునరావు ?బాంక్ ఆఫీసర్ గా ఉన్న సినిమాలో లోన్ కోసం వచ్చి నియోజకవర్గ ప్రజలను,కాకపొతే ఇద్దరు భార్యలు ,చాలకపోతే ,పిల్లల్నీ హామీ గా పెడతాను అనే సన్ని వేశం కడుపుబ్బా నవ్విస్తుంది .ఇలా ఎన్నెన్నో పాత్రలలో తనదైన ముద్ర వేసి చిరకాలం గుర్తుండిపోయే చిరస్మరణీయ నటన ప్రదర్శించాడు కళ్ళు తో పాటు డైలాగ్ డెలివరీ కూడా తమాషా గా ఉండటం తో ‘’డబుల్ ప్లస్ పాయింట్ ‘’అయింది.అందుకనే అడిగి మరీ కేరక్టర్ ఇచ్చేవారు ఇండష్ట్రీ లో .మానవత్వమున్న మంచి నటుడు కళ్ళు చిదంబరం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-22-ఉయ్యూరు