రాంగేయ రాఘవ -1
రాంగేయ రాఘవ -1
అనే పుస్తకాన్ని హిందీలో మధురేశ్ రాస్తే ,తెలుగు అనువాదం జ్వాలాముఖి చేస్తే ,సాహిత్య అకాడెమి 1998లో ప్రచురించింది. వెల-25రూపాయలు .
ముందుమాటలలో జ్వాలాముఖి చెప్పిన ముఖ్య విషయాలు .’’నలభైఏళ్లు కూడా జీవించని రాఘవ పాతికేళ్ళు రచనా వ్యాసంగం లో గడిపాడు .సాహిత్య వ్యాసంగానికి అడ్డు వస్తుందని వివాహం కూడా ఆలస్యంగా ,కాబోయే భార్య సాహిత్యోపజీవి సులోచనను 33ఏట పెళ్లి చేసుకొన్నాడు .ఆరేళ్ళ దాంపత్యంలో కూతురు సీమంతిని కి జన్మనిచ్చారు అదంపతులు .మెడ మీద పుట్టిన రాచపుండు బ్లడ్ కాన్సర్ కి దారితీసి రాఘవ అకస్మాత్తుగా మృత్యువు ఒడికి చేరాడు .
ఎం ఎ పిహెచ్ డి అయినా ,ఉద్యోగాలు తలుపు తడుతూనే ఉన్నా ,రచనే జీవిత వృత్తిగా తీసుకొని అయినవారికీ కానివారికి దూరమయ్యాడు .పుంఖాను పుమ్ఖంగా రాసినా ప్రచురణ కర్తలు బాగుపడ్డారే తప్ప ఆయనకు కీర్తి తప్ప ఏదీ మిగల్లేదు .ఆర్ధికం కున్గాదీసినా కేన్సర్ కోతపెట్టినా ,జీవితావసరాలు గీ పెట్టినా ,ఉద్యోగం చేయలేదు రచన మానలేదు .ఉన్నవి అమ్ముకొని జీవిక సాగించాడు .
రచనకు స్వేచ్చ ముఖ్యం అనేవాడు రాఘవ .సత్యాన్వేషణతో సాహిత్యం లో శాశ్వతత్వం సాధించాలని రాఘవ ఆలోచన .అభ్యుదయం ,మానవ వికాసం ,చారిత్రకదృష్టి సమసమాజం ,అంతఃకరుణ ,అన్యాయ ప్రతిఘటన,దోపిడీ నిర్మూలన అతని రచనలకు ప్రేరణ .హిందీలో మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ దృష్టిని ప్రవేశపెట్టిన వాడు రాంగేయ రాఘవ .సామ్రాజ్యవాద వైఖరినీ ,ఫాసిజాన్నీ ,దాని వికృత చేష్టల్ని,దేశ విభజన విషాదాన్నీ ఎండగట్టాడు .పరాధీనమానవుల్ని స్వార్ధ పరులు ఎలాదగా చేస్తారో చూపాడు .భారతీయ చారిత్రిక పరిణామాన్ని ,మనవ వికాసానికి నిల్చిన మైలురాళ్ళను ,పాత్రల్నిచూపిస్తూ ‘’గాధలు ‘’నాలుగు భాగాలుగా’’మహాయాత్ర ‘’గా రాయాలనుకొని రెండు భాగాలు మాత్రమె రాయగలిగాడు .మానవ వికాస చింతన ,సత్యాన్వేషణ ఆయన ఆకాంక్ష.అతని ‘’అంతర్భుక్తి సిద్ధాంతం జ్ఞాన చక్షువు .
పౌరాణిక పాత్రలైనద్రౌపది భీష్ముడు యుధిష్ఠిరుడు మొదలైన వారిని గొప్ప తర్కం తోఆవిష్కరిస్తూ వారు తమయుగ యదార్దాలలో ఉంటూ కూడా యుగాతీత౦ గా వర్తి౦చారని చెప్పాడు .దీన్ని విభేదించిన మైధిలీ శరణ గుప్తాకు జవాబురాస్తూ ‘’మనం స్థిరపడి పోయిన భావాలకు బందీలైతే సత్య సాక్షాత్కారం జరగదు ‘’అని సుదీర్ఘ లేఖ రాశాడు .ఈ లేఖ ‘’సాహిత్యలక్ష్య లక్షణ వివరణ ‘’కు అత్యుత్తమ ఉదాహరణగా నిలిచి పోయింది .రామానుజా చార్య సంస్కరణాభి లాషనూ మహోత్తమంగా వివరించాడు రాఘవ .
