• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-266
• 266-చమ్రియా టాకీస్ డిస్ట్రిబ్యూషన్స్ అధినేత ,ఆంద్ర ,దక్షిణ భారత చలన చిత్రమండలి అధ్యక్షుడు ,శాంతినివాసం ,వీరాభిమన్యు వంటి హిట్ చిత్ర నిర్మాత –సుందర్‌లాల్ నహతా
• సుందర్ లాల్ నహతా చలనచిత్ర పంపిణీదారు, నిర్మాత[1].
వృత్తి
ఇతడు కలకత్తా విశ్వవిద్యాలయంలో బి.కాం.పట్టా పుచ్చుకుని 1941లో మద్రాసులో “చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్” అనే సంస్థకు మేనేజర్‌గా చేరాడు. ఆ సంస్థ యజమాని, ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ అధినేత చమ్రియా ఇతని వ్యవహార నైపుణ్యాన్ని చూసి మెచ్చుకుని కొంత కాలానికే ఆ సంస్థలో భాగస్వామిగా చేర్చుకున్నాడు. యుద్ధం భయంవల్ల 1943లో చమ్రియా సంస్థ మద్రాసు నుండి విజయవాడకు తరలించబడి 1953 వరకు విజయవాడలోనే నడుపబడింది. ఆ సమయంలో సుందర్‌లాల్ తన సంస్థను చూసుకుంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో సహాయకారిగా ఉన్నాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను వెలుగులోనికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు. ఆ సమయంలో ఆంధ్ర చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడిగా కూడా ఎన్నికైనాడు.
1950లో ఇతడు తారాచంద్ బర్జాత్యా తో కలిసి రాజశ్రీ పిక్చర్స్ అనే సంస్థను ప్రారంభించి అనేక సినిమాలను నిర్మించాడు. తరువాత ఇతడు శ్రీ ప్రొడక్షన్స్, రాజలక్ష్మి ప్రొడక్షన్స్, విజయలక్ష్మి పిక్చర్స్ వంటి సంస్థలను ప్రారంభించి తెలుగు, తమిళ చిత్రాలను నిర్మించాడు. ఇతని చిత్రాలన్నీ అఖండమైన విజయాన్ని సాధించాయి.
ఇతడు ఇండొనేషియా దేశం జకార్తాలో జరిగిన రెండవ ఆసియా-ఆఫ్రికా చలనచిత్రోత్సవంలో భారతదేశం తరఫున పాల్గొన్నాడు. 1968లో జర్మనీ ప్రభుత్వం ఆహ్వానంపై జర్మనీలో జరిగిన ఎగ్జిబిషన్‌కు హాజరయ్యాడు. ఇతడు దక్షిణ భారత చలనచిత్ర మండలికి కూడా అధ్యక్షుడిగా వ్యవహరించాడు[1].
సినిమాల జాబితా
నిర్మించిన సినిమాల జాబితా:
తెలుగు
• జయం మనదే (1956)
• సతీ అనసూయ (1957)
• మంచి మనసుకు మంచి రోజులు (1958)
• శభాష్ రాముడు (1959)
• అభిమానం (1960)
• శాంతి నివాసం (1960)
• రక్తసంబంధం (1962)
• బందిపోటు (1963)
• గుడిగంటలు (1964)
• వీరాభిమన్యు (1965)
• గూఢచారి 116 (1966)
• మరపురాని కథ (1967)
• ఆస్తులు అంతస్తులు (1969)
• కర్పూర హారతి (1969)
• మారిన మనిషి (1970)
• మొగుడా- పెళ్ళామా (1975)
• చేసిన బాసలు (1980)
• రహస్యగూఢచారి (1981)
హిందీ
• ఫర్జ్ (1967)
• జిగ్రీ దోస్త్ (1969)
• ప్యార్ కీ కహానీ (1971)
మలయాళ౦
• శాంతి నివాస్ (1962)
• కనకచిలంగ (1966)
కన్నడ
• వీరకేసరి (1963)
• నాటి మేటి నటుల్లో ఒకరైన టి.యల్. కాంతారావు పేరు చెప్పగానే ఆయన కత్తి పట్టి కదం తొక్కిన చిత్రాలు, నారద పాత్రతో అలరించిన వైనం గుర్తుకు వస్తాయి. సాంఘిక చిత్రాల్లోనూ కాంతారావు హీరోగా అలరించారు. రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన సాంఘిక చిత్రాలలోనూ కాంతారావు నటించి ఆకట్టుకున్నారు. సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన ‘ఖైదీ కన్నయ్య’ చిత్రంలో కాంతారావు హీరోగా నటించారు. 1962 మార్చి 1న విడుదలయిన ఈ చిత్రం జనాన్ని ఆకట్టుకుంది.
