మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –238
238-పౌరాణికనాటక కర్త ,సినిమా సంభాషణ ,పాటల కర్త,రామాంజనేయ ,కృష్ణా౦జ నేయఫెం –తాండ్ర సుబ్రహ్మణ్యం
తాండ్ర సుబ్రహ్మణ్యం నాటక రచయిత, సినిమా రచయిత.
రచనలు
- పతితపావన (సాంఘిక నాటకం)
- కృష్ణగారడి[1] (పౌరాణిక నాటకం)
- జెండాపై కపిరాజు (నాటకం)
- సతీసులోచన (నాటకం)
- శ్రీరామాంజనేయ యుద్ధం (నాటకం)[2]
- శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (నాటకం)[3]
- మహిషాసురమర్ధని (నాటకం)[4]
- భీమార్జున గర్వభంగం[5]
- శకుంతల
సినిమాలు
- పతిభక్తి
- భీమాంజనేయ యుద్ధం
- శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
- పార్వతి విజయం
- నాగార్జున
- సతీ తులసి [6]
- మహారథి కర్ణ
- మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –239
239-చట్టానికి కళ్లులేవు సినీ ఫేం దర్శకుడు –ఎస్.ఎ.చంద్ర శేఖర్
ఎస్.ఎ.చంద్రశేఖర్ ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు, రచయిత. ఇతడు ముఖ్యంగా తమిళ చిత్రాలకు పనిచేశాడు.[3] ఇతడు సట్టం ఒరు ఇరుత్తరై (1981) అనే తమిళ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[4] ఇతడు వేట్రి, నాన్ సిగప్పు మనిధన్, ముత్తం, సట్టం ఒరు ఇరుత్తరై వంటి అనేక విజయవంతమైన సినిమాలను తీశాడు.
వ్యక్తిగత జీవితం
ఎస్.ఎ.చంద్రశేఖర్ తమిళనాడు రాష్ట్రంలోని, రామేశ్వరం నగరంలోని “తంగచిమదం” అనే ప్రాంతానికి చెందినవాడు.[2] ఇతడు కర్ణాటక సంగీత కళాకారిణి శోభను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించింది. కొన్ని సినిమాలలో పాటలు పాడింది. కొన్ని సినిమాలకు కథను సమకూర్చింది. ఇతని కుమారుడు విజయ్ కూడా తమిళ సినిమా నటుడు, గాయకుడు.[5] ఇతని దర్శకత్వంలో వెలువడిన “నాలయ తీర్పు” అనే సినిమాతో విజయ్ వెండితెర జీవితాన్ని ప్రారంభించాడు. ఇతని కుమార్తె విద్య రెండేళ్ల వయసులోనే మరణించింది.[6] ఇతని సమీప బంధువులు ఎస్.ఎన్.సురేందర్ నేపథ్య గాయకుడిగా, విక్రాంత్ నటుడిగా సినిమాలలో పనిచేస్తున్నారు.
సినిమా రంగం
ఇతడు తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో 70కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. నిర్మాతగా ఏడు చలన చిత్రాలను నిర్మించాడు. 17 తమిళ సినిమాలకు కథను అందించాడు. 44 సినిమాలకు స్క్రీన్‌ప్లే వ్రాశాడు. అంతే కాక 15 సినిమాలలో నటించాడు కూడా. ఇతడు తెలుగులో “చట్టానికి కళ్లులేవు”, “బలిదానం”, “పల్లెటూరి మొనగాడు”, “దేవాంతకుడు”, “దోపిడి దొంగలు”, “ఇంటికో రుద్రమ్మ” సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతని సినిమాలలో విజయ కాంత్, విజయ్, రజనీకాంత్, చిరంజీవి, శోభన్ బాబు, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్ నాగ్, మిథున్ చక్రవర్తి, జితేంద్ర, ధనుష్ మొదలైన హీరోలు నటించారు. విజయశాంతి, రోహిణి, త్రిష, ముచ్చర్ల అరుణ, ఆరతి, మేఘనా నాయుడు, రాధిక, పూనమ్ కౌర్, రంభ, ప్రియాంక చోప్రా, అభిరామి, మీనా, సిమ్రాన్ మొదలైన నటీమణులు ఇతని సినిమాల్లో నటించారు. ఇతడు ఎక్కువగా విజయకాంత్, విజయ్‌లతో సినిమాలు తీశాడు. ఇతని కుమారుడు విజయ్ ఇతని దర్శకత్వంలో 16 పైచిలుకు సినిమాలలో నటించాడు. ఎస్. శంకర్, ఎం.రాజేష్, పొన్‌రామ్, రజినీ మురుగన్ తదితరులు ఇతని వద్ద సహాయకులుగా పనిచేసి ఆ తరువాత దర్శకులుగా రాణించారు.[7][8]
వివాదాలు
ఇతడు ఒక ఆడియో రిలీజింగ్ ఫంక్షన్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కాడు. తిరుపతి దేవస్థానంలో ప్రజలు దేవునికి ముడుపుల పేరుతో లంచం ఇస్తున్నారని, భగవంతుడు భక్తుల కోరికలన్నీ తీర్చేటట్టయితే ఇక ఎవరూ చదువుకోవలసిన అవసరం లేదని ఇతడు చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. హిందు మున్నాని అనే సంస్థ ఇతని వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని, ఇతనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో హిందూ మున్నాని హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్ట్ న్యాయాధికారి ఇతనిపై కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించాడు[9].