దేశాభిమానం లేకుండా వామాచారం పెరగటం వలన బౌద్ధం నశించింది అనీ ,జైనం ముందుకు సాగిందనీ అన్నాడు .క్షత్రియుల్ని గెలిచి భూమిని అంతా పరశురాముడు బ్రాహ్మణులకు ధారపోస్తే చివరికి ఆయనకు నిలవటానికి చోటే లేకుండా పోయిందన్నాడు .తర్వాత యుగాలలో బ్రాహ్మణ క్షత్రియులు కలిసి పోరాటం చేయాల్సి వచ్చింది అన్నాడు .ఋగ్వేదం రూపాంతరం చెంది సామవేదం అయి౦దన్నాడు .ఇంగ్లీష్ వారు విమర్శించి నందువలననే ‘’వాజిదలీషా’’అందరి దృష్టిలో పడి,సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా భారతీయ సైన్యాన్ని సమీకరించిన ధీరుడు అని మెచ్చాడు రాఘవ..పతనమవుతున్న నవాబుల యుగం వాడు కావటం అతడి దురదృష్టం .అయినా అతడిని ప్రజలు విపరీతంగా ప్రేమించి ఆరాదించారు ,ఆతర్వాత నాయకుడు లేకుండానే ప్రజలు బ్రిటిష్ వారిని ఎదిరించారని చారిత్రిక అర్ధం చెప్పాడు .కపాయి అక్బర్ ఏ విధంగానూ సమర్ధనీయుడు కాదు అని చారిత్రిక సత్య శోధన చేసి వివరించాడు రాఘవ .
మేధావి రచయితా గా రాంగేయ రాఘవ హిందీ రచయితలలో అగ్రగామిగా ఉన్నాడు .అతడిలో తర్కం ,వివేకం తోపాటు అంతఃకరణ కనిపిస్తుంది .ప్రేం చంద్ తో సమానంగా ‘’గదల్ కధ రాశాడు .చారిత్రకరచనలో రాహుల్ సాంకృత్యాయన్ ,నవలా రచనలో యశ్పాల్ ,ప్రేమ చ౦ద్ లను ,కావ్య రచనలో జయశంకర ప్రసాద్’’నిరాలా ‘’ను ,సాహిత్య విమర్శలో రామ చంద్ర శుక్ల ,రాం విలాస్ శర్మలకు దీటైనవాడు రా౦గేయ రాఘవ .బెంగాల్ కరువును ప్రత్యక్షంగా వెళ్లి చూసి రాసిన ‘’తుఫానోం కే బీచ్ ‘’ ఆధునిక పత్రికారిపోర్టింగ్ కు శ్రీకారం .పోలీస్ కాల్పుల్ని నిరసిస్తూరాసిన ‘యహ్ గ్వాలియర్ హై’’,అతడి కార్మికవర్గ స్నేహ భావానికి అద్దంపట్టింది .అరసం అనే ‘’ప్రగతి శీల అభ్యుదయ సంఘం ‘’తో రాఘవ సాహిత్యం పెనవేసుకు పోయింది .అతడు మనయుగం లో నిజాయితీ నిబద్ధత ఉన్న రచయిత ,మానవతా ప్రవక్త ,వికాస పరిశీలకుడు ,చరిత్రలో విజ్ఞాతా బాధ్యతలు తెలిసిన సంస్కారి .అ౦తటి రచయిత నభూతో న భవిష్యతి ‘’అతని గురించి అతడి సాహిత్యం గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి 1990 మే 31 న నేను రాఘవ కుటుంబాన్ని అంటే భార్య సులోచన కూతురు సీమంతిని అల్లుడు అశోక్ శాస్త్రిని ప్రత్యక్షంగా చూడటానికి జైపూర్ వెళ్లాను .రాఘవ జ్ఞాపకాలు ఇంకా వారిలో నిండి ఉన్నాయి సంతృప్తి కలిగింది .సులోచన జైపూర్ యూని వర్సిటిలో సోషియాలజీలెక్చరర్ , భర్త జ్ఞాపకాలను ‘’పునః ‘’రాసి భద్ర పరుస్తోంది .భర్త రాఘవపై ఆమె రాసిన వాటికి టివి లో సంభాషణలు రాస్తున్నాడు .కూతురు ఇంగ్లీష్ లెక్చరర్ ,.రాఘవ రాజస్థానీ వాడుకావటం, హిందీ వాడు కాకపోవటం తో హిందీ సాహిత్యంలో నిర్లక్ష్యానికి గురయ్యాడు .’’ద్రావిడ వాది ‘’అనే ముద్రకూడా వేశారు .నిజానికి రాఘవ తన యుగ పరిధుల్ని దాటి సత్యాన్ని సాక్షాత్కారి౦పజేసిన ‘’స్రష్ట ‘’.మార్గ దర్శకుడు .ఆకుటుంబం అంతా రాఘవ జ్ఞాపకాలతో జీవిస్తున్నారని తెలుసుకొని సంతృప్తి చెందాను ‘’ అన్నాడు జ్వాలాముఖి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-22-ఉయ్యూరు