• కన్నయ్య బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. బ్యాంకు నుండి డబ్బు తీసుకు వస్తూండగా పాపారావు అనేవాడు కొట్టేస్తాడు. కన్నయ్య తల్లిలేని కొడుకును కూడా పాపారావు, అతని మిత్రుడు కిడ్నాప్ చేస్తారు. డబ్బు పోగొట్టిన నేరంపై కన్నయ్యను అరెస్ట్ చేస్తారు. జైలులో ఉండగా, తన కొడుకు చనిపోయాడని తెలుస్తుంది. అదే సమయంలో జైలర్ కొడుకు రవి అతనికి దగ్గరవుతాడు. దుర్గారాయుడు అనే దుర్మార్గుడు తాను జైలు నుండి తప్పించుకోవడానికి జైలర్ కొడుకు రవిని కిడ్నాప్ చేసి తీసుకుపోతాడు. రవిని వెదికి తెచ్చేందుకు కన్నయ్య కూడా తప్పించుకుంటాడు. రవికి తాను నేర్పిన పాట కారణంగా అతని జాడ తెలుసుకుంటాడు కన్నయ్య. చివరకు బాబును కన్నవారి చెంతకు చేరుస్తాడు. పాపారావు, దుర్గారాయుడును చట్టం శిక్షిస్తుంది. కన్నయ్య నిర్దోషి అని తేలుతుంది. తనను ప్రేమించిన మాధవిని కన్నయ్య పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
• ఈ చిత్రంలో కాంతారావు, రేలంగి, గుమ్మడి, రాజనాల, కేవీయస్ శర్మ, బాలకృష్ణ, రాజసులోచన, గిరిజ, సంధ్య, మల్లీశ్వరి, రాజరత్నం తదితరులు నటించారు. ఈ సినిమాకు రాజన్ – నాగేంద్ర సంగీతం సమకూర్చారు. ఇందులోని పాటలన్నీ జి.కృష్ణమూర్తి కలం నుండి జాలువారాయి. “ఈ నిజం తెలుసుకో… మనిషిగా మసలుకో…”, “తియ తీయని తేనెమాటలతో…”, “యవ్వనం అది…”, “చోటెక్కడ చూసెదెప్పుడు…”, “అందాల కళ్ళు చూడు…”, “ప్రేమకు కానుక కావలెనా…” వంటి పాటలు అలరించాయి.
• హిందీలో విజయం సాధించిన ‘ఖైదీ నంబర్ 911’ సినిమా ఆధారంగా ‘ఖైదీ కన్నయ్య’ తెరకెక్కింది. ఈ సినిమాకు ప్రముఖ చిత్రకారుడు, తరువాతి రోజుల్లో దర్శకునిగా ఎంతో పేరు సంపాదించిన బాపు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశారు. పలు కార్టూనులతో ఈ చిత్ర ప్రచారం సాగింది. దానిని అప్పట్లో వింతగా చెప్పుకున్నారు జనం. ‘ఖైదీ కన్నయ్య’ తెలుగులోనూ మంచి విజయం సాధించి, శతదినోత్సవం చూసింది.
• (2022 మార్చి 1న ‘ఖైదీ కన్నయ్య’కు 60 ఏళ్ళు)
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-22-ఉయ్యూరు
•
•
•
• —
•