మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -251
251-నాటక నటన శిక్షణ ,ప్రదర్శన చేసి పివి రాసిన గొల్లరామప్ప ను నాటకీకరించి ,నాటక సిలబస్ రూపొందించుకొని ,అర్ధశతాబ్దం ,పుష్ప ,భీమ్లా నాయక సినీ ఫేం –అజయ్ మంకేనపల్లి
అజయ్ మంకెనపల్లి రంగస్థల, సినిమా నటుడు, నాటక రంగ గురువు. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించిన అజయ్ మంకెనపల్లి మధ సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి,అర్థ శతాబ్దం,ఆకాశవాణి మొదలైన చిత్రాలలో నటించాడు.[1]
రంగస్థల ప్రస్థానం
అజయ్ క్రియేటివ్ థియేటర్ అనే సంస్థను 2016లో స్థాపించి నాటక రంగంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. తానే స్వయంగా నాటకాలు రచించి దర్శకత్వం వహించి థియేటర్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సహకారంతో నాటకరంగంలో పరిశోధన చేస్తున్న అజయ్ మంకెనపల్లి, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నాటకాలలు శిక్షణనిస్తూ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రచించిన గొల్ల రామవ్వ కథను నాటకీకరించి.. ఆ నాటకానికి దర్శకత్వం వహించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. రఘుబాబు జాతీయ నాటకోత్సవాలలో గొల్ల రామవ్వ నాటకానికి ఉత్తమ ప్రతినాయకుడు , బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్‌గా రెండు అవార్డులు అందుకున్నారు. షేక్‌స్ఫియర్ నాటకాన్ని తెలుగులో నాటకీకరించి ప్రదర్శించారు. ఇప్పటివరకు 500 మందికి పైగా నేటి తరం నూతన నటీనటులకు శిక్షణ ఇచ్చి నటనపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. నాటకరంగం లోనే కాకుండా తనదైన ముద్రను సినిమారంగంలో ఉండేలా అనేక చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు పది సినిమాల్లో గుర్తించదగ్గ పాత్రల్లో నటించారు.
తన క్రియేటివ్ థియేటర్[2]<nowiki> ద్వారా నటనపై ఆసక్తి ఉన్న ఎంతో మంది యువతి యువకులను నటులుగా తయారుచేస్తున్నాడు. నటన అంటే కేవలం అనుకరణ కాదని, అందులో జీవించడం ద్వారానే సహజంగా నటించగలరు అనే విషయాన్ని బలంగా నమ్మిన వ్యక్తి అజయ్. అదే తన క్రియేటివ్ థియేటర్ వర్క్ షాప్ ద్వారా కొత్త నటులకు నేర్పుతున్నారు. తన కంటూ ఒక సిలబస్ రూపొందించుకొని తనదైన ప్రత్యేక ముద్రను నాటక రంగంలో కనబరుస్తున్నారు. క్రియేటివ్ థియేటర్ ఇప్పటి వరకు మూడు వర్క్ షాప్‌లు నిర్వహించింది. క్రియేటివ్ థియేటర్ తయారుచేసిన నటులతోనే ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్ రచించిన అసమర్ధుడు[3][4]నాటకం అజయ్ మంకెనపల్లి దర్శకత్వంలో నాటకం రూపొందించారు. అది ఇప్పటికే రెండు సార్లు రవీంద్రభారతిలో ప్రదర్శించబడింది. మెర్సీ రాసిన మరో నాటికం త్రిపుర శపథం కూడా అజయ్ మంకెనపల్లి దర్శకత్వంలో రవీంద్ర భారతిలో జనవరి 5న ప్రదర్శించబడింది.