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-22-ఉయ్యూరు
- మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –240
- 240-చలన చిత్ర నటుడు రచయిత,దేవాంతకుడు ఫేం –తోటపల్లి మధు
- తోటపల్లి మధు తెలుగు చలనచిత్ర రచయిత, నటుడు. చిరంజీవి కథానాయకుడిగా 1984లో వచ్చిన దేవాంతకుడు చిత్రం ద్వారా రచయితగా తెలుగు చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టాడు.[1][2]
జననం
మధు 1963, ఫిబ్రవరి 27న విజయవాడలో జన్మించాడు.
సినిమారంగ ప్రస్థానం
చిరంజీవి కథానాయకుడిగా 1984లో వచ్చిన దేవాంతకుడు చిత్రం ద్వారా 19 ఏళ్ల వయసులోనే రచయితగా తెలుగు చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టిన మధు 190కి పైగా చిత్రాలకు కథ, మాటలు అందించాడు.[3] 45 సినిమాలలో విలన్ పాత్రలు పోషించాడు.
రచయితగా
- వెంకటా ఇన్ సంకట (2009)
- మహారథి – కథ, సంభాషణలు (2007)
- 123 (2002)
- హనుమాన్ జంక్షన్ – సంభాషణలు (2001)
- అంకుల్ – సంభాషణలు (2000)
- కృష్ణ బాబు – సంభాషణలు (1999)
- కంటే కూతుర్నే కను- సంభాషణలు (1998)
- పెళ్ళిపందిరి – సంభాషణలు (1997)
- మమా బాగున్నావా – సంభాషణలు (1997)
- రాయుడుగారు-నాయుడుగారు – సంభాషణలు (1996)
- రాముడొచ్చాడు – సంభాషణలు (1996)
- మాయా బజార్ – సంభాషణలు (1995)
- శుభమస్తు – సంభాషణలు (1995)
- రిక్షావోడు – సంభాషణలు (1995)
- అల్లరి పోలీస్ – సంభాషణలు (1994)
- బంగారు కుటుంబం – సంభాషణలు (1994)
- అల్లరి అల్లుడు – కథ, సంభాషణలు (1993)
- చిత్రం భళారే విచిత్రం – సంభాషణలు (1992)
- ప్రెసిడెంటు గారి పెళ్ళాం – సంభాషణలు (1992)
- మామగారు – సంభాషణలు (1991)
- కలికాలం – సంభాషణలు (1991)
- అంకుశం – సంభాషణలు (1990)
- భలే దంపతులు – సంభాషణలు (1989)
- సాక్షి – సంభాషణలు (1989)
- యముడికి మొగుడు – సంభాషణలు (1988)
- కొత్త పెళ్ళికూతురు – సంభాషణలు (1985)
- శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం – సంభాషణలు (1985)
- డాకు – సంభాషణలు (1984)
- దేవాంతకుడు – సంభాషణలు (1984)
నటుడిగా[మార్చు]
· సోడ గోలీసోడ (2018)
- నా లవ్ స్టోరీ (2018)
- యాత్ర (2019)
- గల్ఫ్ (2017)
- గౌతమ్ నంద (2017)
- పటేల్ సర్ (2017)
- సుప్రీమ్ (2016)
- శ్రీశ్రీ (2016)
- నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ (2016)
- సినిమా చూపిస్త మావ (2015)
- మహారథి (2007)
- అల్లరి పిడుగు (2005)
- లక్ష్మీనరసింహా (2004)
- మాయా బజార్ (1995)
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-4-22-ఉయ్యూరు