మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –237
237-మిస్టర్ ఆసియా ,మిస్టర్ హెర్క్యులస్ ,మిస్టర్ ఇండియా అయిన కసరత్తు వీరుడు ,పౌరాణిక ఆంజనేయుడు –అర్జా జనార్ధనరావు
అర్జా జనార్ధనరావు (డిసెంబర్ 21, 1926 – నవంబర్ 4, 2007) ప్రసిద్ధ తెలుగు నాటక, సినిమా నటుడు. ఇతడు ఎక్కువగా పౌరాణిక చిత్రాలలో హనుమంతుడు వేషంతో మంచిపేరు సంపాదించుకున్నాడు. హనుమ అనగానే గుర్తువచ్చే విదంగా ఆయన నటన ఉండేది.
జీవిత విశేషాలు
ఇతని స్వస్థలం కాకినాడ. అక్కడే బి.ఎ., బి.ఎస్.సి చదువుకున్నాడు. చదువుకొనే సమయంలోనే ఇతనికి నాటకరంగంలో కొంత అనుభవం కలిగింది. ఇతనికి చిన్నతనం నుండి ఆటలమీద, కసరత్తులు చేయడం మీద ఉత్సాహం ఉండేది. ఆ ఉత్సాహమే ఇతడిని మిస్టర్ ఆసియా, మిస్టర్ హెర్క్యులస్ (1954), మిస్టర్ ఇండియా (1955)గా ఎన్నిక చేసింది. ఇతడు శబ్దగ్రహణ శాఖలో డిప్లొమా చదివి కొన్నాళ్ళు శ్యామలా స్టుడియోలో రికార్డిస్ట్‌గా పనిచేశాడు.
నటించిన సినిమాలు
• లవకుశ (1963)
• శ్రీకృష్ణావతారం (1967)
• వీరాంజనేయ (1968)
• శ్రీ రామాంజనేయ యుద్ధం (1974)
• ముత్యాల ముగ్గు (1975)
• శంకరాభరణం (1979)
• త్యాగయ్య (1981)
• శ్రీ ఆంజనేయ చరిత్ర (1981)
• దేవాంతకుడు (1984)
డిటెక్టివ్ నవలా రచయిత విశ్వప్రసాద్ కథ, మాటలు సమకూర్చిన, 1969 జూలై 25న సినిమా విడుదలైన, కృష్ణ, గుమ్మడి, ఎస్వీ రంగారావు, వాణిశ్రీ లు ప్రధాన పాత్రధారులుగా ఉన్న జగత్ కిలాడీలు’ చిత్రంలో జనార్దన రావు భిన్నమైన పాత్రలో నటించారు. ఈ సందర్భంగా రామాంజనేయ యుద్ధం చిత్రంలో ఒక పాటను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జనార్దన రావు … ఆంజనేయ పాత్రలో లీనమై నటించగా, ఆ సన్నివేశంలో, ఆయన హావభా వాలు నాటి సినిమా ప్రియులు ఎన్నటికీ మరచి పోలేనివి. 1975లో పొట్లూరి వెంకట నారాయణ, ఎన్.ఎస్.మూర్తి కలిసి శ్రీరామాంజనేయ యుద్ధం పేరుతో కలర్ సినిమా నిర్మించారు. బాపు దర్శకత్వం వహించిన సినిమాకు ముళ్లపూడి వెంకటరమణ మాటలు రాయకుండా ఉన్న అరుదైన సినిమా శ్రీ రామాంజనేయ యుద్ధం.
బాపు−ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా శ్రీరామాంజనేయ యుద్ధం. గతంలో గబ్బిట వెంకటరావు రాసిన పద్యనాటకం లోని పద్యాలను యధాతధంగా వాడడంతో సంభాషణలు కూడా అతని చేత రాయించారు. ఎన్టీఆర్ రాముడిగా, అర్జా జనార్దనరావు ఆంజనేయుడుగా, బి.సరోజదేవి సీతగా, ధూళిపాళ్ల యయాతిగా నటించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఇందులో ఆంజనేయుడు ఆలపించే రెండు ఆర్ధ్రమైన పాటలను వినూత్నంగా ఉంటుందని రఘురామయ్య చేత పాడించారు. వాటిలో మొదటిది ‘రామ నీలమేఘ శ్యామా కోదండరామా’ కాగా, రెండవది ‘శరణు శరణయా జానకిరామా, కరుణ జూపవా మారుతిపై సాకేత సార్వభౌమా’ అనే పాట. ఈ రెండవ పాటకు కె.వి. మహ దేవన్ ఒక హిందీ పాట బాణీని అనుకరించడం వింతగా చెప్పుకున్నారు. అందుకు కారణం...మహదేవన్ ఎప్పుడూ ముందుగా ఇచ్చే బాణీకి పాట స్వరపరచ లేదు. కవి రాసిన ఎటువంటి పాటకైనా అద్భుతంగా బాణీలు కట్టటం మహదేవన్ నైజం. తద్భిన్నంగా ‘సాకేత సార్వభౌమా’ పాటకు మహదేవన్ అనుకరించిన హిందీ పాట 1964లో రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మాత తారాచంద్ బరజాత్యా సత్యన్‌బోస్ దర్శకత్వంలో నిర్మించిన సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘దోస్తీ’లో మహమ్మద్ రఫీ పాడిన ‘చాహూంగా మై తుజ్హే సాంఝ్ సవేరే...ఫీర్ భి కభీ ఆబ్ నామ్ కో తేరే ఆవాజ్ మై న దూంగా’ మహదేవన్ అనుకరించడాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
(నవంబర్ 4 అర్జా వర్ధంతి)
రామాంజనేయ యుద్ధం లో అర్జా ప్రతికదలిక మాట భక్తీ స్పోరకం .హావభావాలు చిరస్మరణీయం .రఘురామయ్య పాడిన రెండు పాటలు తెలుగుసినీ గీత చరిత్రలో చెరగని సంతకాలు ఆఫీల్ ఆయన పాడటం వల్లనే వచ్చింది బహుశా ఎవరూ అంత భావంతో పాడగలిగే వారు కాదేమో అలా పాడించే నేర్పు బాపుది.బాపు గారి ముత్యాలముగ్గు లోనూ అర్జా హనుమ పాత్ర మలుపులు తిప్పేదే .చిన్నారీ అంటూ ఆపిల్లను లాలించి బుజాలకు ఎత్తుకోవటం అద్భుతం .అల్లు కోతినే మరపించే మహా నటన ప్రదర్శించి హాట్సాఫ్ అనిపించాడు .శంకరాభరణం లో రౌడీ పాత్ర .సానుభూతికోల్పోయేది.బాపు త్యాగయ్య లో త్యాగూ కు చాలా సపోర్టివ్ పాత్ర .సీతారాములకు ‘’త్యాగ దర్శనం ‘’చేయించే పాత్ర సార్ధకం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-4-22-ఉయ్యూరు
వీక్షకులు
- 981,537 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా విశ్వ నాథ దర్శనం -2
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.28 వ భాగం.6.2.23.
- కళా విశ్వ నాథ దర్శనం -1
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.
- అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.
- ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,925)
- సమీక్ష (1,280)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (309)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (839)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (362)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు