కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -4
కన్నడ సాహిత్య సమ్మెళన అధ్యక్షుడు
1929ను౦చి సాహిత్యకారులు పంజే ను కన్నడ సాహిత్య సమ్మెళన అధ్యక్షుడు
గా ఉండమని కోరుతూనే ఉన్నారు .చాలాకాలం ఒప్పుకోలేదు చివరకు మంగుళూరు వెళ్లి బ్రతిమాలి ఒప్పించారు .పాత హైదరాబాద్ రాష్ట్రం లోని రాయచూర్ లో జరిగిన సమావేశానికి ఆయన చేసిన అధ్యక్షోపన్యాసం అందర్నీ మెప్పించింది .ప్రాచీన మధ్యయుగ ఆధునిక కవితారీతుల్ని ఆయన గొప్పగా విశ్లేషించాడు .భవిష్యత్తు గురించి అందంగా ఆశగా భావించాడు .ధ్వని ,లయ గురించి సోదాహరణ ప్రసంగం చేశాడు .ధార్వాడ ,హైదరాబాద్ లలో ఆయన చేత ఉపన్యాసాలిప్పి౦చి స్పూర్తి కలిగించారు .ఆయన ఆంగ్లపాఠం చెబితే మరపురాని అనుభూతిగా ఉండేది .
చివరి రోజులు
తగినంత పెన్షన్ వస్తోందికనుక చివరి రోజులు హాయిగా గడిచాయి పిల్లలంతా సెటిలయ్యారు .పెద్దకొడుకు పని చేసే జంషెడ్ పూర్ ,చిన్నకొడుకు పని చేసే పాట్నా కూడా ఆయనకు నచ్చలేదు .హైదరాబాద్ లో రెండవ కొడుకు దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాడు .ఇది పిల్లలకు అందుబాటులో ఉండే ప్రదేశం అని ఆయన అనుకొన్నాడు అలాగే 25-10-1937 న పంజే మరణించిన రోజు పిల్లలందరూ దగ్గరే ఉన్నారు .మాస్తి గారి తనకిష్టమైన పద్యాన్ని ఎప్పుడూ చదువుకొనేవాడు –దాని అర్ధం –ఇంక ఈవూరికి పగళ్ళు లేవు .తన రోజు దగ్గరైందని కళ్ళుమూసుకొని ,ఇంకనాకు చాలు అని చల్లబడింది .కన్నడాన్ని అమితంగా ప్రేమించే సారస్వత కొంక ణీయుడిని కన్నడ దేశం కోల్పోయింది .1974లోఫిబ్రవరి 8-9తేదీలలో పంజే శతజయంతి జరిపారు .ఆయన పుట్టిపెరిగిన బంత్వాల్ లో స్మారక ఫలకం నిర్మించారు .మంగుళూరు లోనూ ఘనంగా ఉత్సవాలు జరిపారు .ఆయనపై స్మారక సంపుటం ‘’తె౦కణ గాళి’’అంటే దక్షిణ గాలి ప్రచురించారు ‘ .
రచనా సర్వస్వం
చిన్నప్పుడే పంజే పత్రికలకు మారుపేర్లతో రాసేవాడు ‘’హరటమల్ల ‘’అంటే వదరుబోతు పేరుతోసారస్వత విమర్శన వ్యాసాలూ రాసేవాడు .ఇది అప్పటికి కొత్త సాహిత్య ప్రక్రియ .పానుగంటి వదరుబోతు వ్యాసాలూ మనకు గుర్తుకు వస్తాయి .సువాసిని పత్రికలో ఆయనవే ముఖ్య రచనలు .ఆయన పెట్టుకొన్న ‘’కవిశిష్య ‘’పేరు దేశమంతా మారుమోగింది .
ఆయన శతజయంతి సందర్భంగా వెలువడిన ఆయన రచనలు సాహిత్య విమర్శ,ప్రశంస ఉన్నవి .చారిత్రిక విశేషాలు శాసనాధారంగా రాసినవీ ఉన్నాయి .నాగరుల రాజధాని ని సంగీతపురమనీ ,భల్లాట పురం అనీ అనేవారట .సాళ్వదేవరాయలు ,విద్యానందుడు గురించి తెలియని విషయాలు తెలిపాడు .కన్నడ బయ్య నుంచి సంస్కృత ‘’భైర’’వచ్చిందన్నాడు .భారతేశ వైభవం పుస్తకం లో ఆడంబర శైలి కనిపిస్తుంది .సాళ్వరాసిన ‘’రసరత్నాకరం ‘’అలమ్కారగ్రంధం ,కోటీశ్వరుని ‘’జీవంధర షట్పది లో ఆనాటి భావ ధోరణలు వెలికి తీశాడు .ధన్యకుమార చరిత ‘’లో 1450నాటి రచయిత ఆదియప్ప గురించి రాశాడు .జైన వేమన్న ,పార్తీ సుబ్బా ,నందలికే లక్ష్మీ నారాయణప్ప యక్షగానాలు రాశారని వివరించాడు .భట్టాలకుని శబ్డాను శాసనం కు ముందుమాటగా బిలిగి లోని ఒకశాసనం ఉందన్నాడు .
కన్నడ సాహిత్యం లో రావాల్సిన మార్పుల్ని ‘’హాసదారి ‘’అంటే కొత్తమార్గం లో వివరించాడు .నారణప్ప కన్నడ భారతం ,లక్ష్మీశుని జైమిని భారతం సర్వజ్నుని ‘’ఓ నామ పధ్ధతి లో ఉన్న వయోజన విద్యా విజ్ఞానాలను తెలిపాడు .నారాయణప్ప భారతానికి నరసింహా చార్ తో,జైమిని భారతానికి శ్రీ కంఠయ్య తో కలిసి సంపాదకత్వం వహించాడు .కుమార వ్యాస భారతం భామిని షట్పది లో రాసిన వాటిలొఅత్యుత్తమమైన్ది .కృష్ణునిపై భక్తితో ‘’కృష్ణ రాయన చరిత ‘’అని పేరుపెట్టాడు .మనీషి అయిన శ్రీ కృష్ణ చరితం ఇది .మధ్యయుగ సాహిత్యం లో దీన్ని మించింది లేదు .అలాగే నందలికే లక్ష్మీ నారాయణ గురించికూడా పంజే విశిష్టంగా రాశాడు .రామాశ్వమేథ కూడా అలాంటి గొప్పరచనే .సాహిత్య విలువలున్న గద్య రచన .ఓనామ పద్ధతిలో సర్వజ్ఞుని త్రిపదలు పెద్దలకు పిన్నవారికీ ఎలా విద్యా విజ్ఞాన బోధకాలో మహా గొప్పగా వివరించాడు .
పదార్ధం అంటే ఏమిటి సరదారచన ..బీల్కోడు వ్యంగ్యరచన .పొగాకు గురించి గొప్పరచన చేశాడు .అక్బర్ సభలో కొందరుపోగాకు ని నిషేధించాలి అంటే బీర్బల్ ‘’దానికి ఒకటే శిక్ష .ఎప్పుడు పొగాకు కంటికి కనిపించినా ,దాని తలవైపు నిప్పు ముట్టించి ,అది కాలి పొగ ,నుసి అయ్యేదాకా మనం చూడాలి హుజూర్ ‘’అన్నాడట పాదు షాతో సహా అందరు కడుపు చక్కలయ్యేట్లు నవ్వకేం చేస్తారు .అదే పంజే రాసిన ‘ధూమ్రతత్వపు తత్వమసి ‘’ .అలాగే ‘’రైతి ‘’పదం ఎలా ఏర్పడుతుందో సరదాగా చెప్పాడు –‘’పెళ్లి అయిపోయి చాలారోజులైనా , అల్లుడి స్నేహితులు మామగారింట్లో తిష్ట వేస్తె ,పిల్లమేక తల్లి మేక పొదుగును అందుకోలేక ,దాని గడ్డం కింద ఉన్న పొదుగులుపట్టుకొని వేలాడినట్లు వర్ణమాల నేర్పించటానికి ‘’రైతి ‘’చెబుతారు అన్నాడు .టిబెట్ ను ‘’టాప్ హాట్ ‘’అనే దానినుంచి ,ఎవరెస్ట్ ను ఎవర్ అనేదానికి సూపర్లేటివ్’’ తమ’’ చేరిస్తే ఎవరెస్ట్ వచ్చినట్లు వస్తువులపెర్లు స్థల నామాలు ఎలా వస్తాయో సాధించి చూపించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-22-ఉయ్యూరు
వీక్షకులు
- 981,171 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా విశ్వ నాథ దర్శనం -1
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.
- అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.
- ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,925)
- సమీక్ష (1,280)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (308)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (838)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (362)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు