కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -5(చివరిభాగం )
పంజే రాసిన సముదాయం లో 14గద్యరచనలు ,కధలు ఉన్నాయి .పురాణ శ్రవణ స్వాతిశయం ,ఒక వైద్యుడు వైద్యం కోసం గ్రామాలకు వెళ్లి అందమైన వంటలక్క ను ఏర్పాటు చేయమని అడగటం అది బెడిసికొట్టటం .మోటుహాస్యం తోకూడా రాశాడు .భార్యపై అనుమాన పడ్డ భర్త కనువిప్పు ఆమె ఎలా కలిగించిందో ఒక కథ .విజయ నగర సామ్రాజ్యం లో జరిగిన ఒక కథ ,ఔరంగజేబు కాలం నాటి శైలిని కథ ,దుర్గావతి ,దీవగిరికి చెందిన వీరమతి వంటి వాటిలో సాహసం ,ప్రేమ అచంచల త్యాగం చూపాడు .చండికా రహస్య సమాజ లో దేవి చౌదరాణి గురించి చెప్పాడు .
అబద్ధపు దినచర్య ఆయన ఇన్స్పెక్టర్ గా ఉన్న అనుభవాలు .ప్రభుత్వ అధికారులు పాములు జెర్రులు కొండ చిలువలు అని ఉపాధ్యాయ లోకం అనుకొంటుంది . ఇన్స్పెక్టర్ మాత్రం అపాయం లేని వాళ్ళు వాళ్ళ దృష్టిలో .నల్లజాతి వారిని అంటే హరిజనులను అభివృద్ధిలోకి తీసుకు రావాలని ఆయన దృక్పధం .రకరకాల ఉపాధ్యాయులు వారి బోధనా గురించి వివరించాడు .మంచి ఉపాధ్యాయులు , వారికి సమాజం ఇచ్చే గౌరవం కళ్ళకు కట్టించాడు .
ప్రకీర్ణాలు
అక్షరాభ్యాస పుస్తకాలు రేఖా చిత్రాలు కథలు కూడాపంజే రాశాడు శిశుసాహిత్యం లో .వీటిని మాక్మిలన్ కంపెని బాసెల్ మిషన్ బాలసాహిత్య మండలి ప్రచురించాయి .బాసెల్ వాళ్ళు కోరినట్లు ఆంగ్ల –కన్నడ నిఘంటువు పరిష్కరించి విస్తరించాడు .దీనిఆదాయంతో మంగుళూరు లోని గణపతి పాఠశాలలో జిల్లాస్థాయి శిశు సమ్మేళనం జరిపాడు .అప్పటికి ఇదే మొదటిది .కిట్టెల్ రాసిన కన్నడ –ఇంగ్లీష్ నిఘంటు పరిశోధనా చేసి వెయ్యి పదాలు అదనంగా చేర్చగలిగాడు .శబ్ద మణి దర్పణం కు చేసిన పరిష్కరణ అత్యుత్తమమైనది .
ఉపాధ్యుడుగా ,ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు పంజే విద్యా విషయ పత్రిక ఒకటి నడిపాడు .ఉపాధ్యాయులకు విద్యా బోధనా గురించి ,సామాన్యులకు బడులలో విద్యా బోధన ఎలా జరుగుతుందో తెలుసుకోవటానికి వ్యాసాలూ రాసేవాడు రాయి౦చేవాడు .బోధన అంటే ఏమిటి అనే మొదటిపుస్తకాన్ని దక్షిణ కన్నడ జిల్లా ప్రాధమిక పాఠ శాలనుంచి ప్రచురించాడు .శిక్షణ కన్నా బోధన అనే పదం విస్త్రుతమైన్దికనుక ఆయనకు బాగా నచ్చినది .బెత్తాలవాడకం ఇష్టపడేవాడు కాదు .
కవిత్వం
పంజే రాసిన గీతాలు శ్రవణానందంగా ఉంటాయి .సరళసుందర భాష ,రీతి ,అవసరమైతే నీతి ఉంటాయి .హృదయాలను కరిగించే గీతాలు రాశాడు .ఆయన ‘’దక్షిణపు గాలి ఆట’’ కు మించినది కన్నడ సాహిత్యం లో లేనే లేదు .హోలేయర హాడు ‘’అంటే మాలవారి గీతాలలో దీన జన స్థితినిని చూపేవి .మేము యాచకులం కాదు మాకు ఏవి కావాలో ఇవ్వాల్సిన బాధ్యత మీది. లేకపోతె మేమే లాక్కో వాల్సి వస్తుంది అంటూ వారిలో చైతన్యం చూపించాడు .దేశభక్తి రగుల్కొల్పే ప్రబోధ గీతాలెన్నో రాశాడు .
విద్యకు సరైన వాతావరణం కల్పించటం ,ప్రతిభను గుర్తించి ప్రోత్సహించటం ,విద్యారంగ వాతావరణాన్ని శుద్ధి చేయటం ,వ్యక్తిత్వ వికాసం కలిపించటం ,అందర్నీ సమానంగా చూసే సహృదయత ,బీదల దళితుల దీనుల ను ఉన్నత విద్యావంతులతో ,శిష్యులతో సమానంగా చూడటం ,సృజనాత్మక శక్తి పెంపొందించటం లో ఆనాడు మంగుళూరులో పంజే మంగేష్ రావు ,మైసూర్ లో టి ఎస్ . వెంకణ్ణయ్య ప్రాతస్మరణీయులుగా నిలిచారు .
ఆధారం –వి సీతారామయ్య కన్నడ రచనకు శ్రీ ఆర్వియెస్ సుందరం గారి తెలుగు అనువాద పుస్తకం –పంజే మంగేష రావు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-4-22-ఉయ్యూరు
వీక్షకులు
- 1,008,545 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.8 వ భాగం.28.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.92 వ భాగం. శ్రీ శంకరా ద్వైత0. చివరి భాగం.28.5.23.
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.7వ భాగం.27.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 91 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.27.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.90 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.27.5.23.
- ప్రముఖ హిందీ కవి నిరా లా సూర్య కాంత త్రిపాఠి.4 వ భాగం.25.5.23. గబ్బిట దుర్గా ప్రసాద్
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు 5 వ భాగం.25.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.89v వ భాగం. శ్రీ l శంకరా ద్వైత0 .25.5.23।
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.4 వ భాగం.24.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.88 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.24.5.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,974)
- సమీక్ష (1,329)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (490)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,077)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (375)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు