• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-264
• 264-ఆంధ్రాలో మొదటి ధియేటర్ మారుతిటాకీస్ నిర్మాత ,ఎన్నెన్నో మూకీ చిత్రాలు ఆడించిన –పోతిన శ్రీనివాసరావు
•
మూకీ సినిమాలు
వచ్చిన తొలిరోజుల్లో సినిమా (ప్రారంభానికి ముందు హాల్లో దీపాలు
ఆర్చితే, జనం “దీపాలు ఆర్బకండి బాబోయ్, మాకు భయం” అని అరిచే
వారట. కొన్నాళ్ళకి గాను అది సర్దుకోలేదు. అమెరికాలో మొదటిసారి
సినిమా చూసిన వాళ్లు, హీరోయిన్ క్టోజప్ రాగానే “దగా! మోసం! ఆవిడ
నడుమూ కాళ్లు ఏవీ?” అని గట్టిగా అరిచారట. అలాగే మన తెలుగు
సినిమా మాట నేర్చుకున్న కొత్తల్, ఒక పాత్ర పద్యం చదువుతూ వుంటే
ఇంకో పాత్ర ‘రియాక్షన్’ షాటు వేస్తే ఒప్పుకునే వారు కాదుట. పద్యమో,
పాటో పాడుతున్న పాత్రే కనిపించాలి!
ఈ మాటలు ఆంధ్రదేశంలో మొదట సినిమా థియేటరు కట్టించిన
పోతిన శ్రీనివాసరావు గారు చెప్పేవారు. ఆయన చాలా మూకీలు తెప్పించి,
ఆంధ్రలో ఆడించారు. “ఒక పౌరాణిక మూకీ చిత్రంలో భీముడికి మ
మీసం ఊడిపోతుంది. అది ఆ సినిమా తీసిన వాళ్లు గమనించలేదు కానీ,
(ప్రేక్షకులు గమనించారు. “మీసం ఊడీన భీముడు, మీసం జారిపోయిన
భీముడు” అని గోల చేశారు. ఊరంతా ప్రచారం కూడా చేశారు. “ఆ
(ప్రచారాన్ని ఖండిస్తూ, నేను ఇంకొక ప్రకటన చేయించాను. “ఇవాళ
ీముడికి మీసం ఊడదు. దయచేసి రండి” అని మేళతాళాలతో చెప్పించాను. నేను ఆపరేటరుతో చెప్పి మీసం ఊడిన భాగాన్ని కత్తిరించేసి అతికేయమన్నాను. అంతే! అది ఎవరికీ తెలియలేదు గనుక, అందరూ సంతోషించారు” అని చెప్పారు శ్రీనివాసరావు. ఐతే, ‘కదిలే బొమ్మ’ జనానికి వింత కలిగించినా, జనం ఎక్కువగా వచ్చేవారు కాదుట. ఎదురుగా పాత్రలు కనిపిస్తూ పాటలూ పద్యాలూ పాడుతున్న నాటకాలకే ఎగబడే వారుట.
“అంచేత మేము సినిమా మధ్యలో ఉచితంగా
సోడాలు, కిల్లీలూ ఇస్తామని ప్రకటనలు వేసే వాళ్లం. వాటికోసమైనా జనం వస్తారేమోనని. ఊళ్లో నాటక యు స్య లేకపోతే ళా వచ్చేవారు. మొత్తానికి మూకీ చిత్రాల ప్రదర్శన నష్టాలతోనే నడిచింది”
అని శ్రీనివాసరావు చెబుతూ వుండేవారు.
దాదాఫాల్కే కూడా ఇలాంటి అవస్థలే ఎదుర్కొన్నాడు. ‘లంకా దహనం’
తీసినప్పుడు “నిజంగానే లంకా దహనం కనిపిస్తుంది – రండి” అన్నట్టుగా
ప్రకటనలు చేయించాడు. హనుమంతుడు లంకను దహనం చేస్తున్న దృళ్యం
రాగానే, ప్రొజెక్టర్ ముందు ఎర్రని అద్దం ముక్క పెట్టి చూపించగానే, బొమ్మ
ఎర్రబారింది. నిజం గొనే మండుతున్న భ్రాంతి కలిగింది. మొదటి రోజున ప్రేక్షకుల్లో
సినిమాల్లో మొట్ట మొదటి కృష్ణ పాత్రధారి రఘురామయ్యే. పోతిన
శ్రీనివాసరావు తీసిన పృథ్వీ పుత్ర’ (1934లో కృష్ణుడు. మరికొన్ని చిత్రాల్లో
నారదుడు. కృష్ణ నారద పాత్రలు ఆరోజుల్లో ఆయనే ఎక్కువగా నటించారు.
జానపద చిత్రం ‘గొల్లభామ’లో హీరో. ఒకే ఒక్క సాంఘిక చిత్రం
‘పంతులమ్మ’లో నటించినట్టు జ్ఞాపకం. సినిమాల్లో నటిస్తున్నా నాటకాలు
వదల్లేదు. అయితే నాటకంలో ఏ పాత్ర ధరించినా సరే, నాటకాంతంలో..
రఘురామయ్య చేత ప్రేక్షకులు గోలా గగ్గోలూ పెట్టి ఈలపాట
పాడించుకునేవారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-22-ఉయ్యూరు
• —
•