నటించినవి
నాటకాలు:
1. గాడ్ మంకీ డెవిల్
2. ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్
3. ఆలోచన, 7 మార్పు
4. పలనాటి యుద్ధం
5. నిశ్శబ్దం
6. జ్యోతిరావు పూలే
7. నాయకురాలు
8. బతుకమ్మ
9. రజాకార్
10. నోటు భారతం
11. జయ జయహే తెలంగాణ
12. గొల్ల రామవ్వ
13. స్వక్షేత్రం
14. గాలి గోపురం
15. కాగితం పులి
16. గబ్బర్ సింగ్
17. జంబుద్వీపం
18. లోకా సమస్తా సుఖినోభవంతు
దర్శకత్వం వహించిన నాటకాలు
1. అసమర్ధుడు
2. త్రిపుర శపథం
3. గొల్ల రామవ్వ
4. గాడ్ మంకీ డెవిల్
5. ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్
6. నానాజాతి సమితి
7. ఆలోచన
8. మార్పు
నటించిన సినిమాలు
1. అర్ధ శతాబ్దం
2. ఆకాశవాణి
3. ఘోడా
4. పుష్ప
5. ఉస్తాద్
6. సైరా నరసింహారెడ్డి
7. మధ
8. భీమ్లా నాయక్
బహుమతులు
1. తెలుగు విశ్వవిద్యాలయం – రంగస్థల యువ పురస్కారం 2021-2022
2. జాతీయ రఘుబాబు నాటకోత్సవాల్లలో గొల్ల రామవ్వ నాటకానికి గాను ఉత్తమ నాయకుడు, బెస్ట్ సపోర్టింగ్ రోల్)
3. యూత్ అవార్డు 2021
4. సింగిడి యంగ్ డిస్టింగ్విష్డ్ అవార్డ్స్
252-రంగస్థల ,టివి దర్శకుడు ,నంది అవార్డ్ విన్నర్ ,బావాబా పన్నీరు ,చీకటి సూర్యులు ,రైతురాజ్యం ,బతుకమ్మ సినీ నటన ఫేం –అమరేంద్ర బొల్లం పల్లి
అమరేంద్ర. బి రంగస్థల, టీవీ నటుడు, దర్శకుడు, సినిమా నటుడు.[1]
జననం – విద్యాభ్యాసం
అమరేంద్ర 1952, ఆగష్టు 8 న బొల్లంపల్లి వేంకటహరి, ఆండాళమ్మ దంపతులకు హైదరాబాద్లో జన్మించాడు. బి.ఏ. వరకు చదువుకున్నాడు. పి.జి. డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ లో చేరి నటన, దర్శకత్వంలో శిక్షణ పొందాడు.
వివాహం – పిల్లలు
కల్పనశ్రీతో 1977, జూన్ 7న అమరేంద్ర వివాహం జరిగింది. వారికి ఇద్దరు అమ్మాయిలు (స్పందన, భావన)
ఉద్యోగ జీవితం
వజీర్ సుల్లాన్ టొబాకో కంపనీలో సీనియర్ బ్లెండింగ్ అధికారిగా పనిచేసి, 1997లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు.
నాటకరంగ ప్రస్థానం
అమరేంద్ర, తన పెద్దన్నయ్య భాను ప్రకాష్ ప్రోత్సాహంతో పత్తర్ కే ఆన్సూ అనే హిందీ నాటకంలో నాటకరంగ ప్రవేశంచేశాడు.[2] వివిధ సంస్థలలో 4వేల వరకు నాటిక, నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. మొదటిసారిగా ఎన్.ఆర్. నంది రాసిన వాన వెలిసింది నాటికకు దర్శకత్వం వహించాడు. 1972లో రవి ఆర్ట్స్ సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన నాటిక పోటీలలో ఉత్తమ దర్శకుడిగా బంగారు పతకం అందుకున్నాడు. అనేక నాటక పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు.
1969లో ఆదర్శ యువభారతి అనే సంస్థను ప్రారంభించి, ఆ సంస్థ ఆధ్వర్యంలో నాటిక, నాటక ప్రదర్శనలు ఇస్తున్నాడు.
బహుమతులు
నంది బహుమతులు:
1. ఉత్తమ ప్రతినాయకుడు – నంది నాటక పరిషత్తు – 2016[3]
పురస్కారాలు – సత్కారాలు:
1. తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ సత్కారం[4]
టీవిరంగ ప్రస్థానం
తూర్పు పడమర, మిస్టరీ, జీవన తీరాలు, ధరణికోట, ధూర్జటి, పోతన, ఫ్యాక్షన్ – ఫ్యాక్షన్, కాశీమజిలీ కథలు, ఊహల పల్లకి, మాయాబజార్, మంచుపర్వతం, ఉషోదయం, విధి, పద్మవ్యూహం, ఎండమావులు, అనురాగదార, ఓ అమ్మకథ, బుజ్జి – బజ్జిబాబు, కథా స్రవంతి, శ్రావణీ సుబ్రహ్మణ్యం వంటి దాదాపు 250 సీరియళ్లలో నటించాడు.
సినీరంగ ప్రస్థానం
అమరేంద్ర నటించిన ఆందమే ఆనందం నాటిక చూసిన జంధ్యాల విచిత్రప్రేమ సినిమాలో అమరేంద్రకు అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత బావా బావా పన్నీరు, విషజ్వాల, చీకటి సూర్యులు, కూలన్న, రైతురాజ్యం, ఊరుమనదిరా, భీముడు, వేగుచుక్కలు, గంగమ్మ జాతర, వీరివీరి గుమ్మడి పండు, అమ్మమీద ఒట్టు, బతుకమ్మ, వీర తెలంగాణ, పోరు తెలంగాణ, రాజ్యాధికారం[5] మెదలైన సినిమాలలో నటించాడు.
253-రంగస్థల ,హరికధా కళాకారుడు ,నారద ,లక్ష్మణ ఫేం ,సక్కుబాయి లో శివయోగి ,ధర్మరాజు సినీ ఫేం,హరికధా కంఠీరవ –చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్
చొప్పల్లి గా ప్రసిద్ధిచెందిన చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ సుప్రసిద్ధ హరికథా కళాకారుడు, రంగస్థల, సినిమా నటుడు.[1]
ఈయన విజయనగరం జిల్లా లోని చొప్పల్లి గ్రామంలో సెప్టెంబరు 19 1905 తేదీన జన్మించాడు. వైణిక విద్వాంసుడైన చొప్పల్లి నరసింహం, సూరమాంబ ఈయన తల్లిదండ్రులు. ఆనాడు విజయనగరం మహారాజైన ఆనంద గజపతి నాటక సమాజంలో నటించి ప్రజల, ప్రభువుల మన్ననలు పొందినవాడు నరసింహం. తండ్రి ప్రోత్సాహం చొప్పల్లిని నటునిగా తీర్చిదిద్దాయి.
విజయనగరం మహారాజా కళాశాలలో ఎస్.ఎస్.ఎల్.సి. పాసయ్యాడు. తర్వాత శ్రీవాణీ విలాస్ అమెచ్యూర్ కంపెనీలో చేరి అనాసపురపు గోపాలరావు సరసన రసపుత్ర విజయం నాటకంలో వీరమాత పాత్ర పోషించి మొదటిసారిగా రంగస్థల ప్రవేశం చేశాడు. తర్వాత ప్రహ్లాదలో నారదుడు, లవకుశలో లక్ష్మణుడుగా పాత్రలు పోషించాడు. తర్వాత ప్రసిద్ధ నటులైన యడవల్లి, పారుపల్లి, ఆంజనేయులు మొదలైన వారితో కలిసి ద్రౌపదీ వస్త్రాపహరణం, గయోపాఖ్యానం, సక్కుబాయి మొదలైన నాటకాలలో నటించాడు. ముఖ్యంగా సక్కుబాయిలో శివయోగి, పాండవ నాటకంలో ధర్మరాజు పాత్రలు ఆయనకు అఖండమైన ప్రఖ్యాతిని చేకూర్చాయి.
చొప్పల్లి తొలినాటి చలనచిత్ర రంగంలో ప్రవేశించి సక్కుబాయి (1935) సినిమాలో శివయోగి పాత్రను, ద్రౌపదీ వస్త్రాపహరణం (1936) లో ధర్మరాజు పాత్రను, కచ దేవయాని (1938) లో శుక్రాచార్యుడుగా, రుక్మిణీ కళ్యాణంలో అగ్నిద్యోతనుడుగాను, మీరా బాయి (1940) లో రూపగోస్వామి మొదలైన పాత్రలు ధరించి కీర్తిని గడించాడు.
1929లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో హరికథకుడిగా ప్రవేశించి అనేక హరికథ లను గానం చేశాడు. పండితుల చేత “హరికథా కంఠీరవ” అనే బిరుదును పొందారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-22-ఉయ్యూరు