మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –245
245- నాటక సత్యభామ ఫేం ,రామదాసు తానీషా దేవదాసుధర్మన్న ,వస్త్రాపహరణ ,విదురుడు గా సినీ ఫేం-ఆరణి సత్యనారాయణ
ఆరణి సత్యనారాయణ (అరణి సత్యనారాయణ) (1898 నవంబరు 11 – 1969 జూలై 2) తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమా ప్రారంభ కాలంలో కొన్ని సినిమాలలో నటించాడు. [1
జీవిత విశేషాలు
అతను 1898లో గుంటూరు జిల్లా సంగడి గుంట గ్రామంలో జన్మించాడు. అతను 1912లో తన 14వ యేట గయోపాఖ్యానం నాటకంలో సత్యభామ పాత్రలో నటించాడు.
మూకీ సినిమాల కాలంలో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించాడు. అతనిని 1921లో ఆర్.ఎస్.ప్రకాష్ చిత్రసీమకు పరిచయం చేసాడు. తరువాత అతను ఘంటసాల బలరామయ్య నిర్మించిన రామదాసు (1933) (‘దేవదాసు’లో ధర్మన్న పాత్రధారి) సినిమాలో నటించాడు. [2] అతను 1936లో సరస్వతి టాకీస్ నుండి వచ్చిన ద్రౌపది వస్త్రాపహరణం సినిమాలో నటించిన విదురుని పాత్రకు గుర్తింపు పొందాడు.
అతను కనకతార, బాలయోగిని, ధర్మాంగద, రత్నమాల, లైలా మజ్ను చిత్రాలలో వివిధ పాత్రలలో నటించాడు.
అతను వినోదా పిక్చర్స్ లో అకౌంటెంత్ గా చేరాడు. వినోదా పిక్చర్స్ సినిమాలైన దేవదాసు, శాంతి సినిమాలలో నటించాడు.
సినిమాలు
- రామదాసు (1933) …. తానీషా
- బాలయోగిని (1936/I)
- ద్రౌపది వస్త్రాపహరణం (1936) … విదురుడు
- కనకతార (1937)
- చంద్రిక (1940)
- రత్నమాల (1947)
- ధర్మాంగద(1949)
- లైలా మజ్ను(1949)
- శాంతి (1952)
- దేవదాసు (1953) …. ధర్మన్న
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-22-ఉయ్యూరు
మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –246
246-నటుడు నిర్మాత ,విక్రమార్క్ విజయం ,రాజద్రోహి నిర్మాణ ఫేం –పింజల సుబ్బారావు
పింజల సుబ్బారావు ప్రసిద్ధి చెందిన చలనచిత్ర నిర్మాత. ఇతని స్వస్థలం మచిలీపట్నం.
సినిమారంగం
1957లో ఇతడు సినిమాలలో నటించాలని మద్రాసు చేరుకున్నాడు. ఐదేళ్లపాటు పలు చిత్రాలలో చిన్నచిన్న వేషాలు వేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణా ఫిలిమ్స్ సంస్థలో ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా చేరి రామాంజనేయ యుద్ధం, సతీ సుకన్య చిత్రాలకు పనిచేశాడు. తరువాత కొంతకాలం చిత్రాల క్రయవిక్రయాది వ్యాపారాలు చేశాడు. పిమ్మట చలనచిత్ర నిర్మాణరంగంలో ప్రవేశించాడు[1].
ఇతడు నిర్మించిన సినిమాలు:
- రాజద్రోహి
- హంతకులొస్తున్నారు జాగర్త
- రణభేరి
- పేదరాశి పెద్దమ్మ కథ
- లక్ష్మీ కటాక్షం
- సుగుణసుందరి కథ
- విక్రమార్క విజయం
- రౌడీలకు రౌడీలు
- పిల్లా? పిడుగా?
- సీతాకళ్యాణం
- సీతారామ వనవాసం
- అడవి మనుషులు
- లక్ష్మీపూజ
- మహాశక్తి
- త్రిలోక సుందరి
- రాణీ ఔర్ జాని (హిందీ)
- యే రిస్తీ నా తుహై (హిందీ)
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